Android One అంటే ఏంటి..?

ఇండియన్ మార్కెట్లో ఆండ్రాయిడ్ వన్ ఫెయిల్ అవటంతో చాలా రోజులు సైలెంట్‌గా ఉండిపోయిన గూగుల్ మరోసారి తన అదృష్టాన్ని పరీక్షించుకునే ప్రయత్నం చేసింది. షియోమీ సహకారంలో గూగల్ మరోసారి తన లేటెస్ట్ ఆండ్రాయిడ్ వన్ స్మార్ట్‌ఫోన్‌ను ఇండియన్ మార్కెట్లో విడుదల చేసింది. షియోమి Mi A1 పేరుతో లాంచ్ అయిన ఈ ఫోన్ ద్వారా స్లాక్ ఆండ్రాయిడ్ ఎక్స్‌పీరియన్స్‌ను యూజర్లు ఆస్వాదించవచ్చు.

Read More : అమరావతి - విజయవాడ మధ్య Hyperloop, ప్రయాణ సమయం 5 నిమిషాలే

గిజ్‌బాట్ మరిన్ని అప్‌డేట్స్ ఇక్కడే

ప్యూర్ ఆండ్రాయిడ్ ఎక్స్‌పీరియన్స్‌తో మార్కెట్ చేయవల్సి ఉండగా...

వాస్తవానికి ఆండ్రాయిడ్ వన్ ఫోన్‌లను ప్యూర్ ఆండ్రాయిడ్ ఎక్స్‌పీరియన్స్‌తో మార్కెట్ చేయవల్సి ఉండగా, షియోమీ Mi A1లో మాత్రం అది లోపించింది. స్టాక్ ఆండ్రాయిడ్ ఫోన్ అంటే ఆ ఫోన్‌లో ఎటువంటి యాప్ ఎడిషన్స్ ఉండకూడదు. అయితే Mi A1లో మాత్రం మూడు షియోమి యాప్స్ ఉన్నాయి. అందులో ఒకటి కెమెరా యాప్ కాగా మిగితావి Mi Store షాపింగ్ పోర్టల్ యాప్, Mi రిమోట్ యాప్.

Android అలానే Android Oneల మధ్య వ్యత్యాసం..

గూగుల్ చెప్పిన దాని ప్రకారం ఆండ్రాయిడ్ వన్ అంటే ఏంటి..? ఇదే సమయంలో Android అలానే Android Oneల మధ్య వ్యత్యాసం గురించి ఇప్పుడు తెలుసుకుందాం.

ఆండ్రాయిడ్ వన్ అంటే ఏంటి..?

ఆండ్రాయిడ్ వన్ ప్లాట్‌ఫామ్‌ను గూగుల్ కంనీ సీఈఓ సుందర్ పిచాయ్ 2014లో లాంచ్ చేసారు. రూ.6000లోపు స్మార్ట్‌ఫోన్‌లలో కూడా క్వాలిటీ స్టాక్ ఆండ్రాయిడ్ ఎక్స్‌పీరియన్స్‌ను ఆఫర్ చేయాలన్నది ఈ ప్లాట్‌ఫామ్ ముఖ్య ఉద్దేశ్యం. ఆండ్రాయిడ్ వన్ ఫోన్‌ల కోసం రూపొందించబడిన రిఫరెన్స్ హార్డ్‌వేర్ డిజైన్‌ను కూడా గూగుల్, స్మార్ట్‌ఫోన్ తయారీ కంపెనీలకు ప్రొవైడ్ చేసింది. ఆండ్రాయిడ్ వన్ స్మార్ట్‌ఫోన్‌లకు రెండు సంవత్సరాల పాటు ఆండ్రాయిడ్ ఓఎస్‌కు సంబంధించి సాఫ్ట్‌వేర్ అప్‌డేట్లు లభిస్తాయని గూగుల్ తెలిపింది.

