Home
Mobile

ఆపిల్‌ నుంచి కీలక అప్‌డేట్‌.. ఫిబ్రవరి 19వ తేదీన ఏం విడుదల కానుంది.. CEO ట్వీట్‌లో ఏముంది?

ఆపిల్ నుంచి బడ్జె్‌ట్‌ రేంజ్‌లో కొత్త హ్యాండ్‌సెట్‌ విడుదల కానుందని ఎప్పటి నుంచో వార్తలు వస్తున్నాయి. ఇప్పటికే ఈ హ్యాండ్‌సెట్‌ గురించి అనేక లీక్స్‌ వచ్చాయి. ఈ ఫోన్‌ ఐఫోన్‌ SE 4 పేరుతో (iPhone SE 4) లాంచ్ కానుందని తెలుస్తోంది. చివరిగా SE 3 మోడర్‌ 2022 లో లాంచ్ అయింది. అయితే కొత్త మోడల్‌ అనేక అప్‌గ్రేడ్‌ ఫీచర్‌లను కలిగి ఉంటుందని.. గత మోడల్‌తో పోలిస్తే భారీ డిస్‌ప్లే, శక్తివంతమైన చిప్‌సెట్‌, భారీ బ్యాటరీని కలిగి ఉంటుందని సమాచారం.

ఫిబ్రవరి 19 న ఏం లాంచ్‌ కానున్నాయి? :
అయితే ఆపిల్‌ నుంచి ఎటువంటి అధికారిక ప్రకటన రాలేదు. అయితే తాజాగా ఆపిల్‌ సీఈవో టిమ్‌ కుక్ (Apple CEO Tim Cook) ఆసక్తికర ట్వీట్‌ చేశారు. ఫిబ్రవరి 19 వ తేదీన ఆపిల్ నుంచి కొత్త డివైజ్‌ను లాంచ్ చేయనున్నట్లు తెలిపారు. అయితే అది స్మార్ట్‌ఫోన్‌ లేదా ఇంకా ఏదైనా ప్రొడక్ట్‌ను లాంచ్‌ చేస్తున్నారా తెలియాల్సి ఉంది.

Apple CEO tim cook Confirmed to launch new product on February 19 through his X post

ట్వీట్‌లో ఏం ఉంది?
"కుటుంబంలోని కొత్త సభ్యుడిని కలవడానికి సిద్ధంగా ఉండండి, బుధవారం ఫిబ్రవరి 19 #AppleLaunch" అని తన X పోస్ట్‌లో ఆపిల్‌ సీఈవో టిమ్‌ కుక్ పేర్కొన్నారు. అంటే ఆపిల్ నుంచి కొత్త ఉత్పత్తి లాంచ్ కానుందని హింట్‌ ఇచ్చారు. ఈ ట్వీట్‌కు ఆపిల్‌ లోగోను జత చేశారు.

ఎప్పటి నుంచో ఎదురుచూస్తున్న ఐఫోన్ SE 4 నే లాంచ్‌ చేస్తారని భావిస్తున్నారు. ఈ వారంలోనే ఈ హ్యాండ్‌సెట్ లాంచ్ కానుందనే లీక్స్‌ వచ్చాయి. ఆపిల్ లాంచ్‌ వాయిదాపడినట్లు పముఖ అనలిస్ట్‌ మార్క్‌ గుర్మన్‌ కూడా వెల్లడించారు. ఆపిల్‌ తాజా ప్రకటనతో ఇదే నిజమని తెలుస్తోంది.

ఐఫోన్ SE 4 స్పెసిఫికేషన్‌లు! :
ప్రస్తుతం ఉన్న వివరాల ఆధారంగా ఐఫోన్ SE 4 స్లిమ్‌ బెజెల్స్‌తో కూడిన ఫ్లాట్ డిజైన్‌తో విడుదల కానుంది. బ్లాక్‌, రెడ్, వైట్ రంగుల్లో ఈ హ్యాండ్‌సెట్‌ లభిస్తుందని తెలుస్తోంది. ఈ ఫోన్ 6.1 అంగుళాల OLED డిస్‌ప్లేను కలిగి ఉండే అవకాశం ఉంది. ఈ ఫోన్‌ రూ.41,000 ధర రేంజ్‌లో భారత్‌ మార్కెట్‌లో అందుబాటులోకి వచ్చే అవకాశం ఉంది.

చిప్‌సెట్‌ వివరాలు :
ఐఫోన్ SE 4 A18 చిప్‌సెట్‌తో పనిచేస్తుందని తెలుస్తోంది. ఈ చిప్‌సెట్ 8GB ర్యామ్‌తో జతచేసి ఉంటుందని తెలుస్తోంది. కెమెరా విభాగం పరంగా సింగిల్‌ కెమెరాను కలిగి ఉంటుంది. 48MP ప్రైమరీ కెమెరా, 12MP సెల్ఫీ కెమెరాను కలిగి ఉంటుందని సమాచారం. ఆపిల్ ఇంటెలిజెన్స్‌ ఫీచర్‌తో లాంచ్‌ కానుందని తెలుస్తోంది.

ఫోన్ కాకుండే ఇంకా ఏం లాంచ్‌ అవుతాయి?
ఐఫోన్‌ SE 4 విడుదల కాకుంటే M4 చిప్‌సెట్‌తో మ్యాక్‌బుక్‌ ఎయిర్‌ ను లాంచ్‌ చేస్తారని తెలుస్తోంది. ఈ ల్యాప్‌టాప్‌ 16GB ర్యామ్‌ లో అందుబాటులోకి వచ్చే అవకాశం ఉంది. అయితే గత మోడళ్లతో పోలిస్తే డిజైన్‌ పరంగా భారీ మార్పులు చోటుచేసుకొనే అవకాశం లేదని తెలుస్తోంది. అయితే ఫెర్మామెన్స్‌ పరంగా మార్పులు ఉండనున్నాయని సమాచారం.

ఎయిర్‌ట్యాగ్‌ పైనా లీక్స్‌ :
ఐప్యాడ్‌లపై కొత్త అప్‌డేట్‌లు కూడా వచ్చే అవకాశం ఉందని తెలుస్తోంది. దీంతోపాటు AirTag లాంచ్‌ పైనా లీక్స్ వస్తున్నాయి. సెకెండ్‌ జనరేషన్‌ ఎయిర్‌ట్యాగ్‌ అందుబాటులోకి వచ్చే అవకాశం ఉందని భావిస్తున్నారు. అయితే ఎయిర్‌ట్యాగ్‌ జెన్‌ 2 ప్రస్తుతం అభివృద్ధిలో ఉన్నట్లు తెలుస్తోంది. ఈ సంవత్సరం మధ్య వరకు లాంచ్‌ అయ్యే అవకాశం లేదని తెలుస్తోంది.

More from GizBot

Best Mobiles in India

English summary
Apple CEO tim cook Confirmed to launch new product on February 19 through his X post
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X