ఐఫోన్ 5ఎస్ తో పోలిస్తే త్వరలో విడుదల కాబోయే ఐఫోన్ 6 అమ్మకాలు గణనీయంగా పెరిగే అవకాశముందని విశ్లేషకులు అంచనావేస్తున్నారు. పెద్దదైన తెర, శక్తివంతమైన ప్రాసెసింగ్ వ్యవస్థ వంటి అంశాలు ఈ ఫోన్ అమ్మకాలకు మరింత అనుకూలించే అవకాశముందనే విశ్లేషణలు వ్యక్తమవుతున్నాయి. #13; #13;యాపిల్ ఐపోన్ 5ఎస్ సక్సెసర్ వర్షన్ గా విడుదల కాబోతున్న యాపిల్ కొత్త వర్షన్ స్మార్ట్ ఫోన్ ఐఫోన్ 6 పై ఇప్పటికే అనేక ఆసక్తికర వార్తలు వెబ్ ప్రపంచంలో హల్ చల్ చేస్తున్నాయి. ఐఫోన్ 5ఎస్ తో ఫింగిర్ ప్రింట్ సెన్సార్ ఫీచర్ ను పరిచయం చేసిన యాపిల్ ఐఫోన్ 6లో సోలార్-ఛార్జింగ్ సఫైర్ గ్లాస్ స్ర్కీన్ ను నిక్షిప్తం చేస్తున్నట్లు ప్రముఖ విశ్లేషకుడు మాట్ మార్గోలిస్ ఇటీవల ఓ కథనంలో పేర్కొన్నారు. #13;ఈ ఫీచర్ ను పొందుపరచటం ద్వారా ఐఫోన్ 6 బ్యాటరీ లైఫ్ మరింత పెరుగుతుందట. అయితే ఈ అంశానికి సంబంధించి యాపిల్ వర్గాలు అధికారికంగా స్పందించాల్సి ఉంది. తన వార్తకు మరింత బలం చేకూరుస్తూ మాట్ పలు అంశాలను ఈ కథనంలో ఉటంకించారు. టచ్ సెన్సార్స్ ఇంకా సోలార్ ప్యానల్స్ పై యాపిల్ ఫిబ్రవరి 2013లో ఒక పేటెంట్ దాఖలు చేసినట్లు మాట్ ఈ సందర్భంగా గుర్తుచేసారు. #13;అంతర్జాతీయ మార్కెట్లో ఐఫోన్6 విడుదలకు సంబంధించిన వివరాలను పరిశీలించినట్లయితే యాపిల్ కార్పొరేషన్ ఈ ఫ్లాగ్ షిప్ మోడల్ ను 2014, సెప్టంబర్ లో ఆవిష్కరించే అవకాశందని మార్కెట్ వర్గాలు అంచనా వేస్తున్నాయి. 6 అంగుళాల డిస్ ప్లే స్ర్కీన్ తో విడుదుల కాబోతున్న ఈ ఫోన్ ఐఫోన్5ఎస్ తో పోలిస్తే 4 రెట్లు వేగవంతంగా, గెలాక్సీ ఎస్4తో పోలిస్తే 2 రెండు రెట్ల వేగవంతంగా స్పందించగలదని రూమర్ మిల్స్ టాక్. ఐఫోన్ 6 ఇతర స్పెసిఫికేషన్ లు (అనధికారికంగా): #13;20.2 మెగా పిక్సల్ రేర్ కెమెరా,2కే వీడియో సెన్సార్,8 మెగా పిక్సల్ ఫేస్ టైమ్ కెమెరా (1080పిక్సల్ వీడియో రికార్డింగ్ తో),వేగవంతమైన ప్రాసెసర్,పెద్తమొత్తంలో ఇంటర్నల్ మెమెరీ. #13;మీరు ఎంపిక చేసుకోబోయే స్మార్ట్ ఫోన్ ఇంకా ట్యాబ్లెట్ పీసీకి సంబంధించిన ధరలను ఇక్కడ క్లిక్ చేసి చూసుకోండి. #13;వివిధ మోడళ్ల స్మార్ట్ ఫోన్ లకు సంబంధించిన ఫోటో గ్యాలరీల కోసం క్లిక్ చేయండి. #13;