మరో రెడ్‌మి బాంబ్ : చిత్తూరులో పేలిన రెడ్‌మి నోట్ 4..

Written By:

చైనా మొబైల్ దిగ్గజం షియోమీకి చెందిన రెడ్‌మీ నోట్ 4 స్మార్ట్‌ఫోన్లు వరుసపెట్టి పేలుతున్నాయి. గత నెలలో తూర్పు గోదావరి జిల్లా రావులపాలెంలో ఓ యువకుడి ప్యాంటు జేబులో ఉన్న ఫోన్ అకస్మాత్తుగా మంటలంటుకుని పేలిపోవడంతో యువకుడికి తీవ్ర గాయాలయ్యాయి.

కొన్న 20 రోజులకే.. జేబులోనే కాలిపోయిన రెడ్‌మి నోట్ 4, గాయాలతో..

మరో రెడ్‌మి బాంబ్ : చిత్తూరులో పేలిన రెడ్‌మి నోట్ 4..

మొన్న విశాఖపట్టణం జిల్లాలో చార్జింగ్ పెట్టిన కాసేపటికే ఫోన్ పేలింది. తాజాగా చిత్తూరు జిల్లా గంగాధర నెల్లూరు మండలం వేల్కూరులో మరో ఫోన్ పేలిందని వార్తలు వస్తున్నాయి. గ్రామానికి చెందిన కె.అజిత్ గురువారం రాత్రి ఇంట్లో ఫోన్‌కు చార్జింగ్ పెడుతుండగా పేలిపోయిందని తెలుస్తోంది.

ఎక్స్‌టర్నల్ ఫోర్స్ వల్లే రెడ్‌మి నోట్ 4 పేలిపోయింది

మరో రెడ్‌మి బాంబ్ : చిత్తూరులో పేలిన రెడ్‌మి నోట్ 4..

రెడ్‌మీ నోట్ 4 ఫోన్లు వరుస పెట్టి పేలిపోతుండడంపై వినియోగదారుల్లో భయం పట్టుకుంది. కాగా, రావులపాలెం ఘటనపై స్పందించిన షియోమీ యాజమాన్యం.. ఫోన్‌లో ఎటువంటి సమస్యా లేదని, అధిక ఒత్తిడే ఫోన్ పేలుడుకు కారణమని పేర్కొంది.

English summary
Another Redmi note 4 blast in chittoor in Andhra pradesh more News At Gizbot telugu
Opinion Poll

Social Counting

ఇన్స్టెంట్ న్యూస్ అప్డేట్స్ రోజుంతా పొందండి - Telugu Gizbot