Home
Mobile

Apple First Foldable iPhone ఆపిల్‌ తొలి ఫోల్డబుల్ ఐఫోన్‌ ధర చూస్తే షాక్‌ అవ్వాల్సిందే..?

Apple First Foldable iPhone : ఆపిల్‌ ఫోల్డబుల్ ఐఫోన్‌ గురించి ఎప్పటి నుంచో చర్చ జరుగుతోంది. తొలి ఫోల్డబుల్‌ ఐఫోన్‌ వచ్చే సంవత్సరం విడుదల కానుందని తెలుస్తోంది. 2026 సెప్టెంబర్ నెలలో లాంచ్ అయ్యే అవకాశం ఉంది. అయితే ఆపిల్ మాత్రమే ఎటువంటి ప్రకటన చేయలేదు. అయితే తాజా నివేదిక ఆధారంగా ఆపిల్‌ ఫోల్డబుల్‌ ఐఫోన్ అంచనా ధర వివరాలు వెల్లడయ్యాయి. దీంతోపాటు డిస్‌ప్లే, కెమెరాలు సహా ఇతర అంచనా వివరాలు లీక్‌ అయ్యాయి.

భారీ ధరకు ఆపిల్‌ తొలి ఫోల్డబుల్‌ ఫోన్? :
తాజాగా రిపోర్టు ఆధారంగా ఆపిల్‌ తొలి ఫోల్డబుల్‌ ఐఫోన్‌ ధర $2399 (భారత కరెన్సీ ప్రకారం సుమారు రూ.2,14,100) గా ఉండే అవకాశం ఉందని తెలుస్తోంది. మెటీరియల్‌ ధరల కారణంగానే భారీ ధర ఉంటుందని తెలుస్తోంది.

Apple First Foldable iPhone

వచ్చే సంవత్సరం 5.4 మిలియన్‌ యూనిట్లు :
ఇందులో ప్యానల్‌, హింజ్‌, లైట్‌ వెయిట్‌ కంపోనెంట్స్‌ వంటివి భారీగా ధర పెరుగుదలకు కారణం అవుతాయని తాజా నివేదిక తెలిపింది. దీంతోపాటు ఈ ఫోల్డబుల్‌ ఐఫోన్‌ అమ్మకాలు 15.4 మిలియన్‌ యూనిట్లుగా ఉండే అవకాశం ఉంటుందని అంచనా వేస్తుంది. ఇందులో 2026 లో 5.4 మిలియన్‌ యూనిట్లు అందుబాటులోకి వచ్చే అవకాశం ఉంది.

ఆపిల్‌ ఫోల్డబుల్‌ ఐఫోన్‌ అంచనా డిజైన్ వివరాలు :
ఆపిల్‌ నుంచి వచ్చే సంవత్సరం లాంచ్ కానుందని భావిస్తున్న ఫోల్డబుల్‌ ఐఫోన్‌ బుక్‌ స్టైల్‌ డిజైన్‌ ను కలిగి ఉంటుందని అంచనా వేస్తున్నారు. శాంసంగ్‌ గెలాక్సీ Z ఫోల్డ్‌ తరహాలో భారీ ఇన్నర్‌ డిస్‌ప్లేను కలిగి ఉండే అవకాశం ఉందని భావిస్తున్నారు.

సన్నని ఫోల్డబుల్‌ ఐఫోన్ మోడల్‌! :
ఫోల్డబుల్ ఐఫోన్ 7.8 అంగుళాల ఇన్నర్ డిస్‌ప్లే, 5.5 అంగుళాల కవర్‌ డిస్‌ప్లే తో లాంచ్‌ అయ్యే అవకాశం ఉంది. ఈ ఫోన్ మడత పెట్టినప్పుడు 9mm థిక్‌నె‌స్‌, అన్‌ఫోల్డ్‌ చేసినప్పుడు 4.5mm థిక్‌నెస్‌ ఉంటుందని తెలుస్తోంది. ఫలితంగా అత్యంత సన్నని ఫోల్డబుల్ ఫోన్‌గా నిలుస్తుందని అంచనా వేస్తున్నారు.

4 కెమెరాలు! :
ఆపిల్ ఫోల్డబుల్‌ ఫోన్ మొత్తంగా 4 కెమెరాలను కలిగి ఉండే అవకాశం ఉంది. ముందు వైపు ఒకటి, లోపలి వైపు మరొకటి, వెనుక వైపు మరో రెండు కెమెరాలు ఉంటాయని తెలుస్తోంది. దీంతోపాటు ఫేస్ ఐడీకి బదులుగా టచ్ ఐడీని కలిగి ఉండే అవకాశం ఉందని తెలుస్తోంది.

Take a Poll

కేవలం e-SIM ను మాత్రమే సపోర్టు చేస్తుందా? :
ఈ ఐఫోన్‌ ఫిజికల్‌ సిమ్ కార్డును సపోర్టు చేసే అవకాశం ఉండకపోవచ్చని, కేవలం e-SIM తో మాత్రమే అందుబాటులోకి వచ్చే అవకాశం ఉందని తెలుస్తోంది. బ్లాక్, వైట్‌ కలర్‌ వేరియంట్స్‌ లాంచ్‌ కానుందని అంచనా వేస్తున్నారు.

ఐఫోన్‌ 18 ప్రో సిరీస్‌ వచ్చే సంవత్సరం సెప్టెంబర్ నెలలో లాంచ్‌ అయ్యే అవకాశం ఉంది. వీటితోపాటే తొలి ఫోల్డబుల్ ఐఫోన్‌ కూడా అందుబాటులోకి వస్తుందని భావిస్తున్నారు. త్వరలో మరిన్ని వివరాలు వెల్లడయ్యే అవకాశం ఉంది.

More from GizBot

Best Mobiles in India

English summary
Apple First Foldable iPhone price leaked, here are the expected specifications
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X