గెలాక్సీ ఎస్3 యూజర్లకు జెల్లీబీన్ అప్ డేట్ ఎప్పుడంటే..?

By Super
|
 Android Jelly Bean 4.1: When will Samsung Galaxy S3 Users in India Receive the Update?


ప్రపంచవ్యాప్తంగా ఉన్న సామ్‌సంగ్ గెలక్సీ ఎస్3 స్మార్ట్‌ఫోన్ యూజర్లు తమ డివైజ్‌కు ఆండ్రాయిడ్ 4.1 జెల్లీబీన్ అప్‌డేట్ ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్నారు. పలు నివేదికల ద్వారా సేకరించిన సమాచారం మేరకు ఆండ్రాయిడ్ 4.1 జెల్లీబీన్ అప్‌డేట్‌ను తొలిగా పోలాండ్ ప్రాంత యూజర్లు పొందినట్లు తెలుస్తోంది. అక్టోబర్ మధ్య నాటికి ఈ అప్‌డేట్ ప్రపంచవ్యాప్తంగా ఉన్న గెలాక్సీ ఎస్3 యూజర్లకు వర్తిస్తుందని సామ్‌సంగ్ అధికారిక వర్గాలు ప్రకటించాయి. గెలాక్సీ ఎస్3, 2012 మేలో విడుదలైంది. అమ్మకాల విషయంలోనూ గెలాక్సీ ఎస్3 ఏమాత్రం నిరుత్సాహాపరచలేదు. అనతి కాలంలోనే 30 మిలియన్ యూనిట్లు అమ్ముడై సరికొత్త రికార్డును నెలకొల్పింది.

గెలాక్సీ ఎస్3 ఫీచర్లు:

4.8 అంగుళాల మల్టీ టచ్‌స్ర్కీన్ (రిసల్యూషన్ 720 x 1280పిక్సల్స్), ఆండ్రాయిడ్ వీ4.0 ఐస్‌క్రీమ్ శాండ్‌విచ్ ఆపరేటింగ్ సిస్టం(త్వరలో ఆండ్రాయిడ్ జెల్లీబీన్‌కు అప్‌డేట్ అయ్యే అవకాశం) , క్వాడ్‌కోర్ 1.4గిగాహెడ్జ్ కార్టెక్స్ ఏ9 ప్రాసెసర్, మాలీ గ్రాఫిక్ ప్రాసెసింగ్ యూనిట్, Exynos 4212 క్వాడ్ చిప్‌సెట్, 8 మెగా పిక్సల్ కెమెరా (రిసల్యూషన్ 3264×2448పిక్సల్స్), 1.9మెగా పిక్సల్ ఫ్రంట్ కెమెరా, జియో ట్యాగింగ్, 1జీబి ర్యామ్, ఇంటర్నల్ మెమెరీ (16/32/64జీబి వేరియంట్స్), ఎక్సటర్నల్ మెమరీ 64జీబి వరకు, మైక్రోఎస్డీ ఇంకా మైక్రో ఎస్‌హెచ్‌డీసీ కార్డ్‌స్లాట్ సౌలభ్యత, జీపీఆర్ఎస్ (క్లాస్12), ఎడ్జ్ (క్లాస్ 12), వై-ఫై కనెక్టువిటీ, బ్లూటూత్ (వీ4.0), యూఎస్బీ కనెక్టువిటీ, జీపీఎస్ ఫెసిలిటీ, బ్రౌజర్ (హెచ్‌టిఎమ్ఎల్, ఆడోబ్ ఫ్లాష్), నెట్‌వర్క్ సపోర్ట్ (2జీ, 3జీ, 4జీ), ఆడియో ప్లేయర్, వీడియో ప్లేయర్, గేమ్స్, ఎఫ్ఎమ్ రేడియో, లియోన్ 2100ఎమ్ఏహెచ్ బ్యాటరీ, బరవు 133 గ్రాములు.

గెలాక్సీ ఎస్3: గెలాక్సీ ఎస్3 (16జీబి వేరియంట్ ) మునుపటి ధర రూ.38,000, తాజా ధర రూ.34,900, తగ్గింపు రూ.3,100.

Best Mobiles in India

ఉత్తమ ఫోన్లు

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
X