ఆంధ్రప్రదేశ్ అప్లికేషన్స్

Posted By:

ఆండ్రాయిడ్ స్మార్ట్‌ఫోన్ మీ చేతిలో ఉంటే ప్రపంచం మీ అరిచేతిలో ఉన్నట్లే. అయితే, వేల సంఖ్యలో లభ్యమవుతున్న ఆండ్రాయిడ్ అప్లికేషన్‌లలో ఏది ఉపయోగకరమైనది..?, దేని వల్ల ఎంతెంత ప్రయోజనం..? మొదలగు అంశాల పట్ల ముందుగా యూజర్ అవగాహన

కలిగి ఉండాలి. తెలుగు భాషలోని మాధుర్యం అమ్మ అప్యాయతను తలపిస్తుంది. ఖండాలు దాటినా తెలుగువారికిచ్చే గౌరవం మరువలేనిది. వెబ్ ప్రపంచలో సైతం తెలుగు తన ప్రాముఖ్యతను చాటుతోంది. మొబైల్ ఫోన్‌లలోనూ తెలుగు రుచులను ఆస్వాదించగలుగుతున్నాం. వివిధ అంశాలకు సంబంధించిన తెలుగు సమాచారాన్ని తెలుగులో అందించేందుకు అనేక ఆంధ్రప్రదేశ్ మొబైల్ అప్లికేషన్‌లు రూపుదిద్దుకున్నాయి. వాటిలో ఆండ్రాయిడ్ స్మార్ట్‌ఫోన్‌ల కోసం గూగుల్ స్మార్ట్‌లో లభ్యమవుతున్న టాప్-5 తెలుగు అప్లికేషన్‌ల వివరాలు....

గిజ్‌బాట్ మరిన్ని అప్‌డేట్స్ ఇక్కడే

మై‌ప్లేస్ టెంపుల్స్ ఆంధ్రప్రదేశ్ (MyPlace Temples Andhra Pradesh):

అత్యధికంగా ఉపయోగించబడుతున్న ఆంధ్రప్రదేశ్ ఆండ్రాయిడ్ అప్లికేషన్‌లో ఆంధ్రప్రదేశ్ టెంపుల్స్ అప్లికేషణ్ బెస్ట్ రేటింగ్‌ను సంపాదించి. ఈ అప్లికేషన్‌ను ఇన్స్‌స్టాల్ చేసుకోవటం ద్వారా రాష్ట్రంలోని ప్రముఖ దేవాలయాలకు సంబంధించి కావల్సిన సమాచారాన్ని పొందవచ్చు.
లింక్ అడ్రస్:

ఆంధ్రప్రదేశ్ టూరిజం (Andhra Pradesh Tourism):

పర్యాటక రంగానికి సంబంధించి ఆంధ్రప్రదేశ్ ‘కోహినూర్ ఆఫ్ ఇండియా'గా గుర్తింపు పొందింది. దేశ, వీదేశీయలను ఆకర్షించటంలో ఆంధ్రప్రదేశ్ ప్రత్యేక అందాలను సంతరించుకుంది. హైదరబాద్, తిరుపతి, శ్రీ కాళహస్తి, బాసర, విశాఖపట్నం వంటి విశిష్టమైన ప్రాంతాలు యాత్రికులను కట్టిపడేస్తాయి. ఆంధ్రప్రదేశ్ టూరిజంకు సంబంధించి యాత్రికులను పూర్తి సమాచారాన్ని అందించే క్రమంలో ‘ఆంధ్రప్రదేశ్ టూరిజం' అనే ఆండ్రాయిడ్ అప్లికేషన్ గూగుల్ ప్లే స్టోర్ లో కొలువుతీరి ఉంది. ఆండ్రాయిడ్ స్మార్ట్‌ఫోన్ యూజర్లు ఈ యాప్‌ను
ఇన్స్‌స్టాల్ చేసుకోవటం ద్వారా తమ యాత్రలకు సంబంధించిన సమాచారాన్ని ముందుగానే సేకరించవచ్చు. లింక్ అడ్రస్:

బుడుగు (BUDUGU):

బుడుగు అనే కల్పిన పాత్రను ప్రసిద్ధ రచయిత ముళ్లపూడి వెంకట రమణ సృష్టించారు. చిన్నారులకు ఎంతో ఇష్టమైన బుడుగు తెలుగు కథలు ఈ అప్లికేషన్‌లో లభ్యమవుతాయి. డౌన్‌లోడ్ లింక్:

ఇంటర్ స్టేట్ బస్ గైడ్ (Inter-State Buses Guide):

ఈ అప్లికేషన్ ఆంధ్రప్రదేశ్ రోడ్డు రవాణ సంస్థకు సంబంధించి వివిధ ప్రాంతాలకు బస్సుల రాకపోకల సమచారాన్ని తెలుపుతుంది. ముఖ్యంగా హైదరాబాద్ ప్రధాన బస్టాండ్‌ల నుంచి బెంగుళూరు, చెన్సై, ముంబయ్, షిరిడీ ప్రాంతాలకు బయలుదేరే బస్సులకు సంబంధించి పూర్తి వివరాలను తెలుసుకోవచ్చు. లింక్ అడ్రస్:

వన్‌ఇండియా మొబైల్ న్యూస్ (OneIndia Mobile News):

వివిధ రంగాలకు సంబంధించి జాతీయ, అంతర్జాతీయ విశేషాలను మినిట్ టూ మినిట్ అప్‌డేట్‌లతో మీకందించే ప్రయత్నంగా భారతదేశపు నెం 1 భాషా పోర్టల్ ‘వన్ ఇండియా' ఆండ్రాయిడ్ అప్లికేషన్‌ను ఆవిష్కరించింది. యూజర్లు ఉచితంగా ఈ అప్లికేషన్‌ను తమ ఆండ్రాయిడ్ ఆధారిత స్మార్ట్‌ఫోన్‌లలోకి డౌన్‌లోడ్ చేసుకోవచ్చు. ఈ అప్లికేషన్‌ను యాక్సిస్ చేసుకోవటం ద్వారా పాలిటిక్స్, ఎంటర్‌టైన్‌మెంట్, స్పోర్ట్స్, టెక్నాలజీ, ఆటోమొబైల్స్, కామసూత్ర, హెల్త్ తదితర విభాగాలకు సంబంధించిన తాజా సమాచారాన్ని ప్రాంతీయ భాషలైన తెలుగు, తమిళం, కన్నడం, మళయాళం ఇంకా హిందీ వర్షన్‌లలో వీక్షించవచ్చ. ఈ అప్లికేషన్ సౌలభ్యతతో శ్రోత రోజకు 500 కొత్త విశేషాల పట్ల శ్రోత అవగాహన ఏర్పరుచుకోవచ్చు. లింక్ అడ్రస్:

గిజ్‌బాట్ మరిన్ని అప్‌డేట్స్ ఇక్కడే

Opinion Poll

Social Counting

ఇన్స్టెంట్ న్యూస్ అప్డేట్స్ రోజుంతా పొందండి - Telugu Gizbot