Home
Mobile

Galaxy On5 , On7 ఫోన్‌ల పై భారీ డిస్కౌంట్లు, ఈ రోజే చివరి రోజు

సామ్‌సంగ్ కార్నివాల్ పేరిట ఎక్స్‌క్లూజివ్ సామ్‌సంగ్ స్మార్ట్‌ఫోన్ సేల్‌ను అమెజాన్ నిర్వహిస్తోంది. మార్చి 5వ తేదీన ప్రారంభమైన ఈ సేల్ మార్చి 8వ తేదీతో ముగుస్తుంది.

By Bommu Sivanjaneyulu

సామ్‌సంగ్ కార్నివాల్ పేరిట ఎక్స్‌క్లూజివ్ సామ్‌సంగ్ స్మార్ట్‌ఫోన్ సేల్‌ను అమెజాన్ నిర్వహిస్తోంది. మార్చి 5వ తేదీన ప్రారంభమైన ఈ సేల్ మార్చి 8వ తేదీతో ముగుస్తుంది. ఈ నాలుగు రోజుల సేల్‌లో భాగంగా ఎంపిక చేసిన బడ్జెట్ అలానే ప్రీమియమ్ రేంజ్ ఫోన్‌ల పై భారీ డిస్కౌంట్లను సామ్‌సంగ్ ఇస్తోంది. నూతనంగా లాంచ్ అయిన గెలాక్సీ ఏ8+తో పాటు గతేడాది లాంచ్ అయిన గెలాక్సీ నోట్ 8 స్మార్ట్‌ఫోన్‌లు సేల్‌కు ప్రధాన అట్రాక్షన్‌గా నిలిచాయి. అమెజాన్ పేవాలెట్ ద్వారా ఈ ఫోన్‌లను కొనుగోలు చేసిన వారికి మాత్రమే డిస్కౌంట్స్ అనేవి లభిస్తున్నాయి.

రూ.8000 వరకు క్యాష్‌బ్యాక్

రూ.8000 వరకు క్యాష్‌బ్యాక్

సామ్‌సంగ్ కార్నివాల్ సేల్‌లో భాగంగా Galaxy S9, Galaxy S9+ ఫోన్‌ లను కూడా సామ్‌సంగ్ పరిచయం చేయబోతోంది. డిస్కౌంట్లను అందుకుంటోన్న ఫోన్‌ల జాబితాలో గెలాక్సీ ఏ8+, గెలాక్సీ ఆన్7, గెలాక్సీ ఆన్5 లైనప్‌తో పాటు గెలాక్సీ నోట్ 8, జే7 లైనప్‌లు ఉన్నాయి. వీటిని అమెజాన్ పేవాలెట్ ద్వారా కొనుగోలు చేయటం ద్వారా దాదాపు రూ.8000 వరకు క్యాష్‌బ్యాక్ లభించే వీలుంటుంది.

గెలాక్సీ ఏ8+ పై రూ.4000 వరకు క్యాష్‌బ్యాక్

గెలాక్సీ ఏ8+ పై రూ.4000 వరకు క్యాష్‌బ్యాక్

సామ్‌సంగ్ కార్నివాల్ సేల్‌లో భాగంగా గెలాక్సీ ఏ8 ప్లస్ స్మార్ట్‌ఫోన్‌ను రూ.4000 వరకు క్యాష్‌బ్యాక్ పై అమెజాన్ విక్రయిస్తోంది. ఈ ఫోన్ వాస్తవ ధర రూ.32,990గా ఉంది. ప్రస్తుత సేల్‌లో భాగంగా రూ.4000 క్యాష్‌బ్యాక్‌తో రూ.28,990కే సొంతం చేసుకునే అవకాశాన్ని కల్పిస్తున్నారు. ఈ క్యాష్ బ్యాక్ పొందాలనుకునే వారు అమెజాన్ పే వాలెట్ ద్వారా ఫోన్‌ను కొనుగోలు చేయవల్సి ఉంటుంది.

గెలాక్సీ నోట్ 8 పై రూ.8000 వరకు క్యాష్‌బ్యాక్

గెలాక్సీ నోట్ 8 పై రూ.8000 వరకు క్యాష్‌బ్యాక్

సామ్‌సంగ్ కార్నివాల్ సేల్‌లో భాగంగా గెలాక్సీ నోట్ 8 స్మార్ట్‌ఫోన్‌ను రూ.8000 వరకు క్యాష్‌బ్యాక్ పై అమెజాన్ విక్రయిస్తోంది. ఈ ఫోన్ వాస్తవ ధర రూ.67,990గా ఉంది. ప్రస్తుత సేల్‌లో భాగంగా రూ.8000 క్యాష్‌బ్యాక్‌తో రూ.59,990కే ఈ ఫోన్‌ను సొంతం చేసుకునే అవకాశాన్ని కల్పిస్తున్నారు. . ఈ క్యాష్ బ్యాక్ పొందాలనుకునే వారు అమెజాన్ పే వాలెట్ ద్వారా కొనుగోలు చేయవల్సి ఉంటుంది.

గెలాక్సీ ఆన్5, ఆన్7 ఫోన్‌ల పై రూ.2000 వరకు క్యాష్‌బ్యాక్

గెలాక్సీ ఆన్5, ఆన్7 ఫోన్‌ల పై రూ.2000 వరకు క్యాష్‌బ్యాక్

సామ్‌సంగ్ కార్నివాల్ సేల్‌లో భాగంగా గెలాక్సీ ఆన్5, ఆన్7 లైనప్ ఫోన్‌ల పై రూ.2000 వరకు క్యాష్‌బ్యాక్‌‌ను సామ్‌సంగ్ అందిస్తోంది. గెలాక్సీ ఆన్ 7 ప్రైమ్ 32జీబి వేరియంట్‌ను రూ.10,990 ధర ట్యాగ్‌తోనూ, 64జీబి స్టోరేజ్ వేరియంట్‌ను రూ.12,990 ధర ట్యాగ్‌తోనూ సామ్ సంగ్ విక్రయిస్తోంది. మరోవైపు గెలాక్సీ ఆన్5 మోడల్ ను రూ.6,490కే సొంతం చేసుకునే అవకాశాన్ని కల్పిస్తున్నారు.

 

 

 అదనంగా 5శాతం వరకు క్యాష్‌బ్యాక్‌

అదనంగా 5శాతం వరకు క్యాష్‌బ్యాక్‌

ఇవే కాకుండా స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా క్రెడిట్ కార్డ్ యూజర్లకు 5శాతం వరకు క్యాష్‌బ్యాక్‌ను సామ్‌సంగ్ ప్రొవైడ్ చేస్తుంది. ఈ సేల్ లో భాగంగా పరిచయం చేయబోతోన్న గెలాక్సీ ఎస్9, ఎస్9+ హ్యాండ్ సెట్ లను మార్చి 16 నుంచి అమెజాన్ విక్రయిస్తుంది.

Best Mobiles in India

English summary
Amazon is hosting a Samsung exclusive sale called the "Samsung Carnival" starting today i.e March 5 until March 8. During the Samsung Carnival, the e-commerce tech giant is offering heavy discounts on Samsung smartphones, including the newly launched Galaxy A8+ and also last year's Galaxy Note 8.
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X