సంవత్సరమంతా సెకనుకు పైసా: రిలయన్స్ ఆఫర్

Posted By: Prashanth

సంవత్సరమంతా సెకనుకు పైసా: రిలయన్స్ ఆఫర్

 

ప్రీపెయిడ్ యూజర్ల కోసం రిలయన్స్ సరికొత్త మొబైల్ టారిఫ్ ప్లాన్‌ను అందుబాటులోకి తెచ్చింది. సీడీఎమ్ఏ నెట్‌వర్క్ యూజర్లు రూ.58 చెల్లించి ఈ టారీఫ్‌లోకి మారితే సంవత్సరం పాటు అన్ని ఎస్‌టీడీ, లోకల్ కాల్స్ పై సెకనుకు పైసా మాత్రమే ఛార్జ్ చేస్తారు. సీడీఎమ్ఏ వినియోగదారులకు మాత్రమే ఈ ఆఫర్ వర్తిస్తుంది.

ప్లాన్ ముఖ చిత్రం:

చెల్లుబడి కాలం (వాలిడిటీ పిరియిడ్) : 365 రోజులు,

రీఛార్జ్ మొత్తం : రూ.58,

ప్రత్యేక ప్రయోజనాలు: అన్నిఎస్‌టీడీ, లోకల్ కాల్స్ పై సెకనుకు పైసా ఛార్జ్.

రోమింగ్ ఛార్జీ వివరాలు:

లోకల్ అవుట్ గోయింగ్ కాల్స్: అన్ని నెట్‌వర్క్‌ల పై రూపాయి ఛార్జ్,

ఎస్‌టీడీ అవుట్ గోయింగ్ కాల్స్: అన్ని నెట్‌వర్క్‌ల పై రూ.1.50 ఛార్జ్ చేస్తారు,

ఇన్‌కమింగ్ కాల్స్ : అన్ని నెట్‌వర్క్‌ల పై రూపాయి వసూలు,

ఎస్ఎమ్ఎస్ టారిఫ్:

లోకల్: రూ 1.00

నేషనల్ : రూ 1.00

ఇంటర్నేషనల్ : రూ 5.00

Opinion Poll

Social Counting

ఇన్స్టెంట్ న్యూస్ అప్డేట్స్ రోజుంతా పొందండి - Telugu Gizbot