అదిరే ఫీచర్లతో Android O

ఆండ్రాయిడ్ తన తరువాతి వర్షన్ మొబైల్ ఆపరేటింగ్ సిస్టం Android Oకు సంబంధించి డెవలపర్ ప్రివ్యూను Google I/O 2017 వేదికగా గూగుల్ పబ్లిక్ కు అందుబాటులోకి తీసుకువచ్చింది. ప్రస్తుతానాకి బేటా వర్షన్‌లో మాత్రమే ఈ ఆపరేటింగ్ సిస్టం అందుబాటులో ఉంటుంది. Android 8.0 Oreoగా రాబోతోన్న ఈ ఆపరేటింగ్ సిస్టంలో సరికొత్త ఫీచర్లను గూగుల్ యాడ్ చేసింది.

గిజ్‌బాట్ మరిన్ని అప్‌డేట్స్ ఇక్కడే

ప్రపంచవ్యాప్తంగా అందుబాటులో ఉంటుంది

Android Oకు సంబంధించిన అఫీషియల్ బేటా వర్షన్ ప్రపంచవ్యాప్తంగా అందుబాటులో ఉంటుంది. Android O బేటా ప్రోగ్రామ్‌కు సంబంధించిన లైవ్ పేజ్‌ను గూగుల్ తీసుకురాబతోంది. ఈ పేజ్ లాంచ్ అయిన వెంటనే మీ ఫోన్‌లలో Android O ప్రివ్యూను పరీక్షించుకోవచ్చు.

బేటా వర్షన్ కొద్ది ఫోన్‌లను మాత్రమే సపోర్ట్ చేస్తోంది

Android O బేటా వర్షన్ కొద్ది ఫోన్‌లను మాత్రమే సపోర్ట్ చేస్తుంది. వాటి వివరాలు.. Nexus 5X, Nexus 6P, Nexus Player, Pixel, Pixel XL, Pixel C.

ఎలా డౌన్‌లోడ్ చేసుకోవాలి...

Android Oను మీ ఫోన్‌లోకి డౌన్‌లోడ్ చేసుకునే ముందు మీ ఫోన్‌లోని డేటా మొత్తాన్ని బ్యాకప్ చేసుకోండి. ఎందుకంటే, ఈ బేటా వర్షన్ మీ ఫోన్‌లోని డేటా మొత్తాన్ని తుడిచిపెట్టేస్తుంది.ఆ తరువాత Google's Android O Beta Program పేజీలోకి వెళ్లి గూగుల్ అకౌంట్‌లోకి లాగిన్ అవటం ద్వారా Android O బేటా వర్షన్‌ను డౌన్‌లోడ్ చేసుకునే వీలుంటుంది.

వై-ఫై కనెక్షన్ బలంగా ఉండేలా చూసుకోండి

Android O బేటా వర్షన్ మీ ఫోన్‌లో ఇన్‌స్టాల్ అవుతోన్న సమయంలో వై-ఫై కనెక్షన్ బలంగా ఉండేలా చూసుకోండి. సాఫ్ట్‌వేర్ మీ ఫోన్‌లో విజయవంతంగా ఇన్‌స్టాల్ అయినట్లయితే తరువాత నుంచి లభించే అప్‌డేట్స్ అన్ని OTA రూపంలో అందుతాయి. Android O ద్వారా గూగుల్ అందించబోతోన్న సరికొత్త ఫీచర్లు...

బ్యాటరీ లైఫ్

Android O ఆపరేటింగ్ సిస్టమ్‌లో గతంలో కన్నా బ్యాటరీ లైఫ్ మరింత ఎక్కువగా వచ్చేలా డిజైన్ చేశారు. బ్యాక్‌గ్రౌండ్‌లో రన్ అయ్యే యాప్స్ బ్యాటరీ వాడుకోవడాన్ని నియంత్రించే కొత్త సాఫ్ట్‌వేర్‌ను ఇందులో తీర్చిదిద్దారు.

నోటిఫికేషన్ కంట్రోల్..

Android O ఆపరేటింగ్ సిస్టంలో యూజర్లు నోటిఫికేషన్లను మరింతగా కంట్రోల్ చేసుకోవచ్చు. అలాగే అవసరం లేని నోటిఫికేషన్లను బ్లాక్ చేయవచ్చు. కావాలనుకుంటే వాటిని కొంత సేపు అయ్యాక మళ్లీ కన్పించేలా రిమైండర్ సెట్ చేసుకోవచ్చు.

మీ డేటాకు అదనపు సెక్యూరిటీ..

Android O ఆపరేటింగ్ సిస్టం యూజర్లు ఫోన్‌లో సేవ్ చేసుకునే డేటా మరింత సురక్షితంగా ఉండేదుగాను గూగుల్ కొత్త యాప్‌లను తీసుకువచ్చింది.

మల్టీ విండో మోడ్‌

రెండు, మూడు యాప్‌లను ఒకేసారి స్క్రీన్‌పై వాడుకునేందుకు వీలుగా Android Oలో మల్టీ విండో మోడ్‌ను గూగుల్ అందిస్తోంది..

కొత్త ఫాంట్స్‌తో మరింత అందంగా...

గతంలో లాంచ్ చేసిన ఆండ్రాయిడ్ ఆపరేటింగ్ సిస్టంలతో పోలిస్తే Android O ఆపరేటింగ్ సిస్టమ్‌లో మరిన్ని కొత్త ఫాంట్లను గూగుల్ చేర్చింది. వాటితో యూజర్లు తమ డివైస్‌లోని ఫాంట్‌లను తమ ఇష్టాలకు అనుగుణంగా కస్టమైజ్ చేసుకోవచ్చు.

న్యూ ఐకాన్స్...

ఆండ్రాయిడ్ 7.0 నౌగట్‌తో పోలిస్తే Android O ఆపరేటింగ్ సిస్టమ్‌లో పలు ఐకాన్లను చాలా ఆకర్షణీయంగా తీర్చిదిద్దారు. వివిధ రకాల డిస్‌ప్లేలపై కూడా డివైస్ స్క్రీన్ మరింత ప్రకాశవంతంగా కనిపించేలా ఏర్పాటు చేశారు.

క్రాష్ కాకుండా కొత్త సాఫ్ట్‌వేర్‌

మీరు ఇంటర్నెట్ బ్రౌజర్లలో వెబ్‌సైట్లను చూస్తున్నప్పుడు అవి క్రాష్ కాకుండా ఉండేందుకు గాను Android Oలో కొత్త సాఫ్ట్‌వేర్‌ను ఏర్పాటు చేసారు.

రెండు రెట్ల వేగంతో..

గతంలో లాంచ్ చేసిన ఆండ్రాయిడ్ ఆపరేటింగ్ సిస్టంలతో పోలిస్తే Android O 2 రెట్లు వేగంతో పనిచేస్తుందని గూగుల్ చెబుతోంది. 

గిజ్‌బాట్ మరిన్ని అప్‌డేట్స్ ఇక్కడే

 

English summary
Android O: Features, beta download, name, latest news. Read More in Telugu Gizbot...
Opinion Poll

Social Counting

ఇన్స్టెంట్ న్యూస్ అప్డేట్స్ రోజుంతా పొందండి - Telugu Gizbot