ఫైట్‌లో నిలిచేందుకే Apple i-Phone 3GS

Posted By: Staff

ఫైట్‌లో నిలిచేందుకే Apple i-Phone 3GS

ఆపిల్ కంపెనీ ఉత్తమైన నాణ్యత గల ప్రోడక్ట్స్‌కు పెట్టింది పేరు. సాధారణంగా ఆపిల్ కంపెనీ తమ యొక్క ప్రోడక్ట్స్‌ని విడుదల చేసిన తర్వాత ఎటువంటి డిస్కౌంట్స్, ఆఫర్స్ ఇవ్వదు. ఇందుకు కారణం ఆపిల్ ప్రోడక్ట్స్‌కి ప్రపంచం మొత్తం మీద ఉన్నటువంటి గిరాకి అలాంటిది మరి. ఒక్క ఉత్పత్తిని తయారు చేసింది అంటే అందులో అన్ని ఫీచర్స్ ఉంచడమే కాకుండా నెంబర్‌గా ఉంటాయి ఆ మోడల్స్. ఇటీవల కాలంలో ఆపిల్ కొన్నిసెలక్ట్ సర్వీస్ ప్రోవైడర్స్ కోసం స్పెషల్‌గా లాక్డ్ ఐఫోన్ మోడల్స్‌ని మార్కెట్ లోకి విడుదల చేసింది. ఆపిల్ విడుదల చేసినటువంటి ఈ లాక్డ్ ఐఫోన్స్ ఏఏ సర్వీస్ ప్రోవైడర్స్ ఉన్నాయో వాటికి మాత్రమే పనిచేస్తుంది. వేరే ఇతర సిమ్ కార్డ్స్‌కి ఇది పనిచేయదు. ఇండియాలో ఐపోన్ 4ని భారతీ ఎయిర్ టెల్, ఎయిర్ సెల్ ప్రోవైడర్స్ మాత్రమే సోంతం చేసుకున్నాయి. ఈ రెండు ప్రోవైడర్స్‌కు మాత్రమే ఐఫోన్ 4 ఇండియాలో పని చేస్తుంది.

ప్రస్తుతం ఆపిల్ ఐఫోన్ 4కి మార్కెట్‌లో ఆండ్రాయిడ్ ఆపరేటింగ్ సిస్టమ్ మొబైల్ ఫోన్స్, విండ్సో ఆపరేటింగ్ సిస్టమ్ మొబైల్ ఫోన్స్ నుండి గట్టి పోటీని ఎదుర్కోనుంది. అందుకుగాను ఆపిల్ తమయొక్క ఐఫోన్‌లో ఎక్కువ ఫీచర్స్ అందించడమే కాకుండా ఉత్పత్తిని అమ్మడానికి ఒకే విధమైనటువంటి సేల్స్ టెక్నిక్‌ని అవలంభిస్తుందని తెలిపారు. అందుకోసం ఇండియాలో i-Phone 3GS పేరిట ఓ సరిక్రొత్త మొబైల్‌ని మార్కెట్ లోకి విడుదల చేసింది. దీని ధర కేవలం కూ 19,990. దీనిని ఇండియన్ మార్కెట్‌లో విడుదల చేయడం వెనుక ఉన్న ముఖ్య ఉద్దేశ్యం ప్రస్తుతం ఇండియన్ మార్కెట్‌లో హాల్ చల్ చేస్తున్నటువంటి ఆండ్రాయిడ్, విండోస్ ఫోన్స్ అడ్డుకునేందుకేనని వెల్లడించారు.

Apple iOS 4 Specifications:

* Homescreen wallpapers
* Folder organization of the homescreen icons
* Multitasking and fast app switching
* Google/Wikipedia search in Spotlight
* Bluetooth keyboard pairing support
* SMS character counter
* SMS search
* Email threading
* Unified Email inbox
* Email archiving is now available when you setup Gmail
* Spell checker
* iPod music player can now create, edit and delete playlists
* 5x digital zoom in still camera
* Touch-focus in video capture (for video enabled iPhones)
* Keyboard layouts span over QWERTY, QWERTZ, and AZERTY
* Minor icon design facelifts
* Video call support (only in iPhone 4 and only over Wi-Fi)
* iBooks e-book and PDF reader

ఇకపోతే i-Phone 3GS మొబైల్ మార్కెట్‌కి కొత్త ఏమీ కాదు. రెండు సంవత్సరాల క్రితం నుండే మార్కెట్ లో ఉంది. ఇక ఈ మొబైల్ ప్రస్తుతం కస్టమర్స్‌కు రెండు కలర్స్‌(బ్లాక్, వైట్)లో లభించనుంది. ప్రపంచ వ్యాప్తంగా ఆండ్రాయిడ్ మొబైల్ ఫోన్స్, విండోస్ ఫోన్స్ మద్య ఉండే పోటీని తట్టుకోవడానికే దీనిని మరలా విడుదల చేయడానికి నిర్ణయం తీసుకున్నామని ఆపిల్ అధికారులు చెప్పారు.

Opinion Poll

Social Counting

ఇన్స్టెంట్ న్యూస్ అప్డేట్స్ రోజుంతా పొందండి - Telugu Gizbot