Home
Mobile

నోకియా 7 ప్లస్ అభిమానులకు పండుగ లాంటి వార్త..

నోకియా 7 ప్లస్ యూజర్లుకు హెచ్‌ఎండి గ్లోబల్ శుభవార్తనందించింది. Android 9 Pie ఆపరేటింగ్ సిస్టంకు సంబంధించిన ఫైనల్ అప్‌డేట్, నేటి నుంచి వారికి అందుబాటులో ఉంటుందని కంపెనీ తెలిపింది.

నోకియా 7 ప్లస్ యూజర్లుకు హెచ్‌ఎండి గ్లోబల్ శుభవార్తనందించింది. Android 9 Pie ఆపరేటింగ్ సిస్టంకు సంబంధించిన ఫైనల్ అప్‌డేట్, నేటి నుంచి వారికి అందుబాటులో ఉంటుందని కంపెనీ తెలిపింది. గూగుల్ లేటెస్ట్ వెర్షన్ ఆపరేటింగ్ సిస్టం Android 9 Pieకి సంబంధించిన ఫైనల్ ఇంకా స్థిరమైన అప్‌డేట్‌ను నేటి నుంచి ఆశించవచ్చని హెచ్‌ఎండి గ్లోబల్ చీఫ్ ప్రొడక్ట్ ఆఫీసర్ జుహో సార్వికాస్ తన అఫీషియల్ ట్విట్టర్ అకౌంట్ ద్వారా వెల్లడించారు.

అప్‌డేటెడ్ ఫీచర్స్...

అప్‌డేటెడ్ ఫీచర్స్...

ఈ అప్‌డేట్‌లో భాగంగా మరింతగా అప్‌డేట్ చేయబడిన ‘డు నాట్ డిస్ట్రబ్ మోడ్‌'తో పాటు సరికొత్త డ్యాష్‌బోర్డ్, అడాప్టివ్ బ్యాటరీ, నేవిగేషన్, అడాప్టివ్ బ్రైట్నెస్ వంటి కొత్త ఫీచర్లు ఫోన్‌లో యాడ్ కానున్నాయిని కంపెనీ తెలిపింది. Android 9 బేటా ప్రోగ్రామ్‌తో వచ్చిన మొట్టమొదటి స్మార్ట్‌ఫోన్‌లలో నోకియా 7 ప్లస్ ఒకటి.

ఫోన్ స్పెసిఫికేషన్స్ పరిశీలించినట్లయితే..

ఫోన్ స్పెసిఫికేషన్స్ పరిశీలించినట్లయితే..

6 ఇంచ్ ఫుల్ హైడెఫినిషన్ ప్లస్ ఐపీఎస్ ఎల్‌సీడీ డిస్‌ప్లే (2160 x 1080 పిక్సల్స్) విత్ కార్నింగ్ గొరిల్లా గ్లాస్ 3 ప్రొటెక్షన్, ఆండ్రాయిడ్ 9 ఆపరేటింగ్ సిస్టం, క్వాల్కమ్ స్నాప్‌డ్రాగన్ 660 ప్రాసెసర్, 4జీబి ర్యామ్, 64జీబి ఇంటర్నల్ స్టోరేజ్, 12 మెగా పిక్సల్ + 13 మెగా పిక్సల్ డ్యుయల్ రేర్ ఫేసింగ్ కెమెరా, 16 మెగా పిక్సల్ ఫ్రంట్ ఫేసింగ్ కెమెరా, 3800 ఎమ్ఏహెచ్ బ్యాటరీ.

 

 

మెషిన్ లెర్నింగ్ టెక్నాలజీతో..

మెషిన్ లెర్నింగ్ టెక్నాలజీతో..

ఆండ్రాయిడ్ 9 ఆపరేటింగ్ సిస్టంతో పోలిస్తే ఆండ్రాయిడో ఓరియోలో మెరుగైన ఫీచర్లు పొందుపరచబడి ఉన్నాయి. ఈ ఆపరేటింగ్ సిస్టంలో బ్యాటరీ బ్యాకప్ కోసం ప్రత్యేకమైన శ్రద్థను తీసుకున్నట్లు తెలుస్తోంది. ఆండ్రాయిడ్ 9 ఆపరేటింగ్ సిస్టం పై రన్ అయ్యే డివైస్‌లలో మెషిన్ లెర్నింగ్ సహాయంతో బ్యాటరీ పనిచేస్తుంది. యూజర్లు ఎక్కువగా వాడే యాప్‌లను ఓ వైపు, ఎక్కువగా వాడని యాప్‌లను మరోవైపు బకెట్లనే గ్రూపులుగా విభజించి ఇనాక్టివ్‌గా ఉండే యాప్‌లకు బ్యాటరీ పవర్‌ను నియంత్రించేలా బ్యాటరీ ఫీచర్‌ను డెవలప్ చేశారు.

నావిగేషన్ గెస్ట్యర్స్ సపోర్ట్..

నావిగేషన్ గెస్ట్యర్స్ సపోర్ట్..

ఆండ్రాయిడ్ 9 ఆపరేటింగ్ సిస్టం పై రన్ అయ్యే స్మార్ట్‌ఫోన్‌లలో నావిగేషన్ గెస్ట్యర్‌లను పూర్తిగా మార్చివేశారు. సింగిల్ హ్యాండ్‌తో హోమ్ స్క్రీన్, యాప్ స్క్రీన్, ఇతర విండోలకు స్క్రోల్ అయ్యే విధంగా ఓఎస్‌ను డిజైన్ చేశారు. ఒకటి కన్నా ఎక్కువ యాప్‌లను ఓపెన్ చేసి మల్టీ టాస్కింగ్ చేసుకునే యూజర్లకు అనువుగా ఉండేలా సిస్టమ్ నావిగేషన్‌ను మార్చారు.

 

 

 

యాప్స్‌కు దిశానిర్థేశం...

యాప్స్‌కు దిశానిర్థేశం...

ఇదే సమయంలో ఈ ఆపరేటింగ్ సిస్టంలోని యాప్స్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్‌తో పనిచేస్తాయి. మీరు ఏదైనా యాప్ ఓపెన్ చేసినప్పడు దానికి సంబంధించిన కమాండ్‌ను ముందుగా నిర్దేశించుకోవచ్చు. ఉదాహరణకు హెడ్‌ఫోన్స్ పెట్టుకోగానే మ్యూజిక్ ప్లేయర్ లేదా సాంగ్స్ యాప్ ఓపెన్ అవ్వాలని ముందుగానే సెట్ చేసి పెట్టుకుంటే ఇకపై ఎప్పుడు హెడ్‌ఫోన్స్ పెట్టుకున్నా అదే యాప్ ఓపెన్ అవుతుంది.

 

 

Best Mobiles in India

English summary
Android 9 Pie is now rolling out to the Nokia 7 Plus in ‘phased rollout’.To Know More About Visit telugu.gizbot.com
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X