మైక్రోమాక్స్, కార్బన్, స్పైస్ వంటి లోకల్ బ్రాండ్‌లు

భారత్‌లో ఆండ్రాయిడ్ వన్ ఫోన్‌లను మైక్రోమాక్స్, కార్బన్, స్పైస్ వంటి లోకల్ బ్రాండ్‌లు సెప్టంబర్ 2014లో లాంచ్ చేసాయి. ఆండ్రాయిడ్ వన్ ప్లాట్‌ఫామ్‌ను ఇండియన్ యూజర్లను దృష్టిలో ఉంచుకుని రూపొందించినట్లు సుందర్ పిచాయ్ తెలపటంతో ఈ ప్లాట్ ఫామ్ పై అంచనాలు మరింతగా పెరిగాయి. ఆండ్రాయిడ్ వన్ ప్లాట్‌ఫామ్‌ను భారత్‌తో పాటు పాకిస్తాన్, శ్రీలంక, మయన్మార్, ఫిలిప్పిన్స్, బాంగ్లాదేశ్, నేపాల్ వంటి దేశాల్లో కూడా గూగల్ లాంచ్ చేసింది. అయితే అనుకున్నంత స్థాయిలో ఆండ్రాయిడ్ వన్ ఆకట్టుకోలేకపోవటంతో ఈ ప్రాజెక్టును గూగుల్ కొంతకాలం పక్కనపెట్టింది. తాజాగా షియోమి Mi A1తో గూగుల్ తన ఆండ్రాయిడ్ వన్ ప్లాట్‌ఫామ్‌ను మరోసారి రంగంలోకి దింపినట్లయ్యింది.

షియోమి Mi A1 లాంచ్ సందర్భంగా..

షియోమి Mi A1 లాంచ్ సందర్భంగా గూగుల్ స్పందిస్తూ, ఆండ్రాయిడ్ వన్ ఇప్పడు మరింత సింపుల్ (స్పష్టమైన వివరణతో పాటు నాన్-బ్లోట్‌వేర్ ఇంటర్‌ఫేస్), స్మార్ట్ (ఆప్టిమేజిడ్ ఫర్ గూగుల్ సర్వీసెస్), సెక్యూర్ (ప్రొటెక్టెడ్ బై గూగుల్ ప్లే ప్రొటెక్ట్), ఫ్రెష్ (ప్రామిసుడ్ అప్‌డేట్స్) అని తెలిపింది.

ఆండ్రాయిడ్ వన్ ఫోన్‌ల వివరాలు...

ఇప్పటి వరకు ఇండియన్ మార్కెట్లో లాంచ్ అయిన ఆండ్రాయిడ్ వన్ ఫోన్‌ల వివరాలు... మైక్రోమాక్స్ కాన్వాస్ ఏ1, కార్బన్ స్పార్కిల్ వీ, స్పైస్ డ్రీమ్ యునో, లావా పిక్సల్ వీ1, షియోమి ఎంఐ ఏ1

ఆండ్రాయిడ్ వన్ vs ఆండ్రాయిడ్

ఆండ్రాయిడ్ అనేది ఓపెన్ సోర్స్ ప్లాట్ ఫామ్. ఈ ఆపరేటింగ్ సిస్టంను OEMs అలానే తయారీదారులు తమకు నచ్చినట్లుగా మార్చుకునే వీలుంటుంది. అంతేకాకుండా, ఆండ్రాయిడ్ ఆపరేటింగ్ సిస్టం బాగా హెవీగా అనిపిస్తుంది. ఓఎస్‌కు సంబంధించిన సాఫ్ట్‌వేర్ అలానే సెక్యూరిటీల అప్‌డేట్‌లను OEMs రెగ్యులేట్ చేస్తుంటాయి. ఈ విషయంలో గూగుల్ పాత్ర కొద్దిగానే ఉంటుంది.

ప్యూర్ ఆండ్రాయిడ్ ఎక్స్‌పీరియన్స్‌...

ఇక ఆండ్రాయిడ్ వన్ ప్లాట్‌ఫామ్ విషయానికి వచ్చేసరికి ఈ ప్లాట్‌ఫామ్ పై రన్ అయ్యే ఫోన్‌లు ప్యూర్ ఆండ్రాయిడ్ ఎక్స్‌పీరియన్స్‌ను ఆఫర్ చేస్తాయి. వీటి గూగుల్ నుంచి రెగ్యలర్ అప్‌డేట్స్ లభిస్తుంటాయి. ఓఎస్‌కు సంబంధించిన సాఫ్ట్‌వేర్ అలానే సెక్యూరిటీల అప్‌డేట్‌లతో OEMsకు ప్రెమేయం ఉండదు.

గిజ్‌బాట్ మరిన్ని అప్‌డేట్స్ ఇక్కడే

English summary
Android One: What It Is and All That You Need to Know. Read More in Telugu Gizbot..
Opinion Poll

Social Counting

ఇన్స్టెంట్ న్యూస్ అప్డేట్స్ రోజుంతా పొందండి - Telugu Gizbot