అమెజాన్ ప్రైమ్ డేస్ సేల్ 2024లో ఈ కొత్త స్మార్ట్‌ఫోన్‌లను కొనుగోలు చేయవచ్చు.. పూర్తి వివరాలు..!!
అమెజాన్ ప్రైమ్ డేస్ సేల్ 2024 ఈనెల 20, 21 తేదీల్లో నిర్వహించనున్నారు. ఈ సేల్‌లో ( Amazon prime Days Sale 2024 ) అమెజాన్ ప్రైమ్ మెంబర్‌షిప్ ఉన్నవారు మాత్రమే సేల్ లో పాల్గొనవచ్చు. అయితే ఈ సేల్ లో అనేక కొత్త స్మార్ట్‌ఫోన్ లు సహా హ్యాండ్‌సెట్ లను డిస్కౌంట్ ధరలకు కొనుగోలు చేయవచ్చు. స్మార్ట్‌ఫోన్‌లతోపాటు స్మార్ట్‌టీవీలు, వాచ్‌లు, ఇతర ఎలక్ట్రానిక్ గ్యాడ్జెట్ లను కొనుగోలు చేయవచ్చు.
ఈ అమెజాన్ ప్రైమ్ డేస్ సేల్ 2024 లో భాగంగా ఐకూ Z9 లైట్ 5G, శాంసంగ్ గెలాక్సీ M35 5G, రెడ్‌మి 13 5G, హానర్ 200 సిరీస్, లావా బ్లేజ్ X వంటి త్వరలో అందుబాటులోకి రానున్న స్మార్ట్‌ఫోన్‌లను కొనుగోలు చేయవచ్చు. ఈ సేల్‌లో భాగంగా ICICI, SBI బ్యాంకు డెబిట్, క్రెడిట్ కార్డుల ద్వారా 10 శాతం డిస్కౌంట్‌ను పొందవచ్చు.

రెడ్‌మి 13 5G : ఈ స్మార్ట్‌ఫోన్ జులై 9 న లాంచ్ కానుంది. 108MP కెమరా, స్నాప్ డ్రాగన్ 4 జెన్ చిప్‌సెట్ పైన పనిచేస్తుంది. 33W ఛార్జింగ్ సపోర్టుతో 5030mAh బ్యాటరీని కలిగి ఉంటుంది. ఆండ్రాయిడ్ 14 ఆధారిత షియోమీ HyperOS పైన పనిచేస్తుంది. ఈ హ్యాండ్‌సెట్ రూ.14000 కంటే తక్కువ ధరకే అందుబాటులోకి వచ్చే అవకాశం ఉంది.
లావా బ్లేజ్ x : ఈ స్మార్ట్‌ఫోన్ కర్వడ్ డిస్‌ప్లేను కలిగి ఉంటుంది. మరియు 64MP ప్రైమరీ కెమరాతో అందుబాటులోకి రానుందని తెలుస్తోంది. ఈ స్మార్ట్‌ఫోన్ జులై 10న విడుదల కానుంది. దీని ధర రూ.15000 రేంజ్ సెగ్మెంట్‌లో ఉండే అవకాశం ఉంది.
ఐకూ Z9 లైట్ 5G స్మార్ట్‌ఫోన్ : ఈ స్మార్ట్‌ఫోన్ భారత్ మార్కెట్‌లో జులై 15న లాంచ్ కానుంది. ఈ హ్యాండ్‌సెట్ 50MP + 2MP కెమెరాలతో విడుదల కానుందని తెలుస్తోంది. దీంతోపాటు మీడియాటెక్ డైమెన్సిటీ 6300 చిప్‌సెట్ పైన పనిచేస్తుంది. ఈ హ్యాండ్‌సెట్ రూ.12000 కంటే తక్కువ ధరలో అందుబాటులోకి రానుందని తెలుస్తోంది.
శాంసంగ్ గెలాక్సీ M35 : ఈ స్మార్ట్‌ఫోన్ 120Hz రీఫ్రెష్ రేట్‌తో సూపర్ అమోలెడ్ FHD+ డిస్‌ప్లేను కలిగి ఉంటుంది. మరియు 1000 నిట్స్ గరిష్ఠ బ్రైట్‌నెస్‌తో రానుంది. గొరెల్లా గ్లాస్ విక్టస్‌తో డిస్‌ప్లే రక్షణను పొందనుంది. 50MP OIS, 8MP, 2MP కెమెరాలు సహా 13MP సెల్ఫీ కెమెరాను కలిగి ఉండనుంది. మరియు 6000mAh బ్యాటరీని కలిగి ఉంటుంది. రూ.20,000 ధర రేంజ్‌లో అందుబాటులో ఉంది.
హానర్ 200 సిరీస్ : ఈ స్మార్ట్‌ఫోన్ క్వాడ్ కర్వడ్ డిస్‌ప్లే సహా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఆధారిత OS పైన పనిచేస్తుంది. 50MP OIS ప్రధాన కెమెరా, 12MP అల్ట్రావైడ్ లెన్స్, 50MP టెలిఫోటో కెమెరాను కలిగి ఉంటుంది. దీంతోపాటు 50MP సెల్ఫీ కెమెరాను అమర్చినట్లు తెలుస్తోంది. ఈ హ్యాండ్‌సెట్ జులై 18న లాంచ్ కానుంది.
అమెజాన్ ప్రైమ్ మెంబర్లు మాత్రమే ఈ సేల్‌లో పాల్గొనే అవకాశం ఉంటుంది. మీరు ప్రైమ్ మెంబర్ కాకుంటే 30 రోజుల పాటు ప్రైమ్ మెంబర్‌షిప్‌ను (ట్రయల్) ను ఉచితంగా వినియోగించుకొనే అవకాశం ఉంది. అదే కొనుగోలు చేసేందుకు అమెజాన్ ప్రైమ్ మెంబర్ షిప్ నెలవారీ ధర రూ.299 గా ఉంది.
మూడు నెలల అమెజాన్ ప్రైమ్ మెంబర్‌షిప్ కోసం రూ.599 ను చెల్లించాల్సి ఉంటుంది. అదే సంవత్సరం ప్లాన్ కోసం రూ.1499 చెల్లించాలి. అదే అమెజాన్ ప్రైమ్ షాపింగ్ ఎడిషన్ 12 నెలల ప్లాన్ ధర రూ.399 గా ఉంది. ప్రైమ్ మెంబర్లు వేగవంతమైన డెలివరీని పొందవచ్చు. దీంతోపాటు అమెజాన్ ప్రైమ్ వీడియో ద్వారా కొత్త సినిమాలు, వెబ్ సిరీస్‌లను ఆస్వాదించవచ్చు.


Click it and Unblock the Notifications







