ఎల్‌జీ కొత్త విండోస్ ఫోన్ ఫాంటసీ

Posted By: Super

ఎల్‌జీ కొత్త విండోస్ ఫోన్ ఫాంటసీ

ప్రస్తుతం మార్కెట్లోకి ఆండ్రాయిడ్ ఆపరేటింగ్ సిస్టమ్‌తో విడుదలయ్యే మొబైల్సే అధికం. అంతేకాకుండా ఆండ్రాయిడ్ ఆపరేటింగ్ సిస్టమ్ స్మార్ట్ పోన్స్‌కి మార్కెట్లో చాలా పోటీ వాతావరణం కూడా నెలకోని ఉంది. ఇలాంటి సందర్బాలలో ఆండ్రాయిడ్ ఆపరేటింగ్ సిస్టమ్ మొబైల్స్‌కి పోటీగా వేరే కంపెనీలు అయినటువంటి మైక్రోసాప్ట్, ఆపిల్ వాటి ఆపరేటింగ్ సిస్టమ్‌లను విడుదల చేస్తున్నాయి.

ఆసియా, లండన్‌లలో విండోస్ ఫోన్ 7 మ్యాంగో ఆపరేటింగ్ సిస్టమ్‌ మొబైల్స్‌కు మంచి డిమాండ్ ఉంది. దానికి కారణం విండోస్ ఆపరేటింగ్ సిస్టమ్‌కున్న ప్రత్యేకత వేరు. దీనిలో భాగంగానే ప్రముఖ కంపెనీలు అయిన నోకియా, శ్యామ్‌సంగ్, ఎల్‌జీ ప్రయత్నాలను ముమ్మరం చేశాయి. ఎల్‌జీ కంపెనీ నుండి విడుదలైన విండోస్ పోన్ 7 మ్యాంగ్ ఆపరేటింగ్ సిస్టమ్ కలిగిన మొబైల్ ఫోన్ ఎల్‌జీ ఈ906 మార్కెట్లో హాల్ చల్ చేస్తున్న విషయం తెలిసిందే. ఇంకొక రూమర్ ఏంటంటే మరో విండోస్ మ్యాంగ్ ఆపరేటింగ్ సిస్టమ్‌తో రన్ అయ్యేటటువంటి మొబైల్ ఫోన్‌ని త్వరలో మార్కెట్లోకి విడుదల చేయడానికి ‌ఎల్‌జీ కంపెనీ సన్నాహాలు చేస్తున్నట్లు సమాచారం.

రూమర్స్ ప్రకారం ఆ మొబైల్ పోన్ పేరు ఎల్‌జీ ఫాంటసీ. ఎల్‌జీ ఫాంటసీ డిస్ ప్లే 4.5 ఇంచ్‌లుగా ఉండి యూజర్స్‌కి చక్కని విజువల్ ఎక్స్ పీరియన్స్‌ని కలగ జేస్తుందని భావిస్తున్నారు. ఈ మొబైల్ ఫోన్ రాకతో ఆండ్రాయిడ్, ఐవోస్ ఆపరేటింగ్ సిస్టమ్ మొబైల్ ఫోన్స్‌కి ఇదోక ఛాలెంజింగ్‌గా నిలస్తుందని అంటున్నారు. ఎల్‌జీ ఫాంటసీ ప్రస్తుతం మార్కెట్లో ఉన్న అన్ని రకాల మల్టీమీడియా ఫీచర్స్‌ని సపోర్ట్ చేస్తుంది. ఇక కెమెరా విషయానికి వస్తే 8 మెగా ఫిక్సల్ అంతకంటే ఎక్కువ కెమెరాని కలిగి ఉంటుందని తెలియజేశారు.

కనెక్టివిటీ ఆఫ్షన్స్ విషయంలో కొత్త వర్సన్స్ అయిన బ్లూటూత్ 3.0ని సపోర్ట్ చేస్తుందని అన్నారు. ఇది మాత్రమే కాకుండా 4జీ నెట్ వర్క్స్‌తో పాటుగా, హై స్పీడ్ 3జీ నెట్ వర్క్స్‌ని కూడా సపోర్ట్ చేస్తుంది. ఎల్‌జీ ఫాంటసీకి సంబంధించిన లేటెస్ట్ ఫీచర్స్ విడుదల తేదీ, ఖరీదు ఎంత ఉంటుందనే విషయాలపై కస్టమర్స్ ఇప్పడి నుండే ఆరా తీయడం మొదలు పెట్టారు.

Opinion Poll

Social Counting

ఇన్స్టెంట్ న్యూస్ అప్డేట్స్ రోజుంతా పొందండి - Telugu Gizbot