Home
Mobile

ఆండ్రాయిడ్ సీక్రెట్ కోడ్స్.. ఇవి నొక్కండి, ఆశ్చర్యపోయే ఫీచర్లు చూడండి!

Android secret codes: ఈ రోజుల్లో సెల్ ఫోన్ లేని వాళ్లు దాదాపుగా ఉండరు. పల్లెటూర్ల నుంచి పట్టణాల వరకు ప్రతి ఒక్కరి జీవితంలో ఇది ఒక ముఖ్యమైన భాగంగా మారిపోయింది. మీరు ఆండ్రాయిడ్ ఫోన్ వాడుతున్నారా అయితే మీ ఫోన్ గురించి కొన్ని రహస్య విషయాలు తెలుసుకోవడానికి మీకు సహాయపడే సీక్రెట్ కోడ్స్ గురించి తప్పకుండా తెలుసుకోవాలి. ఈ కోడ్స్‌తో మీ ఫోన్ స్టేటస్ చెక్ చేసుకోవచ్చు, IMEI నంబర్‌ని ట్రాక్ చేయవచ్చు.

బ్యాటరీ, కెమెరా వర్క్ చేస్తున్నాయో లేదో కూడా టెస్ట్ చేయవచ్చు. ఇంకా చాలా చాలా హిడెన్ సీక్రెట్స్ ఉన్నాయి. ఆండ్రాయిడ్ సీక్రెట్ కోడ్స్‌లో ముఖ్యంగా రెండు రకాలు ఉన్నాయి. అందులో మొదటిది USSD కోడ్స్ (అన్‌స్ట్రక్చర్డ్ సప్లిమెంటరీ సర్వీస్ డేటా). ఈ కోడ్స్ మీ మొబైల్ నెట్‌వర్క్ క్యారియర్ ఆధారంగా పనిచేస్తాయి.

Android Secret Codes Unlock Hidden Info on Your Phone with These 7 Codes

వీటిని ఎక్కువగా సిమ్ కార్డ్ బ్యాలెన్స్ చెక్ చేసుకోవడానికి, సర్వీస్‌లను యాక్టివేట్ చేసుకోవడానికి లేదా నెట్‌వర్క్ సంబంధించిన ఇతర సమాచారం తెలుసుకోవడానికి ఉపయోగిస్తారు. రెండోది MMI కోడ్స్ (మ్యాన్-మెషిన్ ఇంటర్‌ఫేస్), ఈ కోడ్స్ ఫోన్ బ్రాండ్, మోడల్‌పై ఆధారపడి ఉంటాయి. ఇవి ఫోన్ సాఫ్ట్‌వేర్, హార్డ్‌వేర్, సిస్టమ్ పనితీరు గురించిన వివరాలను అందిస్తాయి.

* తప్పకుండా తెలుసుకోవాల్సిన 7 ముఖ్యమైన సీక్రెట్ కోడ్స్ ఇక్కడ ఉన్నాయి:

- కాల్ ఫార్వార్డింగ్ స్టేటస్ - *#21#

మీ కాల్స్, మెసేజ్‌లు లేదా డేటా వేరే నంబర్‌కు ఫార్వార్డ్ అవుతున్నాయా లేదా అని చెక్ చేయడానికి ఈ కోడ్ సహాయపడుతుంది. ఎవరైనా రహస్యంగా మీ కాల్స్‌ను దారి మళ్లిస్తున్నారా అని తెలుసుకోవాలనుకుంటే, ఈ కోడ్ మీకు ఉపయోగపడుతుంది. దీన్ని టైప్ చేసిన తర్వాత మీరు డయల్ చేస్తే ఈ సమాచారం తెలుస్తుంది.

- డివైజ్ టెస్టింగ్ - #0#

ఫోన్ డిస్‌ప్లే, స్పీకర్, కెమెరా, రిసీవర్, వైబ్రేషన్ లేదా సెన్సార్‌లు సరిగ్గా పనిచేస్తున్నాయా లేదా అని చెక్ చేయాలనుకుంటే, ఈ కోడ్‌ను డయల్ చేయండి. ఇది ఒక హిడెన్ టెస్ట్ మెనూని ఓపెన్ చేస్తుంది. అక్కడ ఒక్కో ఫీచర్‌ని మాన్యువల్‌గా చెక్ చేసుకోవచ్చు.

అయితే ఈ టెస్టులు చేసేటప్పుడు వాటిని ఫినిష్ చేయాలి. స్క్రీన్ టెస్ట్ అయితే స్క్వేర్ బాక్సులన్నీ గ్రీన్ కలర్‌తో ఫిల్ చేస్తూ వెళ్లాలి. ఈ టెస్టులు చేసేటప్పుడు ఫోన్ చాలా బ్రైట్‌గా మారుతుంది. దీనివల్ల ఛార్జింగ్ దిగిపోయే అవకాశం ఉంది. కాబట్టి బాగా ఛార్జింగ్ ఉన్నప్పుడు మాత్రమే దీన్ని ట్రై చేయాలి.

