మోటరోలా నుంచి మరో ఆణిముత్యం!!!

By Prashanth
|
Motorola Motoluxe


ఉత్తమ మొబైల్ ఫోన్‌లను ప్రవేశపెట్టే మోటరోలా (Motorola) మరో ఆణిముత్యాన్ని భారతీయ మార్కెట్‌కు పరిచయం చేయునుంది. ఈ బ్రాండ్ నుంచి మోటో లక్సి (Motoluxe)గా వస్తున్న స్మార్ట్ ఫోన్ ఫీచర్లు ఇప్పుడు చూద్దాం...

ఫోన్ ముఖ్య ఫీచర్లు:

* 4 అంగుళాల పరిమాణం గల టచ్ స్ర్కీన్ డిస్‌ప్లే, * ఆండ్రాయిడ్ లేటెస్ట్ వర్షన్ v2.3.7 జింజర్ బ్రెడ్ ఆపరేటింగ్ సిస్టం, * 800 MHz సామర్ధ్యం గల పటిష్ట సెంట్రల్ ప్రాసెసింగ్ వ్యవస్థ (సీపయూ), * 512 ఎంబీ ర్యామ్, * 1జీబి రోమ్, * 2జీ, 3జీ సపోర్ట్, * నాణ్యమైన 8 మెగా పిక్సల్ కెమెరా, * మీడియా ప్లేయర్, * ఇన్‌బుల్ట్ ఎఫ్ఎమ్ రేడియో, * క్లాస్ 12 సామర్ధ్యం గల జీపీఆర్ఎస్, ఎడ్జ్ ఇంటర్నెట్ వ్యవస్థలు, * బ్యాటరీ స్టాండ్ బై సామర్ధ్యం 450 గంటలు, * బ్లూటూత్, * V2.0 మైక్రో యూఎస్బీ.

పనితీరు:

‘మోటరోలా మోటోలక్స్’ను ఆకర్షణీయమైన శ్రేణిలో డిజైన్ చేశారు. నిక్షిప్తం చేసిన అత్యుత్తమ ఫీచర్లు వినియోగదారుడిని ఎంతగానో ఆకట్టకుంటాయి. మన్నికైన ఈ మొబైల్ స్ర్కీన్, పెద్ద తెర పై వీక్షించిన అనుభూతిని చేరువచేస్తుంది. ఈ డివైజ్ టచ్ ఫెసిలిటీ మరింత సౌక్యవంతంగా ఉంటుంది. లోడ్ చేసిన ఆండ్రాయిడ్ లేటెస్ట్ వర్షన్ ఆండ్రాయిడ్ జింజర్ బ్రెడ్ ఆపరేటింగ్ సిస్టం మన్నికైన పనితీరును ప్రదర్శిస్తుంది. పొందుపరిచిన 800 MHz సీపీయూ వేగవంతమైన ప్రాసెసింగ్‌కు దోహదపడుతుంది. ఈ స్మార్ట్‌ఫోన్ ధర ఇతర వివరాలు త్వరలోనే వెల్లడవుతాయి.

Best Mobiles in India

ఉత్తమ ఫోన్లు

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
X