మార్కెట్లోకి ఐఫోన్ 8, ఐఫోన్ 8 ప్లస్

కాలిఫోర్నియాలోని యాపిల్ న్యూస్పేస్ క్యాంపస్‌లో ఏర్పాటు చేసిన ప్రత్యేక ఈవెంట్‌లో భాగంగా Apple తన లేటేస్ట్ వర్షన్ ఐఫోన్ మోడల్స్ ఐఫోన్ 8, ఐఫోన్ 8 ప్లస్‌లను అనౌన్స్ చేసింది. వీటితో పాటు iPhone X పేరుతో కొత్త ఫ్లాగ్‌షిప్ స్మార్ట్‌ఫోన్‌ను కూడా యాపిల్ ప్రకటించింది. మెటల్ ఇంకా గ్లాస్ బాడీ కాంభినేషన్‌లో డిజైన్ కాబడిన ఈ ఫోన్‌లు రెండు స్టోరేజ్ వేరియంట్‌లలో మాత్రమే అందుబాటులో ఉంటాయి. మొదటిది 64జీబి వేరియంట్ కాగా, రెండవది 256జీబి స్టోరేజ్ వేరయింట్.

Read More : మీ ఫోన్‌లో Airtel VoLTE పొందటం ఎలా..?

గిజ్‌బాట్ మరిన్ని అప్‌డేట్స్ ఇక్కడే

సెప్టంబర్ 15 నుంచి ప్రీ-ఆర్డర్స్

ఈ ఫోన్‌లకు సంబంధించిన ప్రీ-ఆర్డర్స్ సెప్టంబర్ 15 నుంచి ప్రారంభమవుతాయి. డెలివరీ ప్రాసెస్ సెప్టంబర్ 22 నుంచి ప్రారంభమవుతుంది. తొలత యూఎస్, యూకే, చైనా, ఆస్ట్రేలియా సహా 25 దేశాల్లో ఈ ఫోన్‌లు లభ్యమవుతాయి. iPhone Xకు సంబంధించిన ప్రీ-ఆర్డర్స్ ఓ నెల తరువాత ప్రారంభమవుతాయి.

ఇండియా లాంచ్ ఎప్పుడంటే..?

ఇండియన్ మార్కెట్లో ఐఫోన్ 8 64జీబి వేరియంట్ ధర రూ.64,000గా ఉంటుంది. 256జీబి వేరియంట్ దర రూ.77,000గా ఉంటుంది. ఐఫోన్ 8 ప్లస్ 64జీబి వేరియంట్ దర రూ.73,000గానూ, 256జీబి స్టోరేజ్ వేరియంట్ ధర రూ.86,000గాను ఉంటుంది. సెప్టంబర్ 29 నుంచి ఇవి మార్కెట్లో ఇవి ఇండియన్ మార్కెట్లో అందుబాటులో ఉంటాయి. యూఎస్ మార్కెట్లో ఐఫోన్ 8 ధరలను పరిశీలించినట్లయితే ఐఫోన్ 8 64జీబి వేరియంట్ ధర 699 డాలర్లు, 256జీబి వేరియంట్ ధర 849 డాలర్లు. ఐఫోన్ 8 ప్లస్ 64జీబి వేరియంట్ ధర 799 డాలర్లు, 256జీబి స్టోరేజ్ వేరియంట్ ధర 849 డాలర్లు.

ఐఫోన్ 8 స్సెసిఫికేషన్స్

గ్లాస్ ఇంకా అల్యుమినియమ్ డిజైన్, 4.7 అంగుళాల రెటీనా హైడెఫినిషన్ డిస్ ప్లే వితో ట్రో టోన్, iOS 11 ఆపరేటింగ్ సిస్టం, యాపిల్ ఏ11 బయోనిక్ చిప్‌సెట్, స్టోరేజ్ వేరియంట్స్ (64జీబి, 256జీబి), 12 మెగా పిక్సల్ రేర్ ఫేసింగ్ కెమెరా, క్వాడ్-ఎల్ఈడి ట్రు టోన్ ఫ్లాష్, టచ్ ఐడీ, ఎల్టీఈ అడ్వాన్సుడ్, బ్లుటూత్ 5.0, స్టీరియో స్పీకర్స్, వాటర్ అండ్ డస్ట్ రెసిస్టెంట్, వైర్‌లెస్ ఛార్జింగ్ సపోర్ట్,

ఐఫోన్ 8 ప్లస్ స్పెసిఫికేషన్స్..

గ్లాస్ ఇంకా అల్యుమినియమ్ డిజైన్, 5.5 అంగుళాల రెటీనా హైడెఫినిషన్ డిస్ ప్లే వితో ట్రో టోన్, iOS 11 ఆపరేటింగ్ సిస్టం, యాపిల్ ఏ11 బయోనిక్ చిప్‌సెట్, స్టోరేజ్ వేరియంట్స్ (64జీబి, 256జీబి), 12 మెగా పిక్సల్ డ్యుయల్  రేర్ ఫేసింగ్ కెమెరా, క్వాడ్-ఎల్ఈడి ట్రు టోన్ ఫ్లాష్, టచ్ ఐడీ, ఎల్టీఈ అడ్వాన్సుడ్, బ్లుటూత్ 5.0, స్టీరియో స్పీకర్స్, వాటర్ అండ్ డస్ట్ రెసిస్టెంట్, వైర్‌లెస్ ఛార్జింగ్,

గిజ్‌బాట్ మరిన్ని అప్‌డేట్స్ ఇక్కడే

English summary
Apple announces iPhone 8, iPhone 8 Plus. Read More in Telugu Gizbot..
Opinion Poll

Social Counting

ఇన్స్టెంట్ న్యూస్ అప్డేట్స్ రోజుంతా పొందండి - Telugu Gizbot