ఆండ్రాయిడ్ ఫోన్ కోసం సరిక్రొత్త ట్విట్టర్ అప్లికేషన్

Posted By: Staff

ఆండ్రాయిడ్ ఫోన్ కోసం సరిక్రొత్త ట్విట్టర్ అప్లికేషన్

twitter అనేది ప్రస్తుతం అత్యంత ప్రజాదరణ కల్గిన సోషల్ నెట్ వర్క్ . ఆండ్రాయిడ్ లో కూడా దీనికి అనేక అప్లికేషన్స్ ఉన్నాయి. ఫోనులో డీఫాల్ట్ గా వచ్చే official twitter అప్లికేషను తో పాటూ ఆండ్రాయిడ్ మార్కెట్ లో దొరికే అనేక అప్లికేషన్స్ లో కొన్ని - ట్వీట్ డెక్ , Xeeky , సీస్మిక్ , ట్విట్టర్ రైడ్ , లాగ్ పాస్ట్, స్విఫ్ట్ , డ్రాయిడ్ ఇన్ , atweeter , Twidroid , ట్వీట్ కొం , ప్లం, హెష్ పోస్ట్ , ట్విక్కా, .... ఒక్కొక్కరూ తమ తమ అభిరుచులను బట్టి ఒక్కో అప్లికేషను ను ఫోన్ లలో ఇనిస్టాల్ చేయడం జరుగుతుంది.


నేను కూడా దాదాపు 10 -15 రోజులనుంచి ౩౦ కి పైగా అప్లికేషన్స్ ని నా ఫోన్ లో ప్రయత్నించడం జరిగింది. చివరికి నన్ను ట్విప్పుల్ ( twipple) అనే అప్లికేషను కట్టి పడేసింది. నేను దాదాపు ౩౦ అప్లికేషన్స్ వాడాను కనుక ఒకే మాటలో చెపుతాను " మిగతా twitter app తో పోల్చితే దీనిలో ఉన్న ముఖ్యమైన feature " auto Refresh" .మనం కోరుకున్న సమయంలోస్క్రీన్ పైన ట్వీట్స ని రిఫ్రెష్ చేస్తుంది. మిగతా అప్లికేషన్స్ లో ఉండే అన్ని ఫీచర్స్ దీనిలో ఉన్నాయి. ఒకటికన్నా ఎక్కువ అకౌంట్ల నిర్వహణ , సెర్చ్ , ట్రెండ్స్ లాంటివే కాక స్క్రీన్ విడ్జెట్ గా కూడా ఉపయోగించుకోవచ్చు.

Opinion Poll

Social Counting

ఇన్స్టెంట్ న్యూస్ అప్డేట్స్ రోజుంతా పొందండి - Telugu Gizbot