6జీబి ర్యామ్ ఫోన్‌లో దమ్మెంత..?

పోటీ మార్కెట్ నేపథ్యంలో దూకుడు పెంచిన స్మార్ట్‌ఫోన్ తయారీ కంపెనీలు తమ ఫోన్‌లలోని ర్యామ్ కెపాసిటీని పెంచుకుంటూ పోతున్నాయి. ప్రముఖ చైనా ఫోన్‌ల కంపెనీ Vivo ప్రపంచపు మొట్టమొదటి 6జీబి ర్యామ్ ఫోన్‌ను లాంచ్ చేసి స్మార్ట్‌ఫోన్ ప్రియులను నివ్వెర పరిచింది.

6జీబి ర్యామ్ ఫోన్‌లో దమ్మెంత..?

Vivo Xplay 5 స్మార్ట్‌ఫోన్‌ను అనుసరిస్తూ Asus ZenFone 3 Deluxe, OnePlus 3,LeEco Le Max 2 ఫోన్‌‌లు 6జీబి ర్యామ్‌తో మార్కెట్లో విడుదలయ్యాయి. ఇదంతా బాగానే ఉన్నప్పటికి.. ఫోన్ కాల్స్, సోషల్ మీడియా చాటింగ్, ఇంటర్నెట్ బ్రౌజింగ్, మల్టీ మీడియా వంటి ఇన్‌స్టెంట్ కమ్యూనికేషన్ అవసరాలను తీర్చగలిగే స్మార్ట్‌ఫోన్‌లలో 6జీబి ర్యామ్ అవసరమా అన్న సందిగ్థత పలువురిలో వ్యక్తమవుతోంది...

Read More : రూ.7000లో ఆండ్రాయిడ్ లేటెస్ట్ ఫోన్‌లు ఇవే

గిజ్‌బాట్ మరిన్ని అప్‌డేట్స్ ఇక్కడే

అసలు RAM అంటే ఏంటి..?

ర్యామ్ (ర్యాండమ్ యాక్సెస్ మెమరీ) అనేది ఫోన్‌ను రన్ చేసేందుకు అవసరమైన ఆపరేటింగ్ సిస్టం, రన్ అవుతోన్న యాప్స్ ఇంకా కొంత టెంపరరీ డేటాను తనలో స్టోర్ చేసుకుంటుంది. ఫోన్ ఇంటర్నల్ స్టోరేజ్ కంటే వేగంగా స్పందించ గల సామర్థ్యం ర్యామ్‌కు ఉంటుంది. ర్యామ్‌లో స్టోర్ కాబడిన డేటాను వేగవంతంగా యాక్సెస్ చేసుకోవచ్చు.

RAM తన పరిధిని ఎట్లా విస్తరించుకుంది..?

స్మార్ట్‌ఫోన్ పనితీరులో ర్యామ్ పాత్ర ఎంతో కీలకం. ర్యామ్ స్థాయి పెరిగేకొద్ది ఫోన్ ప్రాసెసింగ్ వేగం పెరుగుతూ ఉంటుంది. మొదట్లో స్మార్ట్‌ఫోన్‌లు 256 ఎంబి, 512 ఎంబి ర్యామ్ వేరియంట్‌లలో లభ్యమయ్యేవి. వీటిలో మల్టీ టాస్కింగ్ మందకొడిగా ఉండేది. ఈ నేపధ్యంలో మల్టీ టాస్కింగ్ వేగాన్ని మరింత పెంచుతూ 1జీబి, 2జీబి, 3జీబి, 4జీబి, 6జీబి ర్యామ్‌లతో స్మార్ట్‌ఫోన్‌లు అందుబాటులోకి వచ్చేసాయి.

RAM తన పరిధిని ఎట్లా విస్తరించుకుంది..?

ఆండ్రాయిడ్ ఫోన్‌లు రోజురోజుకు తమ సామర్థ్యాలను పెంచుకుంటోన్న నేపథ్యంలో ర్యామ్ తన పరిధిని విస్తరించుకోవల్సిన పరిస్థితులు ఏర్పడ్డాయి. 2015లో చూసినట్లయితే 3జీబి ర్యామ్ ఫోన్‌లను వెనక్కునెట్టి 4జీ ర్యామ్ ఫోన్‌లు తమ ఉనికిని చాటుకునే ప్రయత్నం చేస్తాయి. ఈ ఏడాది 4జీబి ర్యామ్ ఫోన్‌లను వెనక్కినెట్టి 6 జీబి ర్యామ్ ఫోన్‌లు తమ సత్తాను చాటుకునే ప్రయత్నం చేస్తున్నాయి.

ఆండ్రాయిడ్ ఫోన్‌లకు ఎక్కువ ర్యామ్ ఎందుకు అవసరం..?

మార్కెట్లో లభ్యమయ్యే చాలా వరకు కంప్యూటర్లు 4జీబి అంతకన్నా తక్కువ ర్యామ్ సామర్థ్యంతో వస్తున్నాయి. ఈ నేపథ్యంలో కంప్యూటర్ కన్నా చాలా తక్కువ పరిమాణంలో ఉండే స్మార్ట్‌ఫోన్‌లకు 6జీబి ర్యామ్ అవసరమా అన్న సందిగ్థత పలువురిలో వ్యక్తమవుతోంది. మైక్రోసాఫ్ట్ ఇటీవల తన విండోస్ 10 ఆపరేటింగ్ సిస్టంకు సంబంధించి ఓ డాక్యుమెంటేషన్‌ను విడుదల చేసింది. ఈ డాక్యుమెంటేషన్ ప్రకారం విండోస్ 10 ఓఎస్‌ను రన్ చేసేందుకు 32 బిట్ వర్షన్‌కు 1జీబి ర్యామ్, 64 బిట్ వర్షన్‌కు 2జీబి ర్యామ్ సరిపోతుందట. అన్ని విండోస్ 10 కంప్యూటింగ్ డివైస్‌లకు ఇది వర్తిస్తుంది.

