ఇంటర్నెట్లో లీకైన నోకియా లుమియా 601 ఫీచర్స్

ఇటీవల కాలంలో నోకియా విండోస్ ఆపరేటింగ్ సిస్టమ్‌తో రన్ అయ్యేటటువంటి స్మార్ట్ ఫోన్స్ నోకియా లుమియా 701, నోకియా లుమియా 800, నోకియా లుమియా 900 మొబైల్స్‌కి సంబంధించిన సమాచారం ఇంటర్నెట్లో విడుదలై హాల్ చల్ చేస్తున్న విషయం తెలిసిందే. ఇప్పుడు అదే కొవలోకి మరో కొత్త మొబైల్ 'నోకియా లుమియా 601' చేరనుంది.
నోకియా లుమియా 601 స్మార్ట్ ఫోన్‌కి సంబంధించిన సమాచారం లండన్‌లో జరిగిన 'నోకియా వరల్డ్ షో'లో వివరించడం జరిగింది. నోకియా మాత్రం అధికారకంగా నోకియా లుమియా 601కి సంబంధించిన సమాచారం విడుదల చేయనప్పటికీ, ఇంటర్నెట్లో నోకియా లుమియా 601 మొబైల్ ఫీచర్స్‌తో పాటు, ప్రత్యేకతలు కూడా హాల్ చల్ చేస్తున్నాయి.
నోకియా లుమియా 601 స్మార్ట్ ఫోన్ ప్రత్యేకతలు విషయానికి వస్తే 8 మెగా ఫిక్సల్ కెమెరాతో పాటు సుపిరియర్ క్వాలిటీ ఇమేజిని అందివ్వనున్నట్లు వినికిడి. అంతేకాకుండా ఈ స్మార్ట్ ఫోన్ విండోస్ ఫోన్ మ్యాంగో ఆపరేటింగ్ సిస్టమ్‌తో రన్ అవుతుందని సమాచారం. RAM కెపాసిటీ 512 MB. మొబైల్ తో పాటు ఇంటర్నల్‌గా 8 జిబి మెమరీ లభిస్తుండగా, ఇందులో ఉన్న మైక్రో ఎస్‌డి స్లాట్ ద్వారా మెమరీని 32జిబి వరకు విస్తరించుకొవచ్చు. మొబైల్ ఫెర్పామెన్స్ ఫాస్టుగా ఉండేందుకు గాను ఇందులో 1GHz క్వాలికామ్ స్నాప్ డ్రాగెన్ ఛిప్ సెట్ ప్రాసెసర్‌ని నిక్షప్తం చేయడం జరిగింది.
మొబైల్ డిస్ ప్లే సైజు 3.7 ఇంచ్‌లు. కమ్యూనికేషన్, కనెక్టివిటీ ఫీచర్స్ అయిన బ్లూటూత్, వై -పై లను సపోర్ట్ చేస్తుంది. ఎంటర్టెన్మెంట్ విషయానికి వస్తే మార్కెట్లో లభించే అన్ని రకాల ఆడియో, వీడియో ఫార్మెట్లను సపొర్ట్ చేస్తుంది. మొబైల్‌ని బయట స్పీకర్స్‌కి కనెక్టు చేసుకునేందుకు గాను మొబైల్‌తో పాటు 3.5mm ఆడియో జాక్ ఉచితం. నోకియా లుమియా 601 మొబైల్ ధరకి సంబంధించిన అధికారిక ప్రకటన ఇంకా మార్కెట్లో వెలువడ లేదు.


Click it and Unblock the Notifications