Home
Mobile

ఆపిల్‌ తొలి ఫోల్డబుల్‌ ఐఫోన్‌ కీలక వివరాలు లీక్‌.. నాలుగు కెమెరాలు, బుక్‌ స్టైల్‌ ఫోల్డబుల్‌ డిజైన్..!

ఆపిల్‌ నుంచి ఎప్పటి నుంచో ఫోల్డబుల్‌ స్మార్ట్‌ఫోన్‌ లాంచ్ కానుందని వార్తలు వస్తున్నాయి. గతంలో ఈ ఫోల్డబుల్ స్మార్ట్‌ఫోన్ డిస్‌ప్లే సహా ఇతర విభాగాలపై లీక్స్ వచ్చాయి. అయితే ప్రస్తుతం ఉన్న వివరాల ఆధారంగా ఆపిల్‌ తొలి ఫోల్డబుల్‌ స్మార్ట్‌ఫోన్ 2026 సంవత్సరంలో (Apple First Foldable iPhone) అందుబాటులోకి వచ్చే అవకాశం ఉంది.

ఆపిల్‌ తొలి ఫోల్డబుల్‌ ఐఫోన్‌ పేరు ఏంటి?
ఈ ఫోల్డబుల్‌ మోడల్‌ గురించి ఆపిల్‌ ఎటువంటి కీలక వివరాలను వెల్లడించలేదు. అయితే ఆపిల్‌ తొలి ఫోల్డబుల్‌ మోడల్‌ను ఐఫోన్‌ ఫోల్డ్‌ లేదా ఐఫోన్ ఫ్లిప్‌ పేరుతో పిలిచే అవకాశం ఉంది. బ్లూమ్‌బర్గ్ వివరాల ఆధారంగా బుక్‌ స్టైల్‌ డిజైన్‌ను కలిగి ఉంటుంది.

apple First Foldable iphone

నాలుగు కెమెరాలు :
శాంసంగ్ గెలాక్సీ Z ఫోల్డ్‌ సిరీస్‌ తరహాలో భారీ ఇన్నర్ డిస్‌ప్లేను కలిగి ఉంటుందని తెలుస్తోంది. ఆపిల్ తొలి ఫోల్డబుల్‌ స్మార్ట్‌ఫోన్‌ ఏకంగా నాలుగు కెమెరాలను కలిగి ఉంటుందని తెలుస్తోంది. ఇందులో ముందు వైపు ఒకటి, ఇన్నర్‌ స్క్రీన్‌ పైన మరొకటి మరియు వెనుక వైపు మరో రెండు కెమెరాలు ఉంటాయి.

e-SIM మాత్రమే :
ఆపిల్‌ ఫోల్డబుల్‌ స్మార్ట్‌ఫోన్‌ e-SIM సపోర్టుతో లాంచ్‌ కానుందని తెలుస్తోంది. మరియు ఫేస్‌ ఐడీకి బదులుగా టచ్‌ ఐడీ ఫీచర్‌తో అందుబాటులోకి వస్తుందని భావిస్తున్నారు. ప్రస్తుతం ఉన్న సమాచారం ఆధారంగా బ్లాక్‌, వైట్ కలర్‌ వేరియంట్స్‌ లభించే అవకాశం ఉంది.

డిస్‌ప్లే వివరాలు :
ఆపిల్ బుక్‌ స్టైల్ డిజైన్‌ ఐఫోన్‌ ఫోల్డ్‌ లేదా ఐఫోన్‌ ఫ్లిప్‌ ను అన్‌ఫోల్డ్ చేస్తే ట్యాబ్లెట్ తరహాలో కనిపిస్తుంది. ఈ ఆపిల్‌ స్మార్ట్‌ఫోన్‌ 7.8 అంగుళాల ఇన్నర్‌ డిస్‌ప్లే, 5.5 అంగుళాల కవర్‌ డిస్‌ప్లేను కలిగి ఉంటుంది. అన్‌ఫోల్డ్ సమయంలో కేవలం 4.5 mm థిక్‌నెస్‌ నుంచి కలిగి ఉంటుందని.. అదే ఫోల్డింగ్‌ సమయంలో 9mm థిక్‌నెస్‌ను కలిగి ఉంటుందని తెలుస్తోంది.

ఏకంగా రూ.1.72 లక్షల ధర! :
ఆపిల్‌ తొలి ఫోల్డబుల్‌ స్మార్ట్‌ఫోన్ ధర సుమారుగా $2000 ఉంటుందని, అంటే భారత కరెన్సీ ప్రకారం సుమారుగా రూ.1.72 లక్షలుగా ఉండే అవకాశం ఉంది. త్వరలో మరిన్ని వివరాలు వెల్లడయ్యే అవకాశం ఉంది.

ఆపిల్‌ ఇటీవల కీలక ప్రకటన చేసింది. భారత్‌లో మూడో రిటైల్‌ స్టోర్‌ను లాంచ్‌ చేస్తున్నట్లు ప్రకటన చేసింది. సెప్టెంబర్‌ 2 వ తేదీ మధ్యాహ్నం 1 గంటకు బెంగళూరులో Apple Hebbal స్టోర్‌ ప్రారంభిస్తున్నట్లు తెలిపింది. ప్రస్తుతం ఆపిల్‌కు భారత్‌లో రెండు రిటైల్ స్టోర్‌లు ఉన్నాయి.

ఆపిల్‌ తొలుత ముంబై BKC అనంతరం ఢిల్లీ సాకేత్‌ రిటైల్‌ స్టోర్‌లను అందుబాటులోకి తీసుకొచ్చింది. అయితే త్వరలో ప్రారంభించనున్న బెంగళూరు స్టోర్‌కు సంబంధించిన డిజైన్‌ను కూడా విడుదల చేసింది. ఈ డిజైన్ నెమలిని పోలిన డిజైన్‌, కలర్స్‌ను కలిగి ఉంది. ఈ స్టోర్‌లో ఆపిల్‌ యూజర్లు సహా ఇతరులు నేరుగా ఆపిల్‌ స్పెషలిస్ట్‌లతో మాట్లాడేందుకు అవకాశం ఉంటుందని తెలుస్తోంది. ఆపిల్‌ టు డే సెషన్స్‌లో పాల్గొనేందుకు అవకాశం ఉంటుందని చెబుతోంది.

More from GizBot

Best Mobiles in India

English summary
apple First Foldable iphone key details tipped expected to launch in 2026
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X