'ఆండ్రాయిడ్ ఓఎస్' తో 'జడ్‌టిఈ ఛేజర్'

Posted By: Prashanth

'ఆండ్రాయిడ్ ఓఎస్' తో 'జడ్‌టిఈ ఛేజర్'

 

తక్కువ ధరలో నాణ్యమైన మొబైల్ ఫోన్స్‌ని రూపొందించే జడ్‌టిఈ కంపెనీ మార్కెట్లోకి త్వరలో రెండు కొత్త స్మార్ట్‌ఫోన్స్‌ని విడుదల చేసేందుకు సన్నాహాలు చేస్తుంది. జడ్‌టిఈ విడుదల చేయనున్నస్మార్ట్‌ఫోన్ పేరు 'జడ్‌టిఈ ఛేజర్'. ఈ స్మార్ట్ ఫోన్ కూడా ఆండ్రాయిడ్ ఆపరేటింగ్ సిస్టమ్‌తో మార్కెట్లోకి విడుదల కానున్నాయి. వన్ ఇండియా పాఠకులకు 'జడ్‌టిఈ ఛేజర్' స్మార్ట్ ఫోన్ ప్రత్యేకతలు క్లప్తంగా..

'జడ్‌టిఈ ఛేజర్' మొబైల్ ప్రత్యేకతలు:

* డిస్ ప్లే: 3.5 inch HVGA capacitive touchscreen

* ఆపరేటింగ్ సిస్టమ్: Android 2.3 Gingerbread

* ప్రాసెసర్: 600 MHz Single core Processor

* కెమెరా: 3.2 megapixels Camera

* ఇంటర్నల్ మెమరీ RAM: 512 MB

* విస్తరించు మెమరీ: up to 32GB

* జిపిఆర్ఎస్: Yes

* బ్లూటూత్: Yes

* వైర్ లెస్: Wi-Fi

* పోర్ట్: USB

* వీడియో ప్లేయర్: Multi-format Video Player

* మ్యూజిక్ ప్లేయర్: Multi-format Music Player

* బ్యాటరీ: Li-ion

* కలర్: Black

యూజర్స్‌కు చక్కని విజువల్ ఎక్స్ పీరియన్స్‌ని అందించేందు గాను 3.5 ఇంచ్ కెపాసిటివ్ టచ్ స్క్రీన్‌ని రూపొందించడం జరిగింది. మొబైల్ ఫెర్పామెన్స్ ఫాస్టుగా ఉండేందుకు గాను 600 MHz సింగిల్ కోర్ ప్రాససెర్‌ని నిక్షిప్తం చేశారు. మొబైల్ వెనుక భాగాన ఉన్న 3.2 మెగా ఫిక్సల్ కెమెరా సహాయంతో అందమైన ఫోటోలను తీయవచ్చు. 512 MB ప్రత్యేకం.

మొబైల్‌తో పాటు ఇంటర్నల్‌గా కొంత మెమరీ లభిస్తుండగా, ఇందులో ఉన్న మైక్రో ఎస్‌డి స్లాట్ ద్వారా మెమరీని 32జిబి వరకు విస్తరించుకొవచ్చు. కమ్యూనికేషన్, కనెక్టివిటీ ఫీచర్స్ విషయానికి వస్తే బ్లూటూత్, వై - పై లను సపోర్ట్ చేస్తుంది. నలుపు కలర్‌లో లభ్యమవుతున్న ఈ మొబైల్‌పై మార్కెట్లో ఇప్పటికే భారీ అంచనాలు ఉన్నాయి. అధికారకంగా జడ్‌టిఈ కంపెనీ దీని ధరను మార్కెట్లో వెల్లడించ లేదు.

Opinion Poll

Social Counting

ఇన్స్టెంట్ న్యూస్ అప్డేట్స్ రోజుంతా పొందండి - Telugu Gizbot