ఐఫోన్ 16 ప్రో స్మార్ట్‌ఫోన్ అరుదైన రికార్డు సొంతం చేసుకోనుందా.. ప్రపంచంలోనే తొలి ఫోన్ ఇదేనా?
ఆపిల్ ఐఫోన్ 16 సిరీస్ ఈ సంవత్సరం చివరలో లాంచ్ అయ్యే అవకాశం ఉంది. ఇటీవల కాలంలో ఈ సిరీస్ గురించి అనేక లీక్‌లు వస్తున్నాయి. ఇప్పటికే ఐఫోన్ 16 ప్రో మోడల్ (iPhone 16 pro) గురించి అనేక వివరాలు వెల్లడయ్యాయి. తాజాగా ఈ హ్యాండ్‌సెట్ గురించి ఆసక్తికర అంశం వెలుగులోకి వచ్చింది. ఈ మోడల్ ప్రస్తుత స్మార్ట్‌ఫోన్ మార్కెట్‌లోనే అత్యంత సన్నని బెజెల్స్‌ను కలిగి ఉంటుందని తెలిపింది. ప్రముఖ టిప్‌స్టర్ ఐస్ యూనివర్స్ ఈ వివరాలను వెల్లడించారు.
ప్రస్తుతం అత్యంత సన్నని బెజెల్స్ కలిగి ఉన్న ఫోన్‌గా శాంసంగ్ గెలాక్సీ S24 ను అధిగమిస్తుందని తెలిపారు. ఐఫోన్ 15 ప్రో మ్యాక్స్ గురించి కూడా కచ్చితమైన వివరాలను వెల్లడించారు. ఐఫోన్ 15 ప్రో మ్యాక్స్‌లో బెజెల్‌ను తగ్గించడానికి లో ఇంజెక్షన్ ప్రెజర్ ఓవర్ మౌల్డింగ్ టెక్నాలజీ ద్వారా సాధ్యమైందని తెలిపారు.

అయితే ఐఫోన్ 16 ప్రో ఉత్పత్తి ప్రస్తుతం నిలిచినట్లు తెలుస్తోంది. డిస్‌ప్లే నాణ్యత ఇందుకు కారణం అని తెలుస్తోంది. శాంసంగ్, ఎల్‌జీ, BOE నుంచి ఆమోదం కోసం ఎదురుచూస్తున్నట్లు తెలుస్తోంది. ఈ ఐఫోన్ 16 సిరీస్ పై ఇప్పటికే అనేక అంచనాలున్నాయి. భారీ డిస్‌ప్లే, డిజైన్ సహా మెరుగైన పనితీరును కనబరుస్తుందని తెలుస్తోంది.
గతంలో వచ్చిన లీక్‌ల ఆధారంగా ఐఫోన్ 16 ప్రో.. 1200 నిట్స్ గరిష్ఠ బ్రైట్‌నెస్‌ను (SDR) కలిగి ఉంటుందని తెలిసింది. మరియు గత మోడల్ కంటే 20 శాతం ఎక్కువ బ్రైట్‌నెస్‌ను కలిగి ఉంటుందని సమాచారం. అదే HDR కంటెంట్ సమయంలో 1600 నిట్స్ గరిష్ట బ్రైట్‌నెస్‌ను కలిగి ఉంటుంది. ఐఫోన్ ప్రో మోడల్ డిస్‌ప్లే బ్రైట్‌నెస్ మెరుగవడంతోపాటు గత మోడల్ కంటే పెద్ద డిస్‌ప్లేను కలిగి ఉంటుందని తెలుస్తోంది.
ఐఫోన్ 16 ప్రో 6.27 అంగుళాల డిస్‌ప్లే మరియు ఐఫోన్ 16 ప్రో మ్యాక్స్ 6.85 అంగుళాల డిస్‌ప్లేను కలిగి ఉంటాయని తెలుస్తోంది. ఐఫోన్ 16 ప్రో మ్యాక్స్ గరిష్ఠంగా 4676mAh బ్యాటరీ, అదే ఐఫోన్ 16 ప్రో 3355mAh బ్యాటరీ, ఐఫోన్ 16.. 3,516mAh బ్యాటరీని కలిగి ఉండే అవకాశం ఉంది. అదే ఐఫోన్ 16 ప్లస్ మాత్రం 4006mAh బ్యాటరీని కలిగి ఉండే అవకాశం ఉందని తెలుస్తోంది.
ఐఫోన్ 16 ప్రో మోడళ్లు.. స్పేస్ బ్లాక్, రోజ్ టైటానియం రంగుల్లో అందుబాటులోకి వచ్చే అవకాశం ఉంది. దీంతోపాటు ఇటీవలే మరో లీక్ వెలుగులోకి వచ్చింది. ఐఫోన్ 16 ప్రో మోడళ్లు అడ్వాన్స్‌డ్ A18 ప్రో చిప్‌సెట్‌లను కలిగి ఉండే అవకాశం ఉంది. ఫోన్ వేడెక్కకుండా ఉండేలా ప్రత్యేక ఏర్పాట్లు చేస్తున్నట్లు తెలుస్తోంది.
గిజ్‌బాట్ తెలుగు వెబ్‌సైట్ గ్యాడ్జెట్లు సహా ఇతర టెక్ న్యూస్‌కు సంబంధించిన ఆసక్తికరమైన తాజా వార్తలను అందిస్తుంది. వివిధ సోషల్ మీడియాల ద్వారా సరికొత్త వార్తలను ఎప్పటికప్పుడు యూజర్లకు చేరవేస్తుంది. తాజా వార్తల కోసం సోషల్ మీడియా ఖాతాలతో కనెక్ట్ అవ్వండి. మీకు ఏదైనా వార్త నచ్చితే లైక్ చేయండి. కామెంట్ చేయడం మర్చిపోవద్దు. అలానే మీతోటి స్నేహితులతో ఈ వార్తను పంచుకోగలరు.


Click it and Unblock the Notifications








