Just In
Don't Miss
- News
Bloodiest Day: మయన్మార్‌లో నిరసనకారులపై కాల్పులు: 18 మంది మృతి, 30 మందికి గాయాలు
- Movies
ఉప్పెనతో లాభాలు.. మరో మెగా హీరోపై ఇన్వెస్ట్ చేస్తున్న సుకుమార్
- Sports
అశ్విన్.. ఇంగ్లండ్‌ను ఎక్కడా వదలట్లేదు.. వసీం జాఫర్ ట్వీట్
- Finance
9 కంపెనీల మార్కెట్ క్యాప్ రూ.2.2 లక్షల కోట్లు డౌన్, రిలయన్స్ మాత్రమే అదరగొట్టింది
- Automobiles
అతి తక్కువ ధరకే బౌన్స్ ఎలక్ట్రిక్ స్కూటర్.. పూర్తి వివరాలు
- Lifestyle
ఈ వారం మీ రాశి ఫలాలు ఫిబ్రవరి 28 నుండి మార్చి 6వ తేదీ వరకు
- Travel
కర్ణాటక జూన్ 1 నుండి ఈ ఆధ్యాత్మిక ప్రదేశాలను తెరవనుంది..
ఈ 6 ఆండ్రాయిడ్ స్మార్ట్‌ఫోన్‌లు అచ్చం iPhone Xలానే ఉంటాయి
యాపిల్ ఐఫోన్ మార్కెట్లో లాంచ్ అయి 10 వసంతాలు పూర్తి చేసుకున్న సందర్భాన్ని పురస్కరించుకుని, ఆ సంస్థ 2017లో లాంచ్ చేసిన స్పెషల్ ఎడిషన్ ఫోన్ 'ఐఫోన్ ఎక్స్' మార్కెట్లో కొత్త ఒరవడికి శ్రీకారం చుట్టింది. ఐఫోన్ 10గా అభివర్ణించబడుతోన్న ఈ ఫోన్ ఇప్పటి వరకు మార్కెట్లో లాంచ్ అయిన ఐఫోన్‌లతో పోలిస్తే అట్రాక్టివ్ ఫీచర్లను కలిగి ఉంది. నాట్జ్ (notch) డిస్‌ప్లే ఈ ఫోన్‌కు ప్రధాన హైలైట్‌గా నిలుస్తుంది. ఈ ఫోన్‌లో హోమ్ బటన్ కనిపించదు. స్టెయిన్‌లెస్ స్టీల్ బ్యాండ్స్ డివైస్ లుక్‌నే మార్చేసాయి. గ్లాస్ బాడీ ఫోన్‌కు ప్రొఫెషనల్ లుక్‌ను తీసుకువచ్చింది. నాట్చ్ డిస్‌ప్లే ఫోన్‌లకు మార్కెట్లో రోజురోజుకు ఆదరణ పెరుగుతోన్న నేపథ్యంలో ప్రముఖ రిసెర్చ్ సంస్థ కౌంటర్‌పాయింట్ ఆసక్తికర వివరాలను రివీల్ చేసింది.
జియోకి రాందేవ్ బాబా షాక్,మార్కెట్లోకి పతంజలి సిమ్కార్డ్స్,రూ.144కే అన్లిమిటెడ్

2018కుగాను..
ఈ సంస్థ విడుదల చేసిన రిపోర్ట్ ప్రకారం 2018కుగాను మొత్తం 30 కోట్ల నాట్చ్ డిస్‌ప్లే ఫోన్‌లు మార్కెట్లో రిలీజ్ కానున్నాయట. వీటిలో 55 శాతం ఫోన్‌లు ఆండ్రాయిడ్ ఆపరేటింగ్ సిస్టం పైనా, మిగిలిన 45 శాతం ఫోన్ లు యాపిల్ ఐఓఎస్ ఆపరేటింగ్ సిస్టం పై రన్ అవుతాయట.

iPhone X పోలీకలతో ఇండియన్ మార్కెట్లో..
నేటి ప్రత్యేక కథనంలో భాగంగా అచ్చం iPhone X పోలీకలతో ఇండియన్ మార్కెట్లో లభ్యమవుతోన్న 6 ఆండ్రాయిడ్ స్మార్ట్‌ఫోన్‌ల వివరాలను మీతో షేర్ చేసుకుంటున్నాం..

