ఆండ్రాయిడ్ మొబైల్‌ని ఈజీగా హ్యాండిల్ చేయడం ఎలా..?

Posted By: Super

ఆండ్రాయిడ్ మొబైల్‌ని ఈజీగా హ్యాండిల్ చేయడం ఎలా..?

ఆండ్రాయిడ్‌ మొబైల్‌ వాడుతున్నారా? ఐతే ఆండ్రాయిడ్ ఆపరేటింగ్ సిస్టమ్ గురించి పూర్తి సమాచారం తెలుసుకోవాలని అనుకుంటున్నారా.. ప్రస్తుతం మొబైల్ మార్కెట్లో ఆండ్రాయిడ్ మొబైల్ ఫోన్స్ హాల్ చల్ చేస్తున్న విషయం తెలిసిందే.

బ్రౌజింగ్‌ చేస్తున్నప్పుడు ఏదైనా పదాన్ని వెతకాలంటే Menu Key-> Moreపై క్లిక్‌ చేయండి. Find on page ద్వారా సెర్చ్‌బాక్స్‌, కీబోర్డ్‌ ప్రత్యక్షమవుతాయి. ఏదైనా పేజీని ఫేస్‌బుక్‌లో పంచుకోవాలంటే బ్రౌజర్‌ విండోలోని Menu key-> More-> Share Pageలోకి వెళ్లాలి. వచ్చిన మెనూలోని Facebookను తాకితే ఫేస్‌బుక్‌ నెట్‌వర్క్‌ అవుతుంది. కొన్ని కాల్స్‌కి జవాబు ఇవ్వకూడదనుకుంటే వాటిని 'వాయిస్‌ మెయిల్‌'లోకి వెళ్లేలా చేయవచ్చు. అందుకు కాంటాక్ట్‌ 'ఎడిట్‌'లోకి వెళ్లి Additional info ద్వారా Send directly to Vicemail ఎంపిక చేయాలి.

బ్రౌజింగ్‌లో వెబ్‌ పేజీల ఫాంట్‌ సైజు పెంచాలంటే Menu key-> More-> Settingsలోకి వెళ్లి, 'టెక్ట్స్‌ సైజు'ని Normal నుంచి Largeకి మార్చుకోవచ్చు. కీబోర్డ్‌లు ఇతర భాషల్లో కావాలనుకుంటే 'ఆండ్రాయిడ్‌ మార్కెట్‌'లోకి వెళ్లి ఇన్‌స్టాల్‌ చేసుకోవచ్చు. 'గూగుల్‌ మ్యాప్స్‌'ని మార్కెట్‌ నుంచి ఉచితంగా ఇన్‌స్టాల్‌ చేసుకోవచ్చు. అడ్రస్‌ బుక్‌లో పేర్లను కాకుండా ఫొటోలను నొక్కితే వచ్చే మెనూ నుంచి ఫోన్‌ చేయడం మాత్రమే కాకుండా మెసేజ్‌, ఈ-మెయిల్‌ పంపవచ్చు. ఆండ్రాయిడ్‌ కెమెరాతో మీ ఫొటోలు మీరే తీసుకునే వీలుంది. కెమెరా అప్లికేషన్‌లోని Self Portrait Modeను ఎంపిక చేసుకుంటే సరి. కొన్ని సెకన్లకు ఒకసారి ఫొటోలు తీస్తుంది.

మెయిల్‌ చేస్తున్నప్పుడు వాక్యం పూర్తవ్వగానే 'పుల్‌ స్టాప్‌' టైప్‌ చేసి, స్పేస్‌ నొక్కి కొత్త వాక్యాన్ని మొదలు పెడతాం. ఇలా రెండూ టైప్‌ చేయకుండా రెండు స్లార్లు స్పేస్‌బార్‌ని నొక్కితే చాలు. ఫోన్‌ రింగయినప్పుడు ఎత్తకుండా సైలెంట్‌లో పెట్టాలంటే ఏం చేస్తాం? సాధారణంగా స్త్లెడర్‌గానీ, రెడ్‌బటన్‌గానీ నొక్కుతాం. అలా కాకుండా ఫోన్‌ పవర్‌ బటన్‌, వాల్యూమ్‌ బటన్స్‌తో సైలెంట్‌లో పెట్టవచ్చు. ఆండ్రాయిడ్‌ తెరపై టైం మాత్రమే చూపిస్తుంది. తేదీ చూడాలంటే 'నోటిఫికేషన్‌ ట్రే'ని కిందికి డ్రాగ్‌ చేస్తే సరి.

Opinion Poll

Social Counting

ఇన్స్టెంట్ న్యూస్ అప్డేట్స్ రోజుంతా పొందండి - Telugu Gizbot