రూ. 25 వేలకే ఐఫోన్ 6..

Written By:

ఇండియాలో మొట్టమొదటిసారిగా అమెజాన్ ప్రైమ్‌ డే సేల్‌ను నిర్వహిస్తోంది. భారీ ఆఫర్లు, బంపర్‌ డిస్కౌంట్లతో నిన్న సాయంత్రం ఆరుగంటల నుంచి ప్రారంభమైన సంగతి తెలిసిందే. ఈ రోజు అర్థరాత్రి వరకు కొనసాగనున్న సేల్ లో అనేక ఆఫర్లను అమెజాన్ ప్రకటించింది. వీటిపై ఓ స్మార్ట్ లుక్కేయండి.

జియో, Rc 19 నుంచి Rc 9999 దాకా..

గిజ్‌బాట్ మరిన్ని అప్‌డేట్స్ ఇక్కడే

ఐఫోన్‌ 6ను 25వేల రూపాయలకే

ఈ సేల్ సందర్భంగా ఐఫోన్‌ 6ను 25వేల రూపాయలకే అమెజాన్‌ అందిస్తోంది. అంతేకాక ఈ ఫోన్‌ను హెచ్‌డీఎఫ్‌సీ డెబిట్‌ కార్డుతో కొనుగోలు చేస్తే అదనంగా 15 శాతం డిస్కౌంట్‌ను కూడా అందుబాటులో ఉంచింది.

ఐఫోన్‌ 6ఎస్‌

దీంతో పాటు ఐఫోన్‌ 6ఎస్‌(స్పేస్‌ గ్రే, 32జీబీ), ఐఫోన్‌6ఎస్‌(గోల్డ్‌, 32జీబీ) ఫోన్లను 25 శాతం తగ్గింపుతో రూ.34,999కి విక్రయిస్తోంది.

ఐఫోన్‌ 7 రోజ్‌ గోల్డ్‌

వీటితోపాటు ఐఫోన్‌ 7 రోజ్‌ గోల్డ్‌, బ్లాక్‌, గోల్డ్‌ వేరియంట్లు రూ.42,999కే అందుబాటులో ఉన్నాయి. ఈ వేరియంట్ల అసలు ధర రూ.56,200. ప్రస్తుతం అమెజాన్‌ ఆఫర్‌ చేస్తున్న తగ్గింపు ధరతో 23 శాతం పొదుపు చేసుకోవచ్చు.

ఎల్‌జీ జీ6

ప్రైమ్‌ యూజర్లు ఎల్‌జీ జీ6 స్మార్ట్‌ఫోన్‌ను 30 శాతం ఆదాతో 37,990 రూపాయలకే కొనుగోలు చేసుకోవచ్చని అమెజాన్‌ తెలిపింది.

గూగుల్‌ పిక్సెల్‌

గూగుల్‌ పిక్సెల్‌ స్మార్ట్‌ఫోన్‌ ధరను కూడా తగ్గించి రూ.38,999కే విక్రయిస్తోంది. అయితే ఈ సేల్‌ ప్రత్యేకంగా రూ.499తో ప్రైమ్‌ సబ్‌స్క్రిప్షన్‌ తీసుకున్న తన ప్రైమ్‌ యూజర్లకు మాత్రమే.

రెండు రకాల డీల్స్‌

రెండు రకాల డీల్స్‌ను ఈ సేల్‌లో అమెజాన్‌ ఆఫర్‌చేస్తోంది. రెగ్యులర్‌ డిస్కౌంట్లను, ప్రత్యేక సందర్భాల్లో పరిమిత ఉత్పత్తులపై ఆఫర్‌ చేసే డీల్స్‌. ఇవే కాకుండా మరెన్నో డీల్స్, ఆఫర్లు సేల్‌లో ప్రతి 5 నిమిషాలకు ఒకసారి ఉన్నాయని అమెజాన్ ప్రతినిధులు చెబుతున్నారు.

 

 

గిజ్‌బాట్ మరిన్ని అప్‌డేట్స్ ఇక్కడే

English summary
Amazon Prime Day: You can get an iPhone 6 for Rs 25,000, and other amazing deals Read more At Gizbot Telugu
Opinion Poll

Social Counting

ఇన్స్టెంట్ న్యూస్ అప్డేట్స్ రోజుంతా పొందండి - Telugu Gizbot