ఆండ్రాయిడ్ కొత్త వర్సన్ ఆండ్రాయిడ్ ఐస్ క్రీమ్ శాండ్‌విచ్

Posted By: Super

ఆండ్రాయిడ్ కొత్త వర్సన్ ఆండ్రాయిడ్ ఐస్ క్రీమ్ శాండ్‌విచ్

రోజురోజుకీ టెక్నాలజీ మారిపోతుంది. మొన్నటి వరకు ఆండ్రాయిడ్ ఆపరేటింగ్ సిస్టమ్ అంటూ మార్కెట్లో హాడావుడి చేసిన మొబైల్ కంపెనీలు ఇప్పుడు కస్టమర్స్‌కి ఆండ్రాయిడ్ మరొ కొత్త వర్సన్‌ 'ఆండ్రాయిడ్ ఐస్ క్రీమ్ శాండ్‌విచ్‌'ని మొబైల్ మార్కెట్‌కి పరిచయం చేస్తున్నారు. ఆపిల్ కంపెనీ త్వరలో ఐఫోన్ 5ని మార్కెట్లోకి విడుదల చేస్తున్న సందర్బంలో దానికి పోటీగా ముందుగానే మార్కెట్లోకి విడుదల చేయాలని ఈ నిర్ణయం తీసుకోవడం జరిగిందని తెలిపారు.

'ఆండ్రాయిడ్ ఐస్ క్రీమ్ శాండ్‌విచ్‌' ఆపరేటింగ్ సిస్టమ్‌లో కళ్లు చెదిరేటటువంటి కొత్త ఫీచర్స్ ఉన్నాయని మార్కెట్లో వినికిడి. ముఖ్యంగా ఇందులో ఉన్న ఫేసియల్ రిగగ్నైజేషన్ సింప్లీ సూపర్బ్ అంటున్నారు నిపుణులు. గతంలో విడుదల చేసిన ఆండ్రాయిడ్ ఆపరేటింగ్ సిస్టమ్‌లో ఈ ఫేసియల్ రిగగ్నైజేషన్ పెట్టకపోవడానికి కారణం కొన్ని లోపాలు ఉండడమేనని అన్నారు. కొత్త ఆపరేటింగ్ సిస్టమ్ 'ఆండ్రాయిడ్ ఐస్ క్రీమ్ శాండ్‌విచ్‌'లో మాత్రం ఆ ప్రాబ్లమ్‌కి పరిష్కారం కొనుగోనడం జరిగిందని అన్నారు.

'ఆండ్రాయిడ్ ఐస్ క్రీమ్ శాండ్‌విచ్‌'లో ఉన్న మరో పాపులర్ ఫీచర్ ఏమిటంటే ఇది కాంబో ఆపరేటింగ్ సిస్టమ్. కాంబో ఆపరేటింగ్ సిస్టమ్ అంటే ఏమిటంటే రెండు ఆపరేటింగ్ సిస్టమ్‌ల చేసేటటువంటి పని ఈ 'ఆండ్రాయిడ్ ఐస్ క్రీమ్ శాండ్‌విచ్‌' మాత్రమే చేస్తుందన్నమాట. ఇందులో ఉన్న రెండు ఆపరేటింగ్ సిస్టమ్‌లు ఆండ్రాయిడ్ జింజర్ బ్రెడ్, ఆండ్రాయిడ్ హానీకొంబ్. ఈ సంవత్సరం నాల్గవ క్వార్టర్‌లో 'ఆండ్రాయిడ్ ఐస్ క్రీమ్ శాండ్‌విచ్‌' ఫోన్ విడుదల చేయాల్సి ఉన్నప్పటికీ, త్వరలో రాబోయే ఐఫోన్ 5కి కాంపిటేషన్‌గా ఐఫోన్ 5తో విడుదల చేయాలని నిర్ణయం తీసుకున్నారు. ఐఫోన్ 5ని సెప్టెంబర్ చివరిలో గానీ, అక్టోబర్ మొదటి వారంలో గానీ విడుదల చేయనున్న సంగతి తెలిసిందే.

ఆండ్రాయిడ్ కస్టమర్స్‌కి మరో బిగ్గెస్ట్ సర్ ప్రైజ్ ఏమిటంటే 'ఆండ్రాయిడ్ ఐస్ క్రీమ్ శాండ్‌విచ్‌' ఆపరేటింగ్ సిస్టమ్ ఓపెన్ సోర్స్. ఇదే కేటగిరిలో సాప్ట్ వేర్స్‌ని తయారు చేస్తున్నటువంటి కంపెనీలకు ఇది మింగుడు పడని విషయం. దీనిని బట్టే తెలుస్తుంది మనకు ఆండ్రాయిడ్ కొత్త వర్సన్‌లో 3డి టెక్నాలజీని కూడా సపోర్ట్ చేస్తుంది. ఇటీవల విడుదల చేసేటటువంటి అన్ని రకాల హై ఎండ్ స్మార్ట్ ఫోన్స్‌లలో 3డి టెక్నాలజీ మేజర్ రోల్ పోషిస్తుంది. దీనికి సంబంధించిన మిగిలిన సమాచారం గురించి తెలుసుకొవాలంటే వన్ ఇండియా మొబైల్‌కి టచ్‌లో ఉండండి.

Opinion Poll

Social Counting

ఇన్స్టెంట్ న్యూస్ అప్డేట్స్ రోజుంతా పొందండి - Telugu Gizbot