Home
Mobile

ఐఫోన్ 16 ప్రో, ఐఫోన్ 16 ప్రో మ్యాక్స్‌ మోడల్స్‌పై డిస్కౌంట్‌.. బ్యాంకు ఆఫర్లతో అదనపు తగ్గింపు..!

ఆపిల్ నుంచి గత సంవత్సరం ఐఫోన్‌ 16 సిరీస్‌ విడుదల అయింది. ఇందులో ఐఫోన్ 16, ఐఫోన్ 16 ప్లస్, ఐఫోన్‌ 16 ప్రో, ఐఫోన్‌ 16 ప్రో మ్యాక్స్‌ మోడల్స్‌ లాంచ్ అయ్యాయి. ఇప్పటికే ఐఫోన్ 16, ఐఫోన్ 16 ప్లస్‌ మోడల్స్‌ తగ్గింపు ధరకు అందుబాటులోకి వచ్చాయి. అయితే ప్రస్తుతం ప్రో మోడల్స్‌ను తగ్గింపు ధరకు కొనుగోలు చేయవచ్చు. ఫ్లిప్‌కార్ట్‌లో ప్రస్తుతం ఈ ఆఫర్‌ ఉంది. దీంతోపాటు నో కాస్ట్‌ EMI ఆప్షన్ కూడా ఉంది.

ఐఫోన్ 16 ప్రో :
ఐఫోన్ 16 ప్రో (iPhone 16 Pro Smartphone) మోడల్ 128GB స్టోరేజీ వేరియంట్‌ విడుదల సమయంలో రూ.1,19,900 గా ఉండేది. అదే 256GB వేరియంట్ ధర రూ.1,29,900 గా ఉండేది. ప్రస్తుతం ఫ్లిప్‌కార్ట్‌లో ఈ ఫోన్‌లను వరుసగా రూ.1,09,900, రూ.1,22,900 కే కొనుగోలు చేయవచ్చు.

iPhone 16 Pro

బ్యాంకు ఆఫర్లు :
దీంతోపాటు ఈ మోడల్ పై బ్యాంకు కార్డుల ద్వారా మరింత డిస్కౌంట్‌ను పొందవచ్చు. ఫ్లిప్‌కార్ట్ యాక్సెస్‌ బ్యాంకు క్రెడిట్‌ కార్డుల ద్వారా రూ.2000 డిస్కౌంట్‌ను పొందవచ్చు. మరియు అన్ని బ్యాంకుల కార్డులపై రూ.3000 డిస్కౌంట్‌ను పొందవచ్చు. ప్రో మోడల్‌ 512GB, 1TB స్టోరేజీ వేరియంట్స్‌ ధరలు రూ.1,42,900, రూ.1,62,900 గా ఉన్నాయి.

ఐఫోన్‌ 16 ప్రో మోడల్‌ 6.3 అంగుళాల సూపర్‌ రెటీనా XDR OLED డిస్‌ప్లేను కలిగి ఉంది. ఈ ఫోన్ A18 ప్రో చిప్‌సెట్‌తో పనిచేస్తోంది. కెమెరా విభాగం పరంగా ట్రిపుల్‌ కెమెరాలను కలిగి ఉంది. 48MP ప్రైమరీ కెమెరా, 12MP అల్ట్రావైడ్‌ యాంగిల్‌ లెన్స్‌, 12MP టెలిఫోటో లెన్స్‌తో అందుబాటులో ఉంది. ఈ ఫోన్ క్యాప్చర్‌ బటన్‌ను కూడా కలిగి ఉంది.

iPhone 16 Pro

ఐఫోన్ 16 ప్రో మ్యాక్స్‌ :
ఐఫోన్ 16 ప్రో మ్యాక్స్‌ ను (iPhone 16 Pro Max Smartphone) కూడా ఫ్లిప్‌కార్ట్‌లో డిస్కౌంట్ ధరకు కొనుగోలు చేయవచ్చు. విడుదల సమయంలో 256GB స్టోరేజీ వేరియంట్ ధర రూ.1,44,900 గా ఉండేది. ప్రస్తుతం రూ.132900 కే కొనుగోలు చేయవచ్చు. అదే 512GB వేరియంట్‌ ధర రూ.1,64,900 గా ఉండేది. ప్రస్తుతం రూ.1,57,900 కే సొంతం చేసుకోవచ్చు.

బ్యాంకు ఆఫర్లు :
అదే 1TB స్టోరేజీ వేరియంట్‌ రూ.1,84,900 గా ఉండేది. ప్రస్తుతం రూ.1,77,900 కే కొనుగోలు చేయవచ్చు. దీంతోపాటు ఫ్లిప్‌కార్ట్ యాక్సెస్‌ బ్యాంకు కార్డులపై రూ.2000 డిస్కౌంట్‌ను పొందవచ్చు. మరియు మిగిలిన అన్ని బ్యాంకు కార్డులపై రూ.3000 డిస్కౌంట్‌ను ఫ్లిప్‌కార్ట్‌ అందిస్తోంది.

iPhone 16 Pro

ఐఫోన్‌ 16 ప్రో మ్యాక్స్‌ మోడల్‌ 6.9 అంగుళాల సూపర్‌ రెటీనా XDR డిస్‌ప్లేను కలిగి ఉంది. ఈ మోడల్‌ A18 ప్రో చిప్‌తో పనిచేస్తోంది. కెమెరా విభాగం పరంగా ట్రిపుల్‌ కెమెరాలను కలిగి ఉంది. 48MP ప్రైమరీ కెమెరా, 12MP అల్ట్రావైడ్‌ యాంగిల్‌ లెన్స్‌, 12MP టెలిఫోటో లెన్స్‌తో అందుబాటులో ఉంది. ఈ ఫోన్ క్యాప్చర్‌ బటన్‌ను కూడా కలిగి ఉంది.

Best Mobiles in India

English summary
Apple iPhone 16 Pro, iPhone 16 Pro Max smartphones get best deals in flipkart
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X