వన్‌ప్లస్ 6 (OnePlus 6)
కొద్ది రోజుల క్రితమే ఇండియన్ మార్కెట్లోకి అడుగుపెట్టిన ఈ డివైస్ మొదటి లుక్‌లోనే ఐఫోన్ ఎక్స్‌ను తలపిస్తుంది.
ఫోన్ స్పెసిఫికేషన్స్ పరిశీలించినట్లయితే.. 6.28 అంగుళాల ఫుల్ హైడెఫినిషన్ ప్లస్ ఆప్టిక్ అమోల్డ్ డిస్‌ప్లే (రిసల్యూషన్ కెపాసిటీ 1080x2280 పిక్సల్స్) విత్ 19:9 యాస్పెక్ట్ రేషియో, లేటెస్ట్ వర్షన్ ఆండ్రాయిడ్ ఆపరేటింగ్ సిస్టం, క్వాల్కమ్ స్నాప్‌డ్రాగన్ 845 ప్రాసెసర్, అడ్రినో 630 గ్రాఫిక్ ప్రాసెసింగ్ యూనిట్, ర్యామ్ వేరియంట్స్ (6జీబి, 8జీబి), స్టోరేజ్ వేరియంట్స్ (64జీబి, 128జీబి), 16 మెగా పిక్సల్ + 20 మెగా పిక్సల్ డ్యుయల్ రేర్ ఫేసింగ్ కెమెరా, 16 మెగా పిక్సల్ ఫ్రంట్ ఫేసింగ్ కెమెరా. అమెజాన్ ఇండియా ఈ ఫోన్‌లను ఎక్స్‌క్లూజివ్‌గా విక్రయిస్తోంది. 6జీబి ర్యామ్ + 64జీబి స్టోరేజ్ వర్షన్ ధర రూ.34,999. 8జీబి ర్యామ్ + 128జీబి స్టోరేజ్ వర్షన్ ధర రూ.39,999.

ఒప్పో ఎఫ్7 (Oppo F7)
ఒప్పో బ్రాండ్ నుంచి ఈ మధ్య మార్కెట్లో లాంచ్ అయిన ఒప్పో ఎఫ్7, ఐఫోన్ ఎక్స్ తరహాలోనే నాట్జ్ డిస్‌ప్లేతో కనువిందు చేస్తోంది.
స్పెసిఫికేషన్స్ పరిశీలించినట్లయితే.. 6.23 అంగుళాల ఫుల్ హై-డెఫినిషన్ డిస్‌ప్లే (రిసల్యూషన్ కెపాసిటీ 1080x2280 పిక్సల్స్) విత్ 19:9 యాస్పెక్ట్ రేషియో, లేటెస్ట్ వర్షన్ ఆండ్రాయిడ్ ఆపరేటింగ్ సిస్టం, 64 బిట్ ఆక్టా కోర్ మీడియాటెక్ హీలియో పీ60 ప్రాసెసర్, ర్యామ్ వేరియంట్స్ (4జీబి, 6జీబి), స్టోరేజ్ వేరియంట్స్ (64జీబి, 128జీబి), 25 మెగా పిక్సల్ ఫ్రంట్ ఫేసింగ్ కెమెరా, 16 మెగా పిక్సల్ రేర్ ఫేసింగ్ కెమెరా. మార్కెట్లో ఈ ఫోన్ ధర రూ.21,990.

