మోటో ఎక్స్, మోటో జీ, మోటో ఇ స్మార్ట్‌ఫోన్‌లకు ఆండ్రాయిడ్ 4.4.3 అప్‌డేట్

|

మోటో ఎక్స్.. మోటో జీ.. మోటో ఇ స్మార్ట్‌ఫోన్‌లకు మోటరోలా ఆండ్రాయిడ్ 4.4.3 ఆపరేటింగ్ సిస్టం అప్‌డేట్‌ను ప్రకటించింది. అయితే ప్రస్తుతానికి ఈ అప్‌డేట్ యూఎస్, బ్రెజిల్, యూఎస్ యూజర్లకు మాత్రమే అందుబాటులో ఉంది. భారత్ సహా ఆసియా మార్కెట్లలో ఈ సాఫ్ట్‌వేర్ అప్‌డేట్‌కు సంబంధించి పూర్తి వివరాలు వెల్లడికావల్సి ఉంది. ఆండ్రాయిడ్ 4.4.3 వర్షన్ ఆపరేటింగ్ సిస్టం అప్‌డేట్ అంత పెద్దది కాకపోయినప్పటికి స్వల్ప్ ఫీచర్ విస్తరింపులు ఉంటాయి. ఇండియన్ మార్కెట్లో మోటో ఎక్స్, మోటో జీ, మోటో ఇ స్మార్ట్‌ఫోన్‌లను ప్రముఖ రిటైలర్ ఫ్లిప్‌కార్ట్ ఎక్స్‌క్లూజివ్‌గా విక్రయిస్తోంది.

మోటో ఎక్స్, మోటో జీ, మోటో ఇ స్మార్ట్‌ఫోన్‌లకు  ఆండ్రాయిడ్ 4.4.3 అప్‌డేట్

మోటో ఎక్స్ కీలక స్సెసిఫికేషన్‌లను పరిశీలించినట్లయితే.... సింగిల్ సిమ్, 4.7 అంగుళాల అమోల్డ్ స్ర్కీన్ (రిసల్యూషన్ 720 x 1280పిక్సల్స్), ఆండ్రాయిడ్ 4.4 కిట్‌క్యాట్ ఆపరేటింగ్ సిస్టం, 1.7గిగాహెట్జ్ స్నాప్‌డ్రాగన్ డ్యుయల్ కోర్ ప్రాసెసర్, 2జీబి ర్యామ్, 16జీబి ఇంటర్నల్ మెమెరీ, 10 మెగా పిక్సల్ రేర్ కెమెరా, 2 మెగా పిక్సల్ ఫ్రంట్ కెమెరా, మైక్రోఎస్డీ కార్డ్‌స్లాట్ ద్వారా ఫోన్ మెమరీని విస్తరించుకునే సౌలభ్యత, 3జీ, వై-ఫై, బ్లూటూత్, జీపీఎస్, 2,200ఎమ్ఏహెచ్ బ్యాటరీ.

వివిధ మోడళ్ల స్మార్ట్‌ఫోన్‌లకు సంబంధించిన ఫోటో గ్యాలరీల కోసం క్లిక్ చేయండి.

మోటో జీ ఫోన్ కీలక స్పెసిఫికేషన్‌లను పరిశీలించినట్లయితే: 4.5 అంగుళాల డిస్‌ప్లే (720 పిక్సల్ రిసల్యూషన్, 329 పీపీఐ), స్నాప్‌డ్రాగెన్ 400 ఎస్ఓసీ విత్ 1.2గిగాహెట్జ్ క్వాడ్‌కోర్ ప్రాసెసర్, 1జీబి ర్యామ్, 5 మెగా పిక్సల్ రేర్ కెమెరా, 1.3 మెగా పిక్సల్ ఫ్రంట్ కెమెరా, 720 పిక్సల్ వీడియో రికార్డింగ్, ఇంటర్నల్ మెమెరీ వేరియంట్స్ (8జీబి, 16జీబి) .4జీ, ఎల్టీఈ కనెక్టువిటీ ఫీచర్‌కు సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది. వై-ఫై ఫీచర్‌ను పొందుపరిచారు. 7 కలర్ చేంజబుల్ బ్యాక్ కవర్స్, వాటర్ రిపెల్లంట్ కోటింగ్.

మీరు ఎంపిక చేసుకోబోయే స్మార్ట్‌ఫోన్ ఇంకా ట్యాబ్లెట్ పీసీకి సంబంధించిన ధరలను ఇక్కడ క్లిక్‌చేసి చూసుకోండి.

మోటరోలా మోటో ఇ కీలక స్పెసిఫికేషన్‌లను పరిశీలించినట్లయితే.. 4.3 అంగుళాల క్యూహైడెఫినిషన్ తాకేతెరను కలిగి ఉంటుంది.రిసల్యూషన్ సామర్ధ్యం 540x 960పిక్సల్స్, 256 పీపీఐ పిక్సల్ డెన్సిటీ.కార్నింగ్ గొరిల్లా గ్లాస్ 3 స్ర్కీన్‌ను మోటరోలా ఈ డివైస్‌ను వినియోగించింది. పొందుపరిచిన ‘వాటర్ నానో కోటింగ్ 'నీటి ప్రమాదాల నుంచి డివైస్‌ను రక్షిస్తుంది. 1.2గిగాహెట్జ్ క్లాక్ వేగంతో కూడిన డ్యూయల్ కోర్ క్వాల్కమ్ స్నాప్‌డ్రాగన్ 200 ప్రాసెసర్‌ను ఫోన్‌లో నిక్షిప్తం చేసారు. అడ్రినో 302 గ్రాఫిక్ ప్రాసెసింగ్ యూనిట్ డివైస్ గ్రాఫిక్ విభాగాన్ని మరింత బలోపేతం చేస్తుంది. పొందుపరిచిన 1జీబి ర్యామ్ సౌకర్యవంతమైన మల్టీ టాస్కింగ్‌కు దోహదపడుతుంది. ఆండ్రాయిడ్ 4.4 కిట్ క్యాట్ ఆపరేటింగ్ సిస్టం పై ఫోన్ రన్ అవుతుంది.ఫోన్ వెనుక భాగంలో 5 మెగా పిక్సల్ కెమెరా వ్యవస్థను ఏర్పాటు చేసారు. ఫ్రంట్ కెమెరా లేదు. 4జీబి ఇంటర్నల్ మెమెరీ, మైక్రోఎస్డీ కార్డ్‌స్లాట్ ద్వారా ఫోన్ మెమరీని 32జీబి వరకు పెంచుకునే అవకాశాన్ని మోటరోలా కల్పిస్తోంది.

Best Mobiles in India

ఉత్తమ ఫోన్లు

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
X