మరో మూడు రోజుల్లో ఆపిల్ Its Glowtime ఈవెంట్.. ఐఫోన్ 16 సిరీస్ ధరలు లీక్.. పూర్తి వివరాలు..!
టెక్ దిగ్గజం ఆపిల్ సెప్టెంబర్ 9న its Glowtime ఈవెంట్‌ను నిర్వహించనుంది. ఈ ఈవెంట్‌లో ఐఫోన్ 16 సిరీస్ విడుదల కానుంది. దీంతోపాటు మరిన్ని ఉత్పత్తులను ఆపిల్ సంస్థ లాంచ్ చేయనుంది. ఈ ఐఫోన్ 16 సిరీస్‌లో (iPhone 16 Series) భాగంగా ఐఫోన్ 16, ఐఫోన్ 16 ప్లస్, ఐఫోన్ 16 ప్రో, ఐఫోన్ 16 ప్రో మ్యాక్స్ మోడళ్లు విడుదల కానున్నాయి. ఇప్పటికే ఈ సిరీస్ అప్‌డేట్లు ఇంటర్నెట్‌లో ట్రెండింగ్‌లో ఉన్నాయి. మరియు వీటి ధరలపై పెద్ద ఎత్తున చర్చ జరుగుతోంది. ఇప్పటికే ఐఫోన్ 16, ప్రో మ్యాక్స్ మోడల్ ధరలు లీక్ అవ్వగా.. తాజాగా సిరీస్ ధరల అంచనాలు వెల్లడయ్యాయి.
ఐఫోన్ 16 మోడల్ ప్రారంభ ధర ఐఫోన్ 15 మోడల్ తరహాలోనే ఉండే అవకాశం ఉంది. లీక్ అయిన వివరాల ఆధారంగా ఐఫోన్ 16 హ్యాండ్‌సెట్ ప్రారంభ ధర రూ.79,900 గా ఉండే అవకాశం ఉంది. అదే ఐఫోన్ 16 ప్లస్ మోడల్ ప్రారంభ ధర రూ.89,900 గా ఉండే అవకాశం ఉంది. అయితే తర్వాత వెర్షన్‌లో ప్లస్ మోడల్‌ను నిలిపివేసే అవకాశం ఉందని తెలుస్తోంది.

ఐఫోన్ 16 ప్రో మోడల్ ధర.. (iPhone 16 Series Price Leaked) ఐఫోన్ 15 ప్రో మోడల్ కంటే ఎక్కువగా ఉంటుందని అంచనా వేస్తున్నారు. కనీసం రూ.10,000 ధర ఎక్కువగా ఉంటుందని భావిస్తున్నారు. అంటే ప్రో మోడల్ ప్రారంభ ధర రూ.1,44,990 గా ఉంటుందని అనేక మంది అంచనా వేస్తున్నారు.
ఐఫోన్ 16 ప్రో మ్యాక్స్ ఆపిల్ ఇంటెలిజెన్స్ ఫీచర్లతో అందుబాటులోకి రానుంది. ఫలితంగా ఐఫోన్ 16 ప్రో మ్యాక్స్ (Apple iPhone 16 Pro Max) ప్రారంభ ధరతో పోలిస్తే.. 16 సిరీస్ హైఎండ్ వేరియంట్ ధర కూడా పెరిగే అవకాశం ఉంది. ఈ హ్యాండ్‌సెట్ ప్రారంభ ధర రూ.1,70.000 గా ఉంటుందని అంచనా వేస