యూజర్లకి షాకిచ్చిన ఆపిల్, ఆ ఫోన్ ఉత్పత్తిని ఆపేస్తోంది !
అమెరికా టెక్ దిగ్గజం ఆపిల్ అభిమానులకి, యూజర్లకి షాక్ లాంటి న్యూస్ చెప్పబోతోంది. ఈ మేరకు కొన్ని వార్తలు సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్నాయి.
అమెరికా టెక్ దిగ్గజం ఆపిల్ అభిమానులకి, యూజర్లకి షాక్ లాంటి న్యూస్ చెప్పబోతోంది. ఈ మేరకు కొన్ని వార్తలు సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్నాయి. ఆపిల్ కంపెనీ 2 నెలల కిందట తన నూతన ఐఫోన్లు ఐఫోన్ Xఎస్, Xఎస్ మ్యాక్స్, Xఆర్ లను విడుదల చేసిన విషయం అందరికీ తెలిసిందే. విడుదల తర్వాత ముందుగా ఐఫోన్ Xఎస్, Xఎస్ మ్యాక్స్ లు మార్కెట్‌లో వినియోగదారులకు లభ్యం కాగా, తరువాత ఐఫోన్ Xఆర్ ఫోన్ కూడా అందుబాటులోకి వచ్చింది. ఇప్పుడు ఈ ఫోన్ల ఉత్పత్తిని ఆపేస్తున్నట్లుగా తెలుస్తోంది. మరిన్ని వివరాల్లోకెళితే..

ఐఫోన్ Xఎస్, Xఎస్ మ్యాక్స్ ఫోన్లకు...
కంపెనీ 2 నెలల కిందట లాంచ్ చేసిన ఐఫోన్ Xఎస్, Xఎస్ మ్యాక్స్ ఫోన్లకు ఉన్నంత ఆదరణ ఐఫోన్ Xఆర్ ఫోన్‌కు లేదని తెలిసింది. దీంతో ప్రస్తుతం ఆపిల్ ఈ ఫోన్ ఉత్పత్తిని నిలిపివేసినట్లు తెలిసింది.

ఆపిల్ ఐఫోన్ల అసెంబ్లర్స్ ఫాక్స్‌కాన్, పెగాట్రాన్‌లకు సమాచారం ఇచ్చింది...
ఈ మేరకు ఆపిల్ ఐఫోన్ల అసెంబ్లర్స్ ఫాక్స్‌కాన్, పెగాట్రాన్‌లకు సమాచారం ఇచ్చింది. ఐఫోన్ Xఆర్ ఫోన్‌కు అనుకున్నంత డిమాండ్ లేనందున ఆ ఫోన్ ఉత్పత్తిని తాత్కాలికంగా నిలిపివేశామని మరోవైపు ఫాక్స్‌కాన్, పెగాట్రాన్ సంస్థలు కూడా వెల్లడిస్తున్నాయి.

ఐఫోన్ 8, 8 ప్లస్ ఫోన్లకు...
అయితే గత ఏడాది విడుదలైన ఐఫోన్ 8, 8 ప్లస్ ఫోన్లకు అనూహ్యంగా డిమాండ్ పెరిగిందని, అందుకే వాటి ఉత్పత్తికి తమకు ఎక్కువ ఆర్డర్లు వస్తున్నాయని ఆ రెండు సంస్థలు వెల్లడిస్తున్నాయి

నూతన ఐఫోన్ల అమ్మకాలు మరింత పెరిగే అవకాశం ఉందని కూడా ఆపిల్ భావిస్తున్నది....
రానున్న క్రిస్మస్ సీజన్‌లో నూతన ఐఫోన్ల అమ్మకాలు మరింత పెరిగే అవకాశం ఉందని కూడా ఆపిల్ భావిస్తున్నది. అందుకే ఐఫోన్ Xఆర్ తప్ప మిగిలిన రెండు నూతన ఐఫోన్లను పెద్ద ఎత్తున ఉత్పత్తి చేస్తున్నట్లు తెలిసింది.

ఐఫోన్ Xఎస్ లో...
ఐఫోన్ Xఎస్ లో 2658 ఎంఏహెచ్ బ్యాటరీ, 4 జీబీ ర్యామ్ ఉండగా, ఐఫోన్ Xఎస్ మ్యాక్స్‌లో 3174 ఎంఏహెచ్ బ్యాటరీ, 4జీబీ ర్యామ్ ఉంది. ఇక ఐఫోన్ Xఆర్ ఫోన్‌లో 2942 ఎంఏహెచ్ బ్యాటరీ ఉండగా, 3 జీబీ ర్యామ్,మరింత ఎక్కువగా బ్యాటరీ బ్యాకప్ వంటి ఫీచర్లు ఉన్నాయి.

ఆపిల్ కంపెనీపై ఇలాంటి వార్తలు రావడం...
కాగా ఆపిల్ కంపెనీపై ఇలాంటి వార్తలు రావడం కొత్తేమి కాదని ఇంతకుముందు కూడా ఇలాంటివి అనేక వార్తలు చక్కర్లు కొట్టాయని తెలుస్తోంది. గతంలో ఆపిల్ ఐఫోన్ ఎస్ఈ అలాగే ఐఫోన్ ఎక్స్ మోడళ్ల ఉత్పత్తిని కూడా ఆపేస్తున్నట్లు సోషల్ మీడియాలో కథనాలు వచ్చాయి.

ఈ మూడు ఫోన్ల లాంచింగ్ ధరలు ఈ కింది విధంగా ఉన్నాయి....
iPhone XS
64GB @ 99,900, 256GB @ 1,14,900, 512GB @ 1,34,900
iPhone XS Max
64GB @ 1,09,900, 256GB @ 1,24,900, 512GB @ 1,44,900
iPhone XR
64GB @ 76,900, 128GB @ 81,900, 256GB @ 91,900


Click it and Unblock the Notifications