డిసెంబర్ 9న ఆపిల్ 'న్యూ గ్రాండ్ సెంట్రల్ స్టోర్' అట్టహాసంగా..

Posted By: Super

డిసెంబర్ 9న ఆపిల్ 'న్యూ గ్రాండ్ సెంట్రల్ స్టోర్' అట్టహాసంగా..

 

అమెరికా వాణిజ్య నగరం న్యూయార్క్‌లో ప్రపంచపు టెక్నాలజీ గెయింట్ ఆపిల్ ఎంతో ప్రతిష్టాత్మకంగా నెలకొల్పిన 'న్యూ గ్రాండ్ సెంట్రల్ స్టోర్' అట్టహాసంగా డిసెంబర్ 9(శుక్రవారం)తేదీన ప్రారంభించేందుకు సన్నాహాలు చేస్తున్నారు. ఈ విషయాన్ని ట్విట్టర్ ద్వారా స్టోర్‌ని రూపొందించిన మార్కో ఆర్మెంట్ వెల్లడించారు. తన ట్విట్టర్ ఎకౌంట్‌లో ఏమని ట్వీట్ చేశారంటే “Apple Store, Grand Central. Arriving Friday, December 9″.

ఆపిల్ ఎన్నో కొట్ల రూపాయలతో ప్రారంభించిన ఈ స్టోర్‌లో చాలా ప్రత్యేకతలు ఉన్నాయి. ఆపిల్ కంపెనీ ఈ స్ట్రోర్‌ని పర్యవేక్షించేందుకు గాను అన్ని అనుమతులను న్యూయార్క్ పోలీసులకు అందించడం జరిగింది. గ్రాండ్ సెంట్రల్ టెర్మినల్ స్టోర్‌ని ఆపిల్ కంపెనీ లీజ్‌కి తీసుకొని రూపొందించిన విషయం అంతక ముందు పాఠకులకు తెలియజేయడం జరిగింది.

ఈ స్టోర్‌ కోసం లీజ్‌కి తీసుకున్నందుకు గాను ఆపిల్ స్కేర్ ఫీట్‌కి $60 చెల్లించనుంది. అదే వేరే రీటైల్ స్టోర్స్‌ని గనుక తీసుకుంటే $200ను చెల్లిస్తున్నారు. తక్కువ చోటులో ఆపిల్ ఎంతో ప్రతిష్టాత్మకంగా ఫ్రారంభించనున్న ఈ స్టోర్ న్యూయార్క్ గ్రాండ్ సెంట్రల్ స్టేషన్‌కే పెద్ద హైలైట్‌గా నిలుస్తుందని అంటున్నారు. ఈ స్టోర్ ఫ్రారంభోత్సవం రోజున ప్రత్యేకంగా వాచ్ డాగ్స్‌ని కూడా ఏర్పాటు చేయనున్నారు. ప్రతిష్టాత్మకంగా ఫ్రారంభించనున్న ఈ స్టోర్ ద్వారా ఆపిల్ సుమారు $100 మిలియన్ సేల్స్‌ని సాధించాలనే యోచనలో ఉంది.

Opinion Poll

Social Counting

ఇన్స్టెంట్ న్యూస్ అప్డేట్స్ రోజుంతా పొందండి - Telugu Gizbot