ఆపిల్ iOS5లో మాట్లాడితే టెక్ట్స్ రూపంలో వస్తుంది..

By Super
|
Apple iOS 5
ప్రపంచంలో ఆపిల్ కంపెనీ ఏ ఉత్పత్తులను మార్కెట్లోకి విడుదల చేసినా వాటికి ఉండేటటువంటి డిమాండ్ అంతా ఇంతా కాదన్న విషయం అందరికి తెలిసిందే. కొత్త విషయాలను, కొత్త టెక్నాలజీలను ఎప్పటికప్పుడు ప్రపంచానికి పరిచయం చేయడంలో ఆపిల్ ఎప్పుడూ ముందంజే. అందులో భాగంగానే ఆపిల్ సొంత ఆపరేటింగ్ సిస్టమ్ iOS5ని మరిన్ని కొత్త ఫీచర్స్‌తో బయటకు విడుదల చేయనుంది. iOS5లో మొత్తం 200 ఫీచర్స్ వరకు ఉండబోతున్నాయని అంచనా..

ఆపిల్ విడుదల చేయనున్న ఇన్ని రకాల ఫీచర్స్‌ లలో కొన్ని ఫీచర్స్‌ని తెలుసుకుంటే మైండ్ పోవడమే కాకుండా ఆపిల్ ఉత్పత్తుల మీద ఇట్టే ప్రేమ పుట్టుకొస్తుందని నిపుణులు అంటున్నారు. ఆపిల్ ఉత్పత్తులకు ఎప్పటినుండో సాప్ట్ వేర్స్ అందిస్తున్న నాన్స్ అనే సాప్ట్ వేర్ కంపెనీ ఈ విషయాన్ని తెలియజేసింది. అన్నింటికి కంటే అత్యుత్తమమైన ఫీచర్‌గా 'పవర్ స్పీచ్ సింధసిస్ ఫీచర్'ని అభవర్ణిస్తున్నారు. ఈ ఫీచర్ ఉండడం వల్ల ఏమిజరుగుతుంటే ఏ యూజర్ ఐతే మైక్రో పోన్ ఐకాన్‌ని కలిగి ఉండాడో ఆ యూజర్ ఏమైనా మాట్లాడొచ్చు. యూజర్ మాట్లాడినటువంటి మాటలను టెక్ట్స్ బాక్స్‌లో సడన్‌గా ప్రచురిస్తుంది.

 

ఈ ఫీచర్ ఎవరిని ఉద్దేశించి ప్రవేశపెట్టడం జరిగిందంటే ఎవరైతే యూజర్స్ టచ్ ప్యాడ్ మీద టైప్ చేయడానికి ఇబ్బంది పడతారో అలాంటి యూజర్స్ కోసం ఇది ప్రత్యేకం. అంతేకాకుండా సింధసిస్ ఫీచర్ వల్ల యూజర్స్ ఈజీగా ఈమెయిల్స్, మెసేజ్‌లను వ్రాయడం కాకుండా, మాటలతో పంపవచ్చు. ఈ అప్లికేషన్ వల్ల ఎవరైతే స్మార్ట్ ఫోన్స్ ని కొనాలని అనుకుంటున్నారో అలాంటి యాజర్స్ కూడా ఆపిల్ ఉత్పత్తులవైపు మొగ్గుచూపేటటువంటి అవకాశం ఉంది.

 

వీటితో పాటు iOS 5లో ఫీచర్ అయిన రియల్ టైమ్ నోటిఫికేషన్‌ని పోడిగించడం జరిగింది. దీనివల్ల యూజర్స్‌కు ఉపయోగం ఏమిటంటే న్యూమెయిల్, టెక్ట్స్, ప్రెండ్ రిక్వెస్టులు ఈజీగా నోటిఫై అవుతాయి. అంతేకాకుండా కొత్తగా వచ్చినటువంటి నోటిఫికేషన్ ప్రస్తుతం జరుగుతున్న ఫంక్షనాలిటీకి ఎటువంటి అంతరాయం కలగకుండా జాగ్రత్తపడుతుంది. ఇంకొక ఫీచర్ ఐమెసేజ్ ఫెసిలిటీ దీని ఉపయోగం ఏమిటంటే త్వరగా టెక్ట్స్ మెసేజ్‌ని పంపడంలో తోడ్పడుతుంది. న్యూస్ స్టాండ్ ఫెసిలిటీ యూజర్స్ మార్కెట్లో ఉన్న న్యూస్ పేపర్స్, మ్యాగజైన్స్‌కి సబ్ స్క్రైబ్ అయ్యేలా చూసి వాటిని సరిగ్గా ఆర్గనైజ్ చేయడంలో తోడ్పడతాయి.

ఇక సోషల్ నెట్ వర్కింగ్ వెబ్ సైట్స్ అయిన ట్విట్టర్, ఫేస్ బుక్ మొదలగున వాటిని కనెక్ట్ అవ్వడంలో యూజర్స్‌కు ప్రెండ్లీ వాతావరణాన్ని కల్పిస్తాయి. వీడియోలను, ఫోటోలను iOS 5 ఆపరేటింగ్ సిస్టమ్ ద్వారా చాలా ఈజీగా షేర్ చేసుకోవచ్చు. వీటితో పాటు iOS 5లో క్విక్ ఫోటో క్లిక్కింగ్, ఇమేజిలను చాలా ఫాస్టుగా సేవ్ చేసుకునే వెసులుబాటు కూడా ఇందులో కల్పించడం జరిగింది. iOS 5 అప్లికేషన్స్‌ని ఆపిల్ ఉత్పత్తులు కోసమే పోడిగించడం జరిగింది. అంతేకాకుండా ఆపిల్ యూజర్స్‌కు చక్కని విజువల్ ఎక్స్ పీరియన్స్‌ని అందించడం కోసమే iOS 5లో కొత్త ఫీచర్స్‌ని యాడ్ చేయడం జరుగుతుందని తెలిపారు.

అసలు ఆపిల్ కంపెనీ ముఖ్య ఉద్దేశ్యం ఏమిటంటే తక్కువ సమయంలో యూజర్స్‌కు చక్కని హై ఎండ్ టెక్నాలజీని అందించడమేనని అన్నారు. రాబోయే కాలంలో ఆపిల్ కంపెనీ విడుదల చేసేటుటవంటి అన్ని ఉత్పత్తులలోను 'పవర్ స్పీచ్ సింధసిస్ ఫీచర్' ని యాడ్ చేయడం జరుగుతుందని తెలిపారు.

Best Mobiles in India

ఉత్తమ ఫోన్లు

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
X