ఆండ్రాయిడ్ వన్ స్మార్ట్‌ఫోన్‌లకు జనవరి చివరినాటికి లాలీపాప్ అప్‌డేట్
ఆండ్రాయిడ్ వన్ స్మార్ట్‌ఫోన్ యూజర్‌లకు శుభవార్త. గూగుల్ తర్వలోనే ఈ హ్యాండ్‌సెట్‌లకు ఆండ్రాయిడ్ లాలీపాప్ అప్‌డేట్‌ను అందించబోతోంది. ఆండ్రాయిడ్ వన్ స్మార్ట్‌ఫోన్‌లు భారత మార్కెట్లో గడిచిన సెప్టంబర్ నుంచి లభ్యమవుతున్నాయి. దేశవాళీ కంపెనీలైన మైక్రోమాక్స్, స్పైస్, కార్బన్‌లు ఈ ఫోన్‌లను ఆఫర్ చేస్తున్నాయి. 2015, జనవరి నెలాఖరు నాటికి ఆండ్రాయిడ్ లాలీపాప్ అప్‌డేట్ ఆండ్రాయిడ్ వన్ ఫోన్‌లకు అందే అవకాశం ఉంది.

ప్రస్తుతం, గూగుల్ తన ఆండ్రాయిడ్ లాలీపాప్ అప్‌డేట్‌ను నెక్సస్ డివైస్‌లకు ఆఫర్ చేస్తోంది. త్వరలోనే గూగుల్ ప్లే ఎడిషన్ డివైస్‌లకు ఈ నవీకరణ వర్తిస్తుంది. ఆండ్రాయిడ్ వన్ ఫోన్‌లు ప్రస్తుతం ఆండ్రాయిడ్ 4.4.4 కిట్‌క్యాట్ ఆపరేటింగ్ సిస్టంతో పని చేస్తున్నాయి. త్వరలోనే వీటికి ఆండ్రాయిడ్ లాలీపాప్ అప్‌డేట్ అందుతుంది.
ఇతర ప్రత్యేకతలు... 4.5 అంగుళాల టచ్ స్ర్కీన్, 1.3గిగాహెట్జ్ క్వాడ్‌కోర్ ప్రాసెసర్, 1జీబి ర్యామ్, 4జీబి ఇంటర్నల్ మెమెరీ, మైక్రోఎస్డీ కార్డ్‌స్లాట్ ద్వారా ఫోన్ మెమరీని 32జీబి వరకు విస్తరించుకునే అవకాశం, 5 మెగా పిక్సల్ రేర్ కెమెరా, 2 మెగా పిక్సల్ ఫ్రంట్ కెమెరా, 1700 ఎమ్ఏహెచ్ బ్యాటరీ. గూగుల్ ట్రాన్స్‌లేట్ ఫీచర్ ఆండ్రాయిడ్ వన్ ఫోన్‌లకు ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తుంది.
మీరు ఎంపిక చేసుకోబోయే స్మార్ట్‌ఫోన్ ఇంకా ట్యాబ్లెట్ పీసీకి సంబంధించిన ధరలను ఇక్కడ క్లిక్‌చేసి చూసుకోండి.
వివిధ మోడళ్ల స్మార్ట్‌ఫోన్‌లకు సంబంధించిన ఫోటో గ్యాలరీల కోసం క్లిక్ చేయండి.


Click it and Unblock the Notifications