నోకియా నుంచి డబల్ ధమాకా, లైన్‌లో 4జీబి ర్యామ్ ఫోన్ కూడా

కొద్ది రోజుల క్రితం Nokia D1C ఆండ్రాయిడ్ నౌగట్ ఫోన్ గురించి గీక్‌బెంచ్ వెబ్‌సైట్ ఆసక్తికర వివరాలను వెల్లడించగా, తాజాగా మరో నోకియా ఆండ్రాయిడ్ ఫోన్‌కు సంబంధించిన సమాచారం ఇంటర్నెట్‌లో హల్‌చల్ చేస్తోంది. కొత్త రిపోర్ట్స్ ప్రకారం Nokia P1 పేరుతో ఓ మెటల్ బాడీ ఫోన్ రూపుదిద్దుకుంటోందట. ఈ ఫోన్ రెండు వేరియంట్‌లలో అందుబాటులో ఉంటుందని తెలుస్తోంది.

Read More : గూగుల్ తయారు చేసిన పిక్సల్ స్మార్ట్‌ఫోన్‌లు ఎలా ఉన్నాయ్..?

గిజ్‌బాట్ మరిన్ని అప్‌డేట్స్ ఇక్కడే

Nokia P1 రెండు డిస్‌ప్లే వేరియంట్‌లలో

Nokia P1 రెండు డిస్‌ప్లే వేరియంట్‌లలో అందుబాటులో ఉంటుంది. మొదటి వేరియంట్ 5.2 అంగుళాల డిస్‌ప్లేతో, రెండవ వేరియంట్ 5.5 అంగుళాల డిస్‌ప్లేతో రానున్నట్లు తెలుస్తోంది.

నోకియా Z లాంచర్

క్యూహైడెఫినిషన్ (2560 x 1440పిక్సల్స్) అమోల్డ్ డిస్‌ప్లే వ్యవస్థతో వస్తోన్నఈ ఫోన్స్ ఆండ్రాయిడ్ 7.0 నౌగట్ ఆపరేటింగ్ సిస్టం ఆధారంగా డిజైన్ చేసిన నోకియా Z లాంచర్ యూజర్ ఇంటర్‌ఫేస్ పై రన్ అవుతాయట.

శక్తివంతమైన కెమెరాలతో...

శక్తివంతమైన కెమెరాలతో వస్తోన్న ఈ ఫోన్‌లలో graphene కెమెరా సెన్సార్‌లను వాడినట్లు సదరు రిపోర్ట్ చెబుతోంది. ఈ సెన్సార్‌లో లైట్ కండీషన్స్ లోనూ హైక్వాలిటీ ఫోటగ్రఫీని చేరువచేస్తాయి.

ఐపీ68 సర్టిఫికేషన్‌

ఐపీ68 సర్టిఫికేషన్‌తో వస్తోన్న నోకియా పీ1 ఫోన్ నీటీ ప్రమాదాలను సైతం సమర్థవంతంగా ఎదర్కోగలదట. డస్ట్ రెసిస్టెంట్ కూడా.

శక్తివంతమైన ప్రాసెసర్..

శక్తివంతమైన క్వాల్కమ్ స్నాప్‌డ్రాగన్ 820 లేదా స్నాప్‌డ్రాగన్ 821 SoCలను ఈ ఫోన్‌లలో నిక్షిప్తం చేసి ఉండొచ్చని ఆ రిపోర్ట్ పేర్కొంది.  4జీబి ర్యామ్‌ను ఈ ఫోన్‌లలో నిక్షిప్తం చేసినట్లు తెలుస్తోంది.

డిసెంబర్‌‍లో లాంచ్ కాబోతోన్న..

డిసెంబర్‌‍లో లాంచ్ కాబోతోన్న నోకియా ఆండ్రాయిడ్ ఫోన్లకు సంబంధించి రోజుకో ఆసక్తికర విషయంలో ఇంటర్నెట్‌లో హల్‌చల్ చేస్తోంది. అయితే, వీటిలో ఏ ఒక్క సమాచారాన్ని నోకియా ఇప్పటి వరకు ధృవీకరించంలేదు.

గిజ్‌బాట్ మరిన్ని అప్‌డేట్స్ ఇక్కడే

English summary
Android powered Nokia P1 with QHD display, metal body in works. Read More in Telugu Gizbot...
Opinion Poll

Social Counting

ఇన్స్టెంట్ న్యూస్ అప్డేట్స్ రోజుంతా పొందండి - Telugu Gizbot