ఐఫోన్ 16, ఐఫోన్ 16 ప్లస్ మోడల్స్‌పై ఏకంగా రూ.10 వేల తగ్గింపు.. పూర్తి వివరాలు..!
ఆపిల్ ఐఫోన్ 17 సిరీస్ ను విడుదల చేసింది. సెప్టెంబర్ 9 వ తేదీన నిర్వహించిన Apple Awe dropping ఈవెంట్ లో ఈ మోడల్స్ ను లాంచ్ చేసింది. ఐఫోన్ 17 సిరీస్‌లో భాగంగా ఐఫోన్ 17, ఐపోన్ ఎయిర్, ఐఫోన్ 17 ప్రో, ఐఫోన్ 17 ప్రో మ్యాక్స్ మోడల్స్ విడుదల అయ్యాయి. అయితే ఐఫోన్ 17 సిరీస్ విడుదల అనంతరం ఐఫోన్ 16, ఐఫోన్ 16 ప్లస్ మోడల్స్ ధరలను తగ్గించింది.
ఐఫోన్ 16 (iPhone 16), ఐఫోన్ 16 ప్లస్ (iPhone 16 Plus) మోడల్స్‌పై రూ.10,000 చొప్పున ధరలను తగ్గించింది. తగ్గింపు ధరలతో ఆపిల్ వెబ్‌సైట్‌లో ఈ రెండు మోడల్స్ అందుబాటులో ఉన్నాయి. గత సంవత్సరం కూడా ఐఫోన్ 16 విడుదల అనంతరం ఐఫోన్ 15 సిరీస్ ధరలను తగ్గించింది. గతంలోనూ రూ.10 వేల చొప్పున ధరలకు తగ్గించింది.

ఐఫోన్ 16 స్మార్ట్‌ఫోన్ :
ఐఫోన్ 16 స్మార్ట్‌ఫోన్ 128GB స్టోరేజీ వేరియంట్ ఒరిజినల్ ధర రూ.79900 గా ఉండేది. ఆపిల్ ధర తగ్గింపు నిర్ణయంతో రూ.69990 కే ప్రస్తుతం కొనుగోలు చేయవచ్చు. కొత్త ధరతో ఐఫోన్ 16 మోడల్‌ను ఆపిల్ వెబ్‌సైట్‌లో కొనుగోలు చేయవచ్చు.
ఐఫోన్ 16 ప్లస్ స్మార్ట్‌ఫోన్ :
అదే ఐఫోన్ 16 ప్లస్ స్మార్ట్‌ఫోన్ 128GB స్టోరేజీ వేరియంట్ ధర రూ.89900 గా ఉండేది. ధరల తగ్గింపుతో రూ.79900 కే కొనుగోలు చేయవచ్చు. అదే 256GB స్టోరేజీ వేరియంట్ ధర రూ.99900 గా ఉండేది. ప్రస్తుతం రూ.89900 కే సొంతం చేసుకోవచ్చు.
మరో కీలక నిర్ణయం :
దీంతోపాటు ఆపిల్ అధికారిక వెబ్‌సైట్‌లో ఐఫోన్ 16 స్మార్ట్‌ఫోన్ 256GB, 512GB స్టోరేజీ వేరియంట్స్ సేల్ నిలిపేసింది. ఫలితంగా ఆపిల్ వెబ్‌సైట్‌లో ఐఫోన్ 16 బేస్ వేరియంట్‌ను మాత్రమే కొనుగోలు చేసేందుకు అందుబాటులో ఉంటుంది.
ఐఫోన్ 16 ప్లస్ మోడల్ 512GB స్టోరేజీ వేరియంట్‌ను కూడా అధికారిక వెబ్‌సైట్‌లో సేల్ నిలిపేసింది. ఫలితంగా 128GB, 256GB స్టోరేజీ వేరియంట్స్‌లోనే అందుబాటులో ఉంటుంది. అయితే అమెజాన్, ఫ్లిప్‌కార్ట్ సహా ఇతర థర్డ్‌పార్టీ వెబ్‌సైట్స్, స్టోర్స్‌లో అన్ని స్టోరేజీ వేరియంట్స్ అందుబాటులో ఉంటాయి.
ఆపిల్ ఈవెంట్‌లో :
ఆపిల్ Awe Dropping ఈవెంట్‌లో భాగంగా ఐఫోన్ 17 సిరీస్ విడుదల అయింది. ఈ సిరీస్‌లో ఈ సంవత్సరం కొత్తగా ప్లస్ మోడల్‌కు బదులుగా ఎయిర్ మోడల్‌ను లాంచ్ చేసింది. అల్ట్రా స్లిమ్ సెగ్మెంట్‌లో 5.6mm థిక్‌నెస్‌తో ఈ ఐఫోన్ ఎయిర్ మోడల్ అందుబాటులోకి తీసుకొచ్చింది.
ఐఫోన్ 17 మోడల్ A19 చిప్‌సెట్ తో పనిచేస్తుంది. అదే ఐఫోన్ ఎయిర్, ఐఫోన్ 17 ప్రో, ఐఫోన్ 17 ప్రో మ్యాక్స్ మోడల్స్ A19 ప్రో మోడల్స్ పైన పనిచేస్తాయి. iOS 26 పైన పనిచేస్తాయి. ఈ మోడల్స్ సెప్టెంబర్ 12 నుంచి ముందస్తు ఆర్డర్ చేసుకొనే అవకాశం ఉంటుంది. సెప్టెంబర్ 19 నుంచి సేల్ ప్రారంభం కానుంది.


Click it and Unblock the Notifications