ఆండ్రాయిడ్ Oreo అఫీషియల్‌గా లాంచ్ అయ్యింది

భారీ ట్విస్ట్‌ల మధ్య ఆండ్రాయిడ్ లేటెస్ట్ వర్షన్ మొబైల్ ఆపరేటింగ్ సిస్టం Android Oreo సోమవారం అఫీషియల్‌గా లాంచ్ అయ్యింది. టెక్నికల్‌గా ఇది ఆండ్రాయిడ్ 8.0 వర్షన్.

Read More : కూల్‌ప్యాడ్ కూల్ ప్లే 6 vs లెనోవో కే8 నోట్, ఏది బెస్ట్ ఫోన్?

గిజ్‌బాట్ మరిన్ని అప్‌డేట్స్ ఇక్కడే

ప్రస్తుతానికి carrier టెస్టింగ్ కోసం మాత్రమే...

తొలిగా ఈ సాఫ్ట్‌వేర్ అప్‌‌డేట్ Google Pixel, Nexus 5X, and Nexus 6P స్మార్ట్‌ఫోన్‌లతో పాటు Pixel C, Nexus Player డివైస్‌లకు లభిస్తుంది. ప్రస్తుతానికి carrier టెస్టింగ్ కోసం మాత్రమే ఈ ఓఎస్ అందుబాటులో ఉంటుంది.

పిక్షర్-ఇన్-పిక్షర్ మోడ్

Android Oreo ఆపరేటింగ్ సిస్టంలో అనేక ఆసక్తికర ఫీచర్లను గూగుల్ పొందుపరిచింది. వాటిలో పిక్షర్-ఇన్-పిక్షర్ మోడ్ ఒకటి. ఈ ఫీచర్ ద్వారా ఫోన్ లో వేరొక యాప్ లో వర్క్ చేస్తూనే వీడియోలను రీసైజబుల్ ఇంకా మూవబుల్ స్మాల్ విండోలో వీక్షించే వీలుంటుంది. అంటే మిత్రులతో టెక్స్టింగ్ చేస్తూ కూడా వీడియోలను వీక్షించే వీలుటుంది.

నోటిఫికేషన్లను మరింతగా కంట్రోల్ చేసుకోవచ్చు

మరో ఫీచర్, నోటిఫికేషన్ ఛానల్ ద్వారా ఒక్కో నోటిఫికేషన్ కు ఒక్కో రకమైన కస్టమైజబుల్ ఛానల్ ను యూజర్ క్రియేట్ చేసుకోవచ్చు. "snoozing" ఫీచర్ ద్వారా నోటిఫికేషన్లను మరింతగా కంట్రోల్ చేసుకోవచ్చు. అలాగే అవసరం లేని నోటిఫికేషన్లను బ్లాక్ చేయవచ్చు. కావాలనుకుంటే వాటిని కొంత సేపు అయ్యాక మళ్లీ కన్పించేలా రిమైండర్ సెట్ చేసుకోవచ్చు.

ఏవిధమైన ఇన్‌స్టాలేషన్ అవసరం లేకండా ఆండ్రాయిడ్ ఇన్‌స్టెంట్ యాప్స్

Android Oreo ఆపరేటింగ్ సిస్టంలో ఆండ్రాయిడ్ ఇన్‌స్టెంట్ యాప్స్‌ను ఏవిధమైన ఇన్‌స్టాలేషన్ అవసరం లేకండా ఆస్వాదించవచ్చు. Android O ఆపరేటింగ్ సిస్టమ్‌లో గతంలో కన్నా బ్యాటరీ లైఫ్ మరింత ఎక్కువగా వచ్చేలా డిజైన్ చేశారు. బ్యాక్‌గ్రౌండ్‌లో రన్ అయ్యే యాప్స్ బ్యాటరీ వాడుకోవడాన్ని నియంత్రించే కొత్త సాఫ్ట్‌వేర్‌ను ఇందులో తీర్చిదిద్దారు.

Android Oreo ప్రివ్యూ

Android Oreo ప్రివ్యూను Google's Android Open Source Project ద్వారా పొందవచ్చు. ఫైనల్ వర్షన్ విడుదలవటానికి మరికొంత సమయం పడుతుంది.

గిజ్‌బాట్ మరిన్ని అప్‌డేట్స్ ఇక్కడే

English summary
Android Oreo officially arrives, but it isn't on phones just yet. Read More in Telugu Gizbot...
Opinion Poll

Social Counting

ఇన్స్టెంట్ న్యూస్ అప్డేట్స్ రోజుంతా పొందండి - Telugu Gizbot