Just In
- 45 min ago
రిపబ్లిక్ డే సందర్భంగా Flipkart లో ఈ ఫోన్లపై భారీ ఆఫర్లు! ఆఫర్ల లిస్ట్ చూడండి!
- 3 hrs ago
Facebook మెసెంజర్ వాడుతున్నారా? ఈ కొత్త ఫీచర్ గురించి తెలుసుకోండి!
- 5 hrs ago
ఫిబ్రవరి లో లాంచ్ కానున్న టాప్ ప్రీమియం ఫోన్లు! టాప్ 10 ఫోన్ల లిస్ట్!
- 22 hrs ago
సోషల్ మీడియా లో కొత్త రూల్స్! మీరితే రూ.50 లక్షలు వరకు జరిమానా!
Don't Miss
- Sports
భార్యకు నెలకు రూ.1.3 లక్షలు కట్టాలి.. టీమిండియా పేసర్‌కు కోర్టు ఆదేశం!
- News
‘కొత్త’ పొత్తులపై పవన్ కళ్యాణ్ క్లారిటీ: బీజేపీకి దూరమేనా?, బీఆర్ఎస్పై జనసేనాని ఇలా
- Lifestyle
మీకు ఉన్న ఈ చెడు అలవాట్లే..ఎంత ధనవంతులైనా..బిచ్చగాడిగా మార్చేస్తుంది జాగ్రత్త!వెంటనే మానుకోండి
- Movies
Jabardasth: హీరో అయ్యాక కూడా సుధీర్ పరువు తీస్తున్నారు.. రష్మితో మళ్ళీ బుతు పంచ్ లు!
- Finance
Google: గూగుల్ ఉద్యోగులను తొలగించాలంటూ పెరుగుతున్న డిమాండ్.. అసలేం జరుగుతోంది..?
- Travel
రథసప్తమికి ముస్తాబవుతోన్న అరసవల్లి సూర్యదేవాలయం!
- Automobiles
మూడు ముళ్ళతో ఒక్కటైన కొత్త జంట 'కేఎల్ రాహుల్-అతియా శెట్టి' లగ్జరీ కార్లు.. ఇక్కడ చూడండి
గూగుల్ కొత్త ఆపరేటింగ్ సిస్టం ‘ఆండ్రాయిడ్ 4.4 కిట్‌కాట్’
ప్రపంచవ్యాప్తంగా అత్యధికంగా వాడబడుతున్న మొబైల్ ఆపరేటింగ్ సిస్టం ఆండ్రాయిడ్. ఈ మొబైల్ ఆపరేటింగ్ సిస్టంను సెర్చ్ ఇంజన్ దిగ్గజం గూగుల్ అందుబాటులోకి తీసుకువచ్చింది. మొబైల్ ఫోన్ అనుభవాలను రోజురోజుకు మార్చేస్తున్న గూగుల్ ఆండ్రాయిడ్ రకరకాల ఆపరేటింగ్ సిస్టంలతో స్మార్ట్‌ఫోన్ ప్రపంచాన్ని శాసిస్తోంది. కప్ కేక్‌తో మొదలైన ఆండ్రాయిడ్ వోఎస్‌ల ప్రస్థానం అంచెలంచెలుగా ఎగబాకుతూ డోనట్.. ఇక్లెయర్.. ఫ్రోయో..జింజర్ బ్రెడ్.. హనీకూంబ్.. ఇస్‌క్రీమ్ శాండ్విచ్.. జెల్లీబీన్.. కీ లైం పీ పేర్లతో విస్తరించింది.

తాజాగా, గూగుల్ ఆండ్రాయిడ్ కిట్‌కాట్ వర్షన్ పేరుతో సిరకొత్త ఆపరేటింగ్ సిస్టంను విడుదల చేసింది. స్వల్ప్ మార్పు చేర్పులతో మరింత ఆధునీకతను సంతరించుకునున్న ఈ స్మార్ట్ మొబైలింగ్ ఆపరేటింగ్ సిస్టం గూగుల్ నెక్సూస్ 5 స్మార్ట్‌ఫోన్‌తో ప్రపంచానికి పరిచయం కాబోతోంది. ఆండ్రాయిడ్ 4.4 కిట్‌కాట్ ఆపరేటింగ్ సిస్టంలోని ప్రత్యేక ఫీచర్లను మీతో షేర్ చేసుకుంటున్నాం.
