స్మార్ట్ ఫోన్‌తో సమానం: శ్యామ్‌సంగ్ SPH-D600 ఫీచర్స్

Posted By: Super

స్మార్ట్ ఫోన్‌తో సమానం: శ్యామ్‌సంగ్ SPH-D600 ఫీచర్స్

ప్రస్తుతం ఆండ్రాయిడ్ ఆపరేటింగ్ సిస్టమ్ మొబైల్ ఫోన్ మార్కెట్‌లో నెంబర్ వన్ ఎవరు అంటే ఠక్కున చెప్పే సమాధానం శ్యామ్‌సంగ్. దీనికి కారణం ప్రపంచ వ్యాప్తంగా శ్యామ్‌సంగ్ మొబైల్స్ పోన్స్‌ని గనుక చూసినట్లైతే సింపుల్ మల్టీమీడియా కానీ, హైయర్ ఎండ్ ఫోన్స్ కానివ్వండీ మొత్తం మీద 20 వరకు ఆండ్రాయిడ్ మొబైల్ ఫోన్స్ మోడళ్లను మార్కెట్‌లోకి విడుదల చేసింది శ్యామ్‌సంగ్. కంపెనీ యొక్క ముఖ్య ఉద్దేశ్యం ఏమిటంటే రాబోయే సంవత్సరాలలో ఆండ్రాయిడ్ మొబైల్ మార్కెట్‌లో ప్రపంచం మొత్తం మీద నెంబర్ వన్ కాలనేది శ్యామ్‌సంగ్ ఉద్దేశ్యం.

శ్యామ్‌సంగ్‌ హ్యాండ్ సెట్స్‌కి ఇండియాలో ఉన్న గిరాకీ అంతా ఇంతా కాదు. శ్యామ్‌సంగ్ కంపెనీ కూడా ఇండియాలో ఆండ్రాయిడ్ ఆపరేటింగ్ సిస్టమ్ మొబైల్ ఫోన్స్‌కి సంబంధించిన ఆపరేషన్స్‌ని విస్తరించే ఆలోచనలో ఉంది. ఇందులో భాగంగానే ఇండియన్ మొబైల్ మార్కెట్లోకి శ్యామ్‌సంగ్ కొత్తగా ఆండ్రాయిడ్ ఆపరేటింగ్ సిస్టమ్ కలిగిన హ్యాండ్‌సెట్ విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తుంది. దాని పేరు శ్యామ్‌సంగ్ SPH-D600. శ్యామ్‌సంగ్ SPH-D600 ఫీచర్స్‌ గురించి తెలుసుకుందాం..

శ్యామ్‌సంగ్ SPH-D600 TFT కెపాసిటివ్ టచ్ స్క్రీన్ కలిగిఉండి, HVGA డిస్ప్లే సామర్ద్యంతో చూడడానికి చక్కని విజువల్ రిజల్యూషన్ ఉంటుంది. శ్యామ్‌సంగ్ SPH-D600 ఫోన్ ఆండ్రాయిడ్ 2.3 Gingerbread ఆపరేటింగ్ సిస్టమ్‌తో రన్ అవుతూ, ఇందులో ఉండేటటువంటి మెను బటన్స్ యూజర్స్‌కి చాలా అనుకూలంగా ఉంటాయి. ముఖ్యంగా ఈఫోన్ మల్టీమీడియా ఫీచర్స్‌ని సపోర్టు చేస్తూ, ప్రయివేటుగా ఎప్పుడైనా ఎంటర్టైన్మెంట్ కావాలంటే 3.5mm ఆడియో జాక్ స్పీకర్స్‌కి కనెక్టు చేసుకోని ఎంజాయ్ చేయవచ్చు.

అంతేకాకుండా శ్యామ్‌సంగ్ SPH-D600 రెండు కెమెరాలు ఉంటాయి. ఒకటి ముందు మరోకటి వెనుక భాగాన. రెండు వైపులా ఉన్నటువంటి కెమెరాలు వీడియో కాలింగ్, రికార్డింగ్‌కి సపోర్టు చేస్తాయి. ఇక ముందు భాగాన ఉన్నటువంటి కెమెరాతో తీసినటువంటి ఫోటోలు చూడడానికి చాలా అందంగా కనిపిస్తాయి. అందుకు కారణం ఇందులో ఫ్లాష్ కూడా ఉండడమే. ఇక ఇందులో ఉండే ప్రాసెసర్ విషయానికి వస్తే హైస్పీడ్‌తో ఇది రన్ అవుతుంది. మైక్రో ఎస్‌డి ఎక్సాన్షన్ కార్డు ద్వారా మొమొరిని విస్తరించుకునే సదుపాయం కూడా ఉంది.

ఇటీవలే కొత్తగా వచ్చినటువంటి టెక్నాలజీ కమ్యూనికేషన్ 3జి, బ్లూటూత్, వై-పై లాంటి వాటిని కూడా ఇది సపోర్టు శ్యామ్‌సంగ్ SPH-D600 చేస్తుంది. ఒక్క మాటలో చెప్పాలంటే శ్యామ్‌సంగ్ SPH-D600 స్మార్ట్‌ఫోన్‌కి సమానం.

Samsung SPH-D600 Specifications:

Android 2.3 Gingerbread OS
Full touch screen display
Wi-Fi: 802.11 b/g/n
Audio and Video player
3G and 4G connectivity
Bluetooth 3.0 with EDR
3.2 Mega Pixel rear Camera with LED flash

శ్యామ్‌సంగ్ SPH-D600కి సంబంధించిన ఖరీదు ఇంకా నిర్ణయించలేదు. ఖరీదు గనుక కొంచెం తక్కువగా ఉన్నట్లైతే ఇండియాలో కూడా ఇది తన హాల్‌చల్‌ని సృష్టిస్తుందని అనడంలో ఎటువంటి సందేహాం లేదు.

Opinion Poll

Social Counting

ఇన్స్టెంట్ న్యూస్ అప్డేట్స్ రోజుంతా పొందండి - Telugu Gizbot