రెండు డిస్‌ప్లేలు, 50MP కెమెరా, 66W ఛార్జింగ్ సపోర్టు, అదిరిపోయే డిజైన్ కలిగిన 5G ఫోన్ పై రూ.5000 డిస్కౌంట్.
భారత్ మార్కెట్లో ప్రముఖ స్మార్ట్‌ఫోన్‌ల తయారీ సంస్థ లావా మిడ్ రేంజ్ ధరలో ఓ స్మార్ట్‌ఫోన్‌ను లాంచ్ చేసింది. ఈ ఫోన్ వెనుక వైపు కూడా చిన్న డిస్‌ప్లేను (Insta Display) కలిగి ఉంటుంది. ఈ ఇన్‌స్టా డిస్‌ప్లే ఈ ఫోన్‌కు ప్రధాన ఆకర్షణగా ఉంది. ఈ చిన్న డిస్‌ప్లే ద్వారా నోటిఫికేషన్‌లు సహా అనేక విధాలుగా ఉపయోగించుకోవచ్చు. దీంతోపాటు ఈ హ్యాండ్‌సెట్ ఐఫోన్ తరహాలో యాక్షన్ కీ ను కూడా కలిగి ఉంది. డిజైన్ పరంగానూ ఈ హ్యాండ్‌సెట్ ఆకట్టుకుంటుంది. అయితే ప్రస్తుతం అమెజాన్‌లో ఈ హ్యాండ్‌సెట్‌ను భారీ డిస్కౌంట్ ధరకు కొనుగోలు చేయవచ్చు.
రూ. 5 వేల డిస్కౌంట్ :
లావా అగ్ని 3 స్మార్ట్‌ఫోన్ (Lava Agni 3 5G) 8GB ర్యామ్ + 128GB స్టోరేజీ, 8GB ర్యామ్ + 256GB స్టోరేజీ వేరియంట్స్‌లో అందుబాటులో ఉంది. వీటి ధరలు వరుసగా రూ.20998 (Without Charger), రూ.24998 గా ఉన్నాయి. ప్రస్తుతం అమెజాన్‌లో ఈ ఫోన్‌ను ఏకంగా రూ. 5 వేల డిస్కౌంట్‌తో కొనుగోలు చేయవచ్చు.

ఈ బ్యాంకు కార్డులతో :
ICICI, Axis బ్యాంకు క్రెడిట్ కార్డులతో ఈ డిస్కౌంట్‌ను పొందవచ్చు. ఈ ఫోన్ ఛార్జర్ లేకుండా కూడా కొనుగోలు చేయవచ్చు. హీథర్ గ్లాస్, ప్రిస్టిన్ గ్లాస్ వంటి రెండు వేరియంట్స్‌లో ఈ ఫోన్ ప్రస్తుతం అందుబాటులో ఉంది.
లావా అగ్ని 3 5G స్మార్ట్‌ఫోన్ స్పెసిఫికేషన్లు, ఫీచర్‌లు :
లావా అగ్ని 3 5G స్మార్ట్‌ఫోన్ 6.78 అంగుళాల 3D 1.5K కర్వడ్ అమోలెడ్ డిస్‌ప్లేను కలిగి ఉంది. ఈ డిస్‌ప్లే 120Hz రీఫ్రెష్ రేట్, 1200 నిట్స్ గరిష్ఠ బ్రైట్‌నెస్‌ను కలిగి ఉంది. దీంతోపాటు వెనుక వైపు 1.74 అంగుళాల అమోలెడ్ ఇన్‌స్టా డిస్‌ప్లేను అమర్చారు. దీని ద్వారా అలారం, నోటిఫికేషన్‌లు, వాతావరణ అప్‌డేట్స్ వంటిని తెలుసుకోవచ్చు.