* SAR (రేడియేషన్) విలువ - *#07#

ఈ కోడ్ మీ ఫోన్ SAR (స్పెసిఫిక్ అబ్జార్ప్షన్ రేట్) విలువను చూపిస్తుంది. ఇది మీ ఫోన్ ఎంత రేడియేషన్‌ను విడుదల చేస్తుందో కొలుస్తుంది. సురక్షితమైన SAR విలువ 1.6 W/kg కంటే తక్కువగా ఉండాలి. అంతర్జాతీయ ప్రమాణాల ప్రకారం, అంతకంటే ఎక్కువగా SAR వేల్యూ ఉంటే ఇబ్బందే.

ఎక్కువ రేడియేషన్ స్థాయిలు ఆరోగ్య సమస్యలకు కారణం కావచ్చు. కాబట్టి, ఈ కోడ్‌తో మీ ఫోన్ రేడియేషన్ లెవెల్స్ చెక్ చేసుకోవడం మంచిది. ఈ వ్యాల్యూ ఎక్కువగా ఉందని తెలిస్తే ఆ ఫోన్ తక్కువగా వాడటం మంచిది. మొబైల్ కొనుగోలుదారులు కూడా ఇది ఎంతో ఉందో స్పెసిఫికేషన్ల ఆధారంగా తెలుసుకోవచ్చు.

* IMEI నంబర్ - *#06#

ప్రతి ఫోన్‌కు ఒక ప్రత్యేకమైన IMEI (ఇంటర్నేషనల్ మొబైల్ ఎక్విప్‌మెంట్ ఐడెంటిటీ) నంబర్ ఉంటుంది. మీ ఫోన్ పోగొట్టుకున్నా లేదా దొంగతనానికి గురైనా ఈ నంబర్ చాలా ఉపయోగపడుతుంది. ఫోన్‌ను ట్రాక్ చేయడానికి లేదా బ్లాక్ చేయడానికి ఇది సహాయపడుతుంది. ఫోన్ IMEI నంబర్ తెలుసుకోవడానికి ఇది చాలా సింపుల్ కోడ్.

* ఫ్యాక్టరీ రీసెట్ - 2767*3855#

ఈ కోడ్‌తో మాత్రం చాలా జాగ్రత్తగా ఉండాలి. దీన్ని ఎంటర్ చేస్తే ఫోన్ పూర్తిగా రీసెట్ అవుతుంది. డేటా మొత్తం పోతుంది. మీ ఫోన్‌ను పూర్తిగా క్లీన్ చేయాలనుకుంటే మాత్రమే దీన్ని ఉపయోగించాలి. ఈ కోడ్‌ను ఉపయోగించే ముందు డేటాను బ్యాకప్ చేసుకోవడం ఎప్పుడూ మంచిది. లేదంటే మీ ఫోన్ కొత్త దానిలా ఖాళీ అయిపోతుంది.

* బ్యాటరీ, నెట్‌వర్క్ సమాచారం - ##4636##

మీ బ్యాటరీ హెల్త్, ఇంటర్నెట్ కనెక్షన్ లేదా వైఫై వివరాలు తెలుసుకోవాలనుకుంటటే ఈ కోడ్ మీకు ఆ సమాచారం మొత్తం ఒకే చోట అందిస్తుంది. బ్యాటరీ కండిషన్, మీ మొబైల్ నెట్‌వర్క్ ఎలా పనిచేస్తుందో అర్థం చేసుకోవడానికి ఇది సహాయపడుతుంది. నెట్‌వర్క్ స్పీడ్ సరిగ్గా లేనప్పుడు ఈ కోడ్‌తో చెక్ చేసుకోవచ్చు.

* కెమెరా సమాచారం - ##34971539##

ఈ కోడ్ కెమెరా గురించిన పూర్తి సమాచారాన్ని అందిస్తుంది. మీ కెమెరా సరిగ్గా పనిచేస్తుందా లేదా అని చెక్ చేసుకోవడానికి, మీ ఫోన్ కెమెరా సెన్సార్‌ల గురించిన టెక్నికల్ వివరాలను చూడటానికి ఇది అనుమతిస్తుంది. కెమెరాలో ఏమైనా ప్రాబ్లమ్స్ ఉన్నాయా అని తెలుసుకోవాలనుకుంటే ఈ కోడ్ ట్రై చేయవచ్చు.

* ముఖ్య విషయాలు

ఈ సీక్రెట్ కోడ్స్ మీ ఆండ్రాయిడ్ ఫోన్‌లో దాగి ఉన్న ఉపయోగకరమైన సమాచారం, ఫీచర్లను యాక్సెస్ చేయడానికి మీకు సహాయపడతాయి. అయితే, కొన్ని కోడ్‌లు అన్ని డివైజ్‌లలో పనిచేయకపోవచ్చు. ఎందుకంటే కొన్నిసార్లు తయారీదారులు వాటిని డిసేబుల్ చేస్తారు. అలాగే, ఫ్యాక్టరీ రీసెట్ కోడ్ వంటి వాటిని చాలా జాగ్రత్తగా ఉపయోగించాలి.

More from GizBot

Best Mobiles in India

English summary
Android secret codes unlock hidden features for device testing, IMEI checks, battery and camera info. USSD and MMI codes access these functions. Caution advised for factory reset codes.
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X