జియో 4జీ ఫోన్ గురంచి మరో ఫోటో లీక్ అయ్యింది

జియో 4జీ ఫీచర్ ఫోన్ గురించి మరో ఆసక్తికర సమాచరం వెబ్ మీడియాలో చక్కర్లు కొడుతోంది. ఈ ఫోన్‌కు సంబంధించిన లేటెస్ట్ ఫోటోను టెక్‌‌అప్‌డేట్3 అనే వెబ్‌సైట్ లీక్ చేసింది. లేటెస్ట్ ఇమేజ్‌లో కనిపిస్తోన్న జియో 4జీ ఫోన్ లైఫ్ బ్రాండింగ్‌తో కనిపిస్తోంది.

గిజ్‌బాట్ మరిన్ని అప్‌డేట్స్ ఇక్కడే

ఫోన్ ముందు భాగంలో

ఈ మొబైల్ ఫోన్ ముందు భాగంలో కీప్యాడ్‌తో పాటు టార్చ్ లైట్ హోమ్ బటన్, కాల్ బటన్, డిస్కనెక్ట్ బటన్, మెను బటన్ ఇంకా బ్యాక్ బటన్‌లు ఉన్నాయి.

రెండు వేరియంట్‌లలో..

ఈ లేటెస్ట్ ఫోన్ గతంలో లీకైన ఫోన్ కంటే భిన్నంగా ఉండటంతో జియో 4జీ ఫీచర్ ఫోన్ రెండు వేరియంట్‌లలో లభ్యమయ్యే అవకాశముందని తెలుస్తోంది. ఇందులో మొదటి వేరియంట్ వచ్చేసరికి Spreadtrum Chipతోనూ రెండవ వేరియంట్ వచ్చేసరికి Qualcomm 205 Mobile Platformతోనూ వచ్చే అవకాశముందని తెలుస్తోంది.

జియో 4జీ ఫీచర్ ఫోన్ స్పెసిఫికేషన్స్ ఈ విధంగా ఉండొచ్చు..?

2.4 అంగుల డిస్‌ప్లే, 2 మెగా పిక్సల్ రేర్ ఫేసింగ్ కెమెరా, 2 మెగా పిక్సల్ ఫ్రంట్ ఫేసింగ్ కెమెరా, 4జీ సిమ్ కనెక్టువిటీ, వై-ఫై, బ్లుటూత్, 512ఎంబి ర్యామ్, 4జీబి ఇంటర్నల్ స్టోరేజ్, మైక్రోఎస్డీ స్లాట్.

ధరలు ఎంతుండొచ్చు..?

మార్కెట్లో Spreadtrum వేరియంట్‌తో వచ్చే జియో 4జీ ఫోన్ ధర రూ.1700లు ఉండొచ్చని తెలుస్తోంది. Qualcomm 205 variant వేరియంట్‌తో వచ్చే జియో 4జీ ఫోన్ ధర రూ.1800లు ఉండొచ్చని తెలుస్తోంది.

Wi-Fi tethering support

రూ.1800 రేంజ్‌‌లో అందుబాటులో ఉండే జియో 4జీ ఫీచర్ ఫోన్‌లో VoLTE సపోర్ట్ తో పాటు వై-ఫై, NFC వంటి కనెక్టువిటీ ఆప్షన్స్ ఉండబోతున్నాయి. ఈ ఆధునిక వర్షన్ ఫీచర్ ఫోన్‌లో Wi-Fi tethering supportను పొందుపరిచే అవకాశముందని తెలుస్తోంది. ఇన్ని ఫీచర్లతో వస్తోన్న ఈ ఫోన్‌ను స్మార్ట్‌ఫోన్ యూజర్లు సెకండరీ ఫోన్ క్రింద ఉపయోగించుకోవచ్చు.

మొదటి ఇమేజ్ కొద్ది నెలల క్రితమే..

రిలయన్స్ జియో ఫీచర్ ఫోన్‌లకు సంబంధించిన మొదటి ఇమేజ్ కొద్ది నెలల క్రితం ఇంటర్నెట్‌లో రివీల్ అయ్యింది. టీ9 కీబోర్డ్‌తో వస్తోన్న ఈ ఫీచర్ ఫో‌న్‌లో D-Pad మరో ఆకర్షణగా నిలిచింది. కీబోర్డ్ పై భాగంలో ఏర్పాటు చేసిన ఈ డీ-ప్యాడ్‌లో మై జియో, జియో లైవ్ టీవీ, జియో వీడియో, జియో మ్యూజిక్ యాప్స్ వంటి షార్ట్‌కట్ బటన్‌లను జియో ఏర్పాటు చేసినట్లు లీకైన ఫోటో ద్వారా తెలుస్తోంది. టార్చ్ లైట్ నిమిత్తం ప్రత్యేకమైన బటన్‌ను కూడా జియో ఈ ఫోన్‌లో నిక్షిప్తం చేసినట్లు తెలుస్తోంది.

గిజ్‌బాట్ మరిన్ని అప్‌డేట్స్ ఇక్కడే

English summary
Another Image of Reliance Jio 4G Feature Phone Surfaced Online. Read More in Telugu Gizbot...
Opinion Poll

Social Counting

ఇన్స్టెంట్ న్యూస్ అప్డేట్స్ రోజుంతా పొందండి - Telugu Gizbot