6జీబి ర్యామ్ అవసరమా..?

యాపిల్ ఐఫోన్‌లు గరిష్టంగా 2జీబి ర్యామ్‌తో వస్తున్నాయి. వీటిలో ఎటువంటి ల్యాగింగ్ సమస్యలు ఉండటం లేదు. మరి, ఇలాంటపుడు ఆండ్రాయిడ్ స్మార్ట్‌ఫోన్‌లకు 6జీబి ర్యామ్ అవసరమా..?

ఆపరేటింగ్ సిస్టంల మధ్య తేడాలు

ఆపరేటింగ్ సిస్టంల మధ్య తేడాలు నెలకున్న నేపథ్యంలో ఆండ్రాయిడ్ ఫోన్‌లకు ఎక్కువ ర్యామ్ అవసరమవుతోందని నిపుణులు చెబుతున్నారు. మార్కెట్లో లభ్యమవుతోన్న చాలా వరకు ఆండ్రాయిడ్ యాప్స్ జావా ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్‌ను ఉపయోగించుకుంటున్నాయి. ఈ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్, యాప్‌కు సంబంధించిన మెమరీ రీసైకిలింగ్ పై ఆధారపడి ఉంటుంది. ఈ ప్రక్రియనే గార్బేజ్ కలెక్షన్ అని కూడా అంటారు. ఇదే సమయంలో ఐఓఎస్ ప్లాట్‌ఫామ్ కోసం డిజైన్ చేయబడిన iOS యాప్స్‌కు ఇంత తతంగం అవసరం ఉండదు.

ఒక్కో స్మార్ట్‌ఫోన్ బ్రాండ్...

ఇదే కాకుండా, ఒక్కో స్మార్ట్‌ఫోన్ బ్రాండ్ ఒక్కోరకమైన సాఫ్ట్‌వేర్‌తో వస్తోన్న నేపథ్యంలో ఆండ్రాయిడ్ ఫోన్‌లలో ర్యామ్ వినియోగం విస్తృతమవుతోంది. ఉదాహరణకు, గూగుల్ నెక్సుస్ 6 స్మార్ట్‌ఫోన్‌కు 1.2జీబి ర్యామ్ అవసరమవుతుంది (యాప్స్‌తో సంబంధం లేకుండా). ఇదే సమయంలో ఆక్సిజన్ ఆపరేటింగ్ సిస్టం 1.39జీబి ర్యామ్‌ను ఉపయోగించుకుంటుంది. గెలాక్సీ నోట్ 5 ఫోన్ 1.7జీబి ర్యామ్‌ను ఉపయోగించుకుంటుంది. ఈ ఆండ్రాయిడ్ ఫోన్‌లలో అదనంగా బ్యాక్ గ్రౌండ్ సర్వీసులు రన్ చేస్తున్నట్లయితే ర్యామ్ వినియోగం మరింత అవసరమవుతుంది.

స్మార్ట్‌ఫోన్‌కు ఎంత ర్యామ్ అయితే సరిపోతుంది..?

ఫోన్‌లో ఏ విధమైన యాప్స్ లేకపోయినట్లయితే 1జీబి లేదా 2జీబి ర్యామ్ ఫోన్ మీ మల్టీ టాస్కింగ్‌కు సరిపోతుతంది. అలా కాకుండా మీ ఫోన్‌లో పిచ్చాపాటిగా యాప్స్ ఉన్నట్లయితే ర్యామ్ పై ఒత్తిడి మరింత పెరిగి ఫోన్ నెమ్మదించే అవకాశం ఉంటుంది. స్మార్ట్‌ఫోన్‌లలో ఎక్కువ యాప్స్‌ను రన్ చేసే అలవాటున్న వారికి 4జిబి ర్యామ్ ఫోన్ సరిపోతుంది!.

ఎక్కువ ర్యామ్ వల్ల ఉపయోగమోనా..?

వాస్తవానికి, 6జీబి ర్యామ్ అనేది స్మార్ట్‌ఫోన్‌కు చాలా ఎక్కువ. ఇదే సమయంలో ఫోన్‌లో ర్యామ్ ఎక్కువగా ఉండటం ఎటువంటి నష్టం లేదు. మీ ఫోన్‌లో 6జీబి ర్యామ్ ఉన్నట్లయితే, మీ ఫోన్ ఎక్కువ డేటాను ఒకేసారి హ్యాండిల్ చేయగలుగుతుంది. యాప్స్ మధ్య త్వరగా స్విచ్ అవ్వొచ్చు. ఎక్కువ ర్యామ్‌ను కలిగి ఉండే ఫోన్‌లు భవిష్యత్ అవసరాలకు ఉపయోగపడతాయి.

ప్రస్తుత పరిస్థితుల్లో 6జీబి ర్యామ్‌కు అప్‌గ్రేడ్ అవ్వొచ్చా..?

మీరు 6జీబి ర్యామ్ స్మార్ట్‌ఫోన్ కోసం చూస్తున్నట్లయితే లిమిటెడ్ వర్షన్‌లో ఆప్షన్స్ అందుబాటులో ఉన్నాయి.

గిజ్‌బాట్ మరిన్ని అప్‌డేట్స్ ఇక్కడే

English summary
Do You Really Need a 6 GB RAM Smartphone? Get to Know!. Read More in Telugu Gizbot..
Opinion Poll

Social Counting

ఇన్స్టెంట్ న్యూస్ అప్డేట్స్ రోజుంతా పొందండి - Telugu Gizbot