అమెజాన్ ప్రైమ్ డే సేల్, ఆఫర్స్ వర్తించే ఫోన్స్ ఇవే!

By GizBot Bureau
|

అమెజాన్ ప్రైమ్ డే సేల్ మరికొద్ది గంటల్లో ప్రారంభం కాబోతోంది. ఈ సేల్‌ను పురస్కరించుకుని స్మార్ట్‌ఫోన్స్ అలానే ఎలక్ట్రానిక్ గృహోపకరణాల పై భారీ డిస్కౌంట్లను అమెజాన్ సిద్ధం చేసి ఉంచింది. ఈ సేల్‌లో భాగంగా పలు ఎక్స్‌క్లూజివ్ స్మార్ట్‌ఫోన్‌లను పై అమెజాన్ విక్రయించబోతోంది. ఈ జాబితాలో వన్‌ప్లస్, సామ్‌సంగ్, హానర్, వివో తదితర బ్రాండ్‌లకు సంబంధించిన స్మార్ట్‌ఫోన్‌లు ఉన్నాయి. వాటి వివరాలను ఇప్పుడు తెలుసుకుందాం..

 

OnePlus 6 పై రూ.2,000 ఇన్‌స్టెంట్ డిస్కౌంట్..

OnePlus 6 పై రూ.2,000 ఇన్‌స్టెంట్ డిస్కౌంట్..

ప్రైమ్ డే సేల్‌ను పురస్కరించుకుని వన్‌ప్లస్ 6 (8జీబి ర్యామ్ + 128జీబి) స్టోరేజ్ మోడల్ పై రూ.2000 తక్షణ డిస్కౌంట్‌ను అమెజాన్ అందిస్తోంది. ఈ డిస్కౌంట్‌ను పొందాలనుకునే యూజర్లు హచ్‌డిఎఫ్‌సీ క్రెడిట్ లేదా డెబిట్ కార్డ్ ద్వారా ఈ ఫోన్‌ను కొనుగోలు చేయవల్సి ఉంటుంది. ఇదే సేల్‌లో భాగంగా వన్‌ప్లస్ 6 (6జీబి ర్యామ్ + 64జీబి) స్టోరేజ్ మోడల్‌ను కొనుగోలు చేసే యూజర్లకు ప్రైమ్ వీడియోతో పాటు 12 నెలల డ్యామేజ్ ఇన్సూరెన్స్ అలానే ఐడియా 4జీ ఆఫర్‌ను అమెజాన్ అందిస్తోంది.

గెలాక్సీ జే8, హానర్ 7సీల ప్రత్యేకమైన ఆఫర్లు..

గెలాక్సీ జే8, హానర్ 7సీల ప్రత్యేకమైన ఆఫర్లు..

ప్రైమ్ డే సేల్‌లో భాగంగా సామ్‌సంగ్ గెలాక్సీ జే8 స్మార్ట్‌ఫోన్‌ను కొనుగోలు చేసే యూజర్లకు ఎక్స్‌ఛేంజ్ సౌకర్యంతో పాటు వన్-ఇయర్ ఎక్స్‌టెండెడ్ వారంటీని అమెజాన్ అందిస్తోంది. ఇదే సమయంలో హానర్ 7సీ మొబైల్‌ను కొనుగోలు చేసే యూజర్లకు రూ.8,000 వరకు ఎక్స్‌ఛేంజ్ సౌకర్యంతో పాటు ఈఎమ్ఐ సదుపాయాన్ని అమెజాన్ కల్పిస్తోంది.

ఎక్స్‌ఛేంజ్ సౌకర్యంతో వీవో ఎక్స్21
 

ఎక్స్‌ఛేంజ్ సౌకర్యంతో వీవో ఎక్స్21

ప్రైమ్ డే సేల్‌లో భాగంగా ఇన్-స్ర్కీన్ ఫింగర్ ప్రింట్ సెన్సార్‌తో లాంచ్ అయిన వీవో ఎక్స్21 స్మార్ట్‌ఫోన్ పై రూ.15,000 వరకు ఎక్స్‌‍ఛేంజ్‌ను అమెజాన్ ఆఫర్ చేస్తోంది. ఈఎమ్ఐ సదుపాయాన్ని కూడా అమెజాన్ కల్పిస్తోంది. అమెజాన్ లిస్టింగ్స్‌లో ఈ డివైస్ ధర రూ.35,900గా ఉంది.

గేమింగ్ ల్యాప్‌టాప్స్ అలానే హెచ్‌డి టీవీల పై డిస్కౌంట్స్...

గేమింగ్ ల్యాప్‌టాప్స్ అలానే హెచ్‌డి టీవీల పై డిస్కౌంట్స్...

ప్రైమ్ డే సేల్‌లో భాగంగా ఎమ్ఎస్ఐ బ్రాండ్ పలు గేమింగ్ ల్యాప్‌టాప్‌లను లాంచ్ చేయబోతోంది. ఇవి ఇంటెల్ 8వ తరం ప్రాసెసర్స్ పై రన్ అవుతాయి. ఇదే సమయంలొ క్లౌడ్ వాకర్ సంస్థ ఫుల్ హెచ్ ఆండ్రాయిడ్ టెలివిజన్‌లను మార్కెట్లో ప్రవేశపెట్టబోతోంది. ఇక యాక్సెసరీస్ విషయానికి వచ్చేసరికి వెస్ట్రన్ డిజిటల్ పలు సెన్‌హైసర్ హెడ్‌ఫోన్‌లతో పాటు పోర్టబుల్ హార్డ్‌డ్రైవ్‌లను ఎక్స్‌క్లూజివ్‌గా లాంచ్ చేయబోతోంది. ఇదే సమయంలో సామ్‌సంగ్ కూడా పలు మొమెరీ కార్డులను ప్రవేశపెట్టబోతున్నట్లు ప్రకటించింది.

 

 

 

Best Mobiles in India

English summary
Amazon Prime Day sale is a few days away wherein users will get discounts, offers and more on several electronic appliances and gadgets

ఉత్తమ ఫోన్లు

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
X