తక్కువ ర్యామ్ సామర్ద్యం కలిగి స్మార్ట్‌ఫోన్‌లనూ ఈ ఆపరేటింగ్ సిస్టం సపోర్ట్ చేస్తుంది:
512ఎంబి అంతకన్నా తక్కువ ర్యామ్ సామర్ధ్యం కలిగిన స్మార్ట్‌ఫోన్ ఇంకా ట్యాబ్లెట్ పీసీలను ఆండ్రాయిడ్ కిట్ కాట్ ఆపరేటింగ్ సిస్టం సపోర్ట్ చేస్తుంది. స్మార్ట్‌ఫోన్‌లను బడ్జెట్ ఫ్రెండ్లీ ధరల్లో ఆఫర్ చేస్తున్న మైక్రోమ్యాక్స్, కార్బన్, లావా, సెల్‌కాన్ తదితర బ్రాండ్‌లకు ఇది కలిసొచ్చే అంశం.
స్మార్ట్ కాలర్ ఐడీ:
ఆండ్రాయిడ్ కిట్‌కాట్ ఆపరేటింగ్ సిస్టం కాలర్ ఐడీ వ్యవస్థకు మరింత సాంకేతికతను జోడించింది. కాంటాక్ట్స్ జాబితాలలోని గుర్తుతెలియని నెంబర్ల నుంచి వచ్చే ఫోన్ కాల్స్‌కు సంబంధించిన వివరాలను గూగుల్ మ్యాప్స్‌లో శోధిస్తుంది.
‘ఓకే గూగుల్' వాయిస్ సెర్చ్:
ఆండ్రాయిడ్ కిట్‌కాట్ ఆపరేటింగ్ సిస్టంలో ‘ఓకే గూగుల్' పేరుతో సరికొత్త వాయిస్ సెర్చ్ ఫీచర్‌ను ఏర్పాటు చేసారు. ఈ ఫీచర్ ద్వారా శోధన ఇంకా సందేశాలను మీ వాయిస్ ద్వారా పూర్తి చేయవవచ్చు.
మెరుగుపరచబడిన మల్టీ టాస్కింగ్:
ఆండ్రాయిడ్ కిట్‌కాట్ ఆపరేటింగ్ సిస్టం మెరుగుపరచబడిన మల్టీటాస్కింగ్ వ్యవస్థను కలిగి ఉంటుంది. తద్వారా యూజర్ వేగవంతమైన టచ్‌స్ర్కీన్ స్పందనలను ఆస్వాదించవచ్చు.
ప్రముఖ పరిచయాలు:
ఆండ్రాయిడ్ కిట్‌కాట్ ఆపరేటింగ్ సిస్టంలో ఏర్పాటు చేసిన ప్రత్యేకమైన అప్లికేషన్ వ్యవస్థ ముఖ్యమైన పరిచయాలకు (కాంటాక్టులకు) ముందు స్థానం కల్పిస్తుంది.
విస్తరించబడిన శోధనా వ్యవస్థ:
ఆండ్రాయిడ్ కిట్‌కాట్ ఆపరేటింగ్ సిస్టంను కలిగి ఉన్న స్మార్ట్‌ఫోన్ లేదా ట్యాబ్లెట్ పీసీ ద్వారా వినియోగదారుడు సమీప ప్రదేశాలు, వ్యాపారాలు ఇతర వ్యక్తులకు సంబంధించిన సమాచారాన్ని తమ గూగుల్ అప్లికేషన్ డొమైన్ ద్వారా శోధించవచ్చు.
మీరు ఎంపిక చేసుకోబోయే స్మార్ట్‌ఫోన్ ఇంకా ట్యాబ్లెట్ పీసీకి సంబంధించిన ధరలను ఇక్కడ క్లిక్‌చేసి చూసుకోండి.
వివిధ మోడళ్ల స్మార్ట్‌ఫోన్‌లకు సంబంధించిన ఫోటో గ్యాలరీల కోసం క్లిక్ చేయండి.
-
54,999
-
36,599
-
39,999
-
38,990
-
1,29,900
-
79,990
-
38,900
-
18,999
-
19,300
-
69,999
-
79,900
-
1,09,999
-
1,19,900
-
21,999
-
1,29,900
-
12,999
-
44,999
-
15,999
-
7,332
-
17,091
-
29,999
-
7,999
-
8,999
-
45,835
-
77,935
-
48,030
-
29,616
-
57,999
-
12,670
-
79,470