హువావే పీ20 ప్రో (Huawei P20 Pro)
మూడు వెనుక కెమెరాలతో లాంచ్ అయిన మొట్టమొదటి స్మార్ట్‌ఫోన్‌గా హువావే పీ20 ప్రో గుర్తింపు తెచ్చుకుంది. నాట్చ్ డిస్‌ప్లే ఈ డివైస్‌కు మరో ప్రధానమైన హైలైట్‌గా నిలుస్తుంది. ఫోన్ ఇతర ఫీచర్లను పరిశీలించినట్లయితే 6.1 అంగుళాల ఫుల్ హైడెఫినిషన్ ప్లస్ ఓఎల్ఈడి డిస్‌ప్లే, ఆక్టా కోర్ కైరిన్ 970 ప్రాసెసర్, 6జీబి ర్యామ్, 128జీబి ఇంటర్నల్ స్టోరేజ్, 20 మెగా పిక్సల్ + 40 మెగా పిక్సల్స్ + 8 మెగా పిక్సల్ ట్రిపుల్ ఫేసింగ్ రేర్ ఫేసింగ్ కెమెరా, 4000 ఎమ్ఏహెచ్ బ్యాటరీ. ధర రూ.64,999.

వివో వీ9 (Vivo V9)
వివో బ్రాండ్ నుంచి ఈ మధ్య మార్కెట్లో లాంచ్ అయిన వివో వీ9 ఫోన్ ఐఫోన్ ఎక్స్ తరహాలోనే నాట్జ్ డిస్‌ప్లేతో ఆకట్టుకుంటోంది. ఫోన్ స్పెసిఫికేషన్స్ పరిశీలించినట్లయితే 6.3 అంగుళాల ఐపీఎస్ ఎల్‌సీడీ ఫుల్ వ్యూ డిస్‌ప్లే (రిసల్యూషన్ కెపాసిటీ 1080x2280 పిక్సల్స్) విత్ 19:9 యాస్పెక్ట్ రేషియో, లేటెస్ట్ వర్షన్ ఆండ్రాయిడ్ ఆపరేటింగ్ సిస్టం, క్వాల్కమ్ స్నాప్‌డ్రాగన్ 626 ప్రాసెసర్, 4జీబి ర్యామ్, 64జీబి ఇంటర్నల్ స్టోరేజ్, 16 మెగా పిక్సల్ + 5 మెగా పిక్సల్ డ్యుయల్ రేర్ ఫేసింగ్ కెమెరా, 24 మెగా పిక్సల్ ఫ్రంట్ ఫేసింగ్ కెమెరా. ధర రూ.22,990.

హానర్ 10 (Honor 10)
5.84 అంగుళాల ఫుల్ హైడెఫినిషన్ ప్లస్ డిస్‌ప్లే విత్ 19:9 యాస్పెక్ట్ రేషియో, ఆండ్రాయిడ్ 8.1 ఓరియో ఆపరేటింగ్ సిస్టం, కైరిన్ 970 ఆక్టా కోర్ ప్రాసెసర్, 6జీబి ర్యామ్, 128జీబి ఇంటర్నల్ స్టోరేజ్, 3400 ఎమ్ఏహెచ్ బ్యాటరీ విత్ ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్.

హువావే పీ20 లైట్ (Huawei P20 Lite)
5.8 అంగుళాల టీఎఫ్టీ ఎల్‌సీడీ ఫుల్ హైడెఫినిషన్ ప్లస్ డిస్‌ప్లే, ఆక్టా కోర్ కైరిన్ 659 ప్రాసెసర్, 4జీబి ర్యామ్, 64జీబి ఇంటర్నల్ స్టోరేజ్, 16 మెగా పిక్సల్ + 2 మెగా పిక్సల్ డ్యుయల్ రేర్ ఫేసింగ్ కెమెరా, 16 మెగా పిక్సల్ ఫ్రంట్ ఫేసింగ్ కెమెరా, 3000 ఎమ్ఏహెచ్ బ్యాటరీ. ధర రూ. 19,999.
-
92,999
-
17,999
-
39,999
-
29,400
-
38,990
-
29,999
-
16,999
-
23,999
-
18,170
-
21,900
-
14,999
-
17,999
-
42,099
-
16,999
-
23,999
-
29,495
-
18,580
-
64,900
-
34,980
-
45,900
-
17,999
-
54,153
-
7,000
-
13,999
-
38,999
-
29,999
-
20,599
-
43,250
-
32,440
-
16,190