10జీబి ర్యామ్‌తో Oppo ఫోన్, ప్రయోజనాలెన్నో!
చైనా స్మార్ట్‌ఫోన్ దిగ్గజం ఒప్పో, Oppo Find X పేరిట ఓ హై-ఎండ్ స్మార్ట్‌ఫోన్‌ను ఇటీవల మార్కెట్లో లాంచ్ చేసిన విషయం తెలిసిందే.
చైనా స్మార్ట్‌ఫోన్ దిగ్గజం ఒప్పో, Oppo Find X పేరిట ఓ హై-ఎండ్ స్మార్ట్‌ఫోన్‌ను ఇటీవల మార్కెట్లో లాంచ్ చేసిన విషయం తెలిసిందే. 8జీబి ర్యామ్ కెపాసిటీతో వస్తోన్న ఈ స్మార్ట్‌ఫోన్‌ను ఈ-కామర్స్ దిగ్గజం ఫ్లిప్‌కార్ట్ రూ.59,990 ధర ట్యాగ్‌తో విక్రయిస్తోంది. ఈ ఫోన్‌కు సంబంధించి చైనా సర్టిఫికేషన్ వెబ్‌సైట్ TENNA మరో ఆసక్తికర విషయాన్ని రివీల్ చేసింది. ఈ అప్‌డేట్ ప్రకారం ఒప్పో ఫైండ్ ఎక్స్ స్మార్ట్‌ఫోన్ 10జీబి ర్యామ్ + 256జీబి ఇంటర్నల్ స్టోరేజ్ సపోర్టుతో రాబోతోంది. ఇదే విషయాన్ని మరో చైనీస్ టిప్‌స్టర్ అయిన UniverseIce కూడా తన ట్విట్టర్ అకౌంట్ ద్వారా కన్ఫర్మ్ చేసింది.

ఒప్పో ఫైండ్ ఎక్స్ స్పెసిఫికేషన్స్..
6.4 ఇంచ్ ఓఎల్ఈడి హైడెఫినిషన్ ప్లస్ బీజిల్‌లెస్ డిస్‌ప్లే (1080x2340పిక్సల్స్) విత్ 93.8% స్ర్కీన్ టు బాడీ రేషియో, కర్వుడ్ బాడీతో వస్తోన్న ఈ స్మార్ట్‌ఫోన్‌కు కార్నింగి గొరిల్లా గ్లాస్ 5 ప్రొటెక్షన్ రెండు వైపులా కవర్ అయి ఉంటుంది. ఆండ్రాయిడ్ ఓరియో 8.1 ఆపరేటింగ్ సిస్టం పై ఈ ఫోన్ రన్ అవుతుంది. ఇక ప్రాసెసర్ విషయానికి వచ్చేసరికి క్వాల్కమ్ లేటెస్ట్ మొబైల్ చిప్‌సెట్‌లలో ఒకటైన స్నాప్‌డ్రాగన్ 845 ప్రాసెసర్ పై ఫోన్ రన్ అవుతుంది. ప్రస్తుతానికి ఈ ఫోన్ 8జీబి ర్యామ కెపాసిటీతో లభ్యముతోంది. త్వరలో 10 జీబి ర్యామ్ వెర్షన్ కూడా మార్కెట్లోకి రాబోతోంది.

స్టోరేజ్, కెమెరా, బ్యాటరీ..
ఇక స్టోరేజ్ విషయానికి వచ్చేసరికి 256జీబి ఆన్‌బోర్డ్ స్టోరేజ్‌తో ఒప్పో ఫైండ్ ఎక్స్ లభ్యమవుతుంది. ఇక కెమెరా సెగ్మెంట్ విషయానికి వచ్చేసరికి ఈ డివైస్‌లో 16 మెగా పిక్సల్ + 20 మెగా పిక్సల్ రేర్ ఫేసింగ్ కెమెరాతో పాటు 25 మెగా పిక్సల్ ఫ్రంట్ ఫేసింగ్ కెమెరాను ఒప్పో నిక్షిప్తం చేసింది. ఇక బ్యాటరీ విషయానికి వచ్చేసిరికి ఈ హై-ఎండ్ స్మార్ట్‌ఫోన్‌లో 3730ఎమ్ఏహెచ్ బ్యాటరీని ఒప్పో ఏర్పాటు చేసింది. సూపర్ VOOC ఛార్జింగ్ టెక్నాలజీని ఈ బ్యాటరీ సపోర్ట్ చేస్తుంది. కనెక్టువిటీ ఫీచర్స్ విషయానికి వచ్చేసరికి ఈ డివైస్‌లో 4జీ VoLTE, 3జీ, వై-ఫై, బ్లుటూత్, జీపీఎస్, ఎన్‌ఎఫ్‌సీ, యూఎస్బీ టైప్ సీ వంటి స్టాండర్డ్ కనెక్టువిటీ ఫీచర్లను ఒప్పో పొందుపరిచింది.

256 ఎంబి నుంచి 10జీబి వరకు...
స్మార్ట్‌ఫోన్ పనితీరులో ర్యామ్ పాత్ర ఎంతో కీలకం. ర్యామ్ స్థాయి పెరిగేకొద్ది ఫోన్ ప్రాసెసింగ్ వేగం పెరుగుతూ ఉంటుంది. మొదట్లో స్మార్ట్‌ఫోన్‌లు 256 ఎంబి, 512 ఎంబి ర్యామ్ వేరియంట్‌లలో లభ్యమయ్యేవి. వీటిలో మల్టీ టాస్కింగ్ మందకొడిగా ఉండేది. ఫోన్ మల్టీ టాస్కింగ్ వేగాన్ని మరింత పెంచుతూ 2జీబి, 3జీబి, 4జీబి, 6జీబి, 8జీబి ర్యామ్‌లతో స్మార్ట్‌ఫోన్‌లు అందుబాటులోకి వచ్చేసాయి. త్వరలో 10జీబి ర్యామ్ ఫోన్‌లు కూడా మార్కెట్లోకి రాబోతున్నాయి.

10జీబి ర్యామ్ ఫోన్‌లతో ప్రయోజనాలెన్నో!
10జీబి ర్యామ్ స్మార్ట్‌ఫోన్‌లలో గేమింగ్ ఎక్స్‌పీరియన్స్ హైక్వాలిటీతో ఉంటుంది. ఈ ఫోన్‌లు హయ్యర్ రిసల్యూషన్ కెపాసిటీలను కలిగి ఉండటం వల్ల 3డీ రెండరింగ్ బాగుటుంది. గ్రాఫిక్స్ విషయంలో ఫోన్ ఎక్కడా ల్యాగ్ అయినట్లు కనిపించదు. యానిమేషన్స్ బాగుంటాయి. ఇదే సమయంలో మల్టీటాస్కింగ్ చాలా స్మూత్‌గా ఉంటుంది. ఒకేసారి అనేక యాప్స్‌ను ఓపెన్ చేసుకోవచ్చు. మల్టీటాస్కింగ్ తో పాడు డేటా యాక్సిస్ కూడా చాలా స్పీడుగా ఉంటుంది. ఈ స్మార్ట్‌ఫోన్‌లలో హెవీ యాప్స్ సైతం వేగవంతంగా రన్ అవుతాయి. హెవీ ర్యామ్ అలానే ఎక్కువ ప్రాసెసింగ్ పవర్‌ను కలిగి ఉండే ఫోన్‌లలో గేమ్స్, ఫోటోస్, వీడియోస్ ఇంకా సాఫ్ట్‌వేర్‌లు వేగవంతమైన అవుట్ పుట్‌ను ఆఫర్ చేస్తాయి


Click it and Unblock the Notifications