ఈ లావా స్మార్ట్‌ఫోన్ మీడియాటెక్ డైమెన్సిటీ 7300 చిప్‌సెట్ ను కలిగి ఉంది. ఈ ప్రాసెసర్ గరిష్ఠంగా 8GB LPDDR5X ర్యామ్, 256GB UFS 3.1 స్టోరేజీ కలిగి ఉంది. మెరుగైన థర్మల్ మేనేజ్‌మెంట్ కోసం వేపర్ కూలింగ్ ఛాంబర్‌ను కూడా కలిగి ఉంది.
ఈ ఫోన్ ఆండ్రాయిడ్ 14 ఆధారిత OS ను కలిగి ఉంది. ఈ లావా హ్యాండ్‌సెట్ 3 సంవత్సరాల వరకు సాఫ్ట్‌వేర్ అప్‌డేట్స్‌ను అందిస్తుంది. ఈ ఫోన్ యాక్షన్ బటన్‌ను కూడా కలిగి ఉంది. దీని ద్వారా ఫోన్ సైలెంట్ నుంచి జనరల్ మోడ్ మరియు జనరల్ నుంచి సైలెంట్ మోడ్‌లోకి మార్చుకోవచ్చు. దీంతోపాటు యాప్‌లు ఓపెన్ చేసేందుకు, వాయిస్ రికార్డింగ్, స్క్రీన్ షాట్, ఫ్లాష్ లైట్ కోసం ఉపయోగించుకోవచ్చు.
లావా అగ్ని 3 5G స్మార్ట్‌ఫోన్ ఆకట్టుకొనే డిజైన్‌తోపాటు బెస్ట్ కెమెరా ఫీచర్‌లను కలిగి ఉంది. ఈ ఫోన్ ట్రిపుల్ కెమెరా యూనిట్‌ను కలిగి ఉంది. 50MP ప్రైమరీ కెమెరా (OIS + EIS), 3x ఆప్టికల్ జూమ్‌తో 8MP టెలిఫోటో కెమెరా, 2x పొర్ట్రెయిట్ జూమ్‌తో 8MP అల్ట్రావైడ్ కెమెరాలను కలిగి ఉంది. సెల్ఫీ, వీడియో కాల్స్ కోసం 16MP కెమెరాను అమర్చారు.
ఈ ఫోన్ 66W ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్టుతో 5000mAh బ్యాటరీని కలిగి ఉంది. కనెక్టివిటీ పరంగా 5G, 4G VoLTE, Wi-Fi 6E, బ్లూటూత్ 5.4, GPS, USB-C ఛార్జింగ్ పోర్టును కలిగి ఉంది. సెక్యూరిటీ కోసం ఇన్‌డిస్‌ప్లే ఫింగర్ ప్రింట్ సెన్సార్‌ను కలిగి ఉంది.
* భారత్ మార్కెట్‌లో ఈ నెల తొలివారంలో లావా యువ స్టార్ 2 స్మార్ట్‌ఫోన్ విడుదల అయింది. ఈ ఫోన్ ప్రారంభ ధర రూ.6499 గా ఉంది. ఎంట్రీ లెవల్‌లో స్మార్ట్‌ఫోన్ కోసం ఎదురుచూసే వారికి ఈ ఫోన్ బెస్ట్ ఆప్షన్‌గా ఉండే అవకాశం ఉంది. ఈ ఫోన్ 6.75 అంగుళాల HD+ LCD డిస్‌ప్లేను కలిగి ఉంది.
ఈ లావా స్మార్ట్‌ఫోన్ ఆక్టా కోర్ UNISOC చిప్‌సెట్‌ను కలిగి ఉంది. మరియు ఆండ్రాయిడ్ 14 ఆధారిత (గో ఎడిషన్) పైన పనిచేస్తోంది. కెమెరా విభాగం పరంగా 13MP ప్రైమరీ, AI లెన్స్‌తోపాటు ముందు వైపు 5MP సెల్ఫీ కెమెరాను కలిగి ఉంది. వెనుక వైపు LED ఫ్లాష్ లైట్‌ను కూడా అమర్చారు. ఈ ఫోన్ 10W ఛార్జింగ్ సపోర్టుతో 5000mAh బ్యాటరీని కలిగి ఉంది.


Click it and Unblock the Notifications







