మోటరోలా ఫోన్‌లకు Android Oreo అప్‌డేట్

గూగుల్ తన లేటెస్ట్ మొబైల్ ఆపరేటింగ్ సిస్టం Android Oreoను కొద్ది రోజుల క్రితం అఫీషియల్‌గా అనౌన్స్ చేసిన విషయం తెలిసిందే. తొలత ఈ సాఫ్ట్‌వేర్ అప్‌డేట్‌ను తమ సొంత పిక్సల్ అలానే నెక్సుస్ డివైస్‌లకు అందిస్తామని లాంచ్ సమయంలో గూగుల్ ప్రకటించింది. తాజాగా అందుతోన్న సమచారం ప్రకారం పలు మోటరోలా స్మార్ట్‌ఫోన్‌లకు కూడా Oreo అప్‌డేట్‌ను గూగుల్ ఓకే చేసినట్లు తెలుస్తోంది.

Read More : 6జీబి ర్యామ్, 128జీబి స్టోరేజ్ ఫోన్ రూ.21,499కే

గిజ్‌బాట్ మరిన్ని అప్‌డేట్స్ ఇక్కడే

మోటరోలా స్మార్ట్‌ఫోన్‌ల వివరాలు...

Android 8.0 Oreo అప్‌డేట్‌ను అందుకోబోయే మోటరోలా స్మార్ట్‌ఫోన్‌ల వివరాలు... మోటో జెడ్, మోటో జెడ్ డ్రాయిడ్, మోటో జెడ్ ఫోర్స్ డ్రాయిడ్, మోటో జెడ్ ప్లే, మోటో జెడ్ ప్లే డ్రాయిడ్, మోటో జెడ్2 ప్లే, మోటో జెడ్2 ఫోర్స్ ఎడిషన్, మోటో ఎక్స్4, మోటో జీ5, మోటో జీ5 ప్లస్, మోటో జీ5ఎస్, మోటో జీ5ఎస్ ప్లస్. ఈ 12 ఫోన్‌లకు సెప్టంబర్ లేదా అక్టోబర్‌లో Oreo అప్‌డేట్ లభించనుంది.

OnePlus 3, OnePlus 3T, OnePlus 5

మోటరోలాతో పాటుగా వన్‌ప్లస్, నోకియా, హెచ్‌టీసీ బ్రాండ్‌లకు కూడా తమ ఫోన్‌లకు Oreo అప్‌డేట్‌ను కన్ఫర్మ్ చేసాయి. వన్‌ప్లస్ బ్రాండ్ నుంచి ఇప్పటికే మార్కెట్లో లాంచ్ అయిన OnePlus 3, OnePlus 3T, OnePlus 5 స్మార్ట్‌ఫోన్‌లు మొదటిగా ఆండ్రాయిడ్ ఓరియో అప్‌డేట్‌ను అందుకునే ఫోన్ల జాబితాలో ఉన్నాయి.

HTC U11, HTC U Ultra, HTC 10

మరోవైపు హెచ్‌టీసీ నుంచి లాంచ్ అయిన HTC U11, HTC U Ultra, HTC 10 స్మార్ట్‌‌ఫోన్‌లు ఇనీషియల్‌గా ఆండ్రాయిడ్ ఓరియో అప్ డేట్ ను అందుకోబోతున్నాయి.

నోకియా 8, నోకియా 6, నోకియా 5, నోకియా 3...

నోకియా నుంచి ఇటీవల మార్కెట్లో లాంచ్ అయిన నోకియా 8, నోకియా 6, నోకియా 5, నోకియా 3 ఫోన్లు కూడా ఆండ్రాయిడ్ లేటెస్ట్ సాఫ్ట్‌వేర్ అప్‌డేట్‌ను అందుకోబోతున్నాయి. ఆండ్రాయిడ్ ఓరియో అప్‌డేట్‌ను అందుకోనున్న బ్రాండ్‌ల జాబితాలో సామ్‌సంగ్, హువావే, ఎల్‌జీ, సోనీలు కూడా ఉన్నాయి.

గిజ్‌బాట్ మరిన్ని అప్‌డేట్స్ ఇక్కడే

English summary
Android Oreo update: List of Motorola smartphones that will get the new Android 8.0. Read More in Telugu Gizbot..
Opinion Poll

Social Counting

ఇన్స్టెంట్ న్యూస్ అప్డేట్స్ రోజుంతా పొందండి - Telugu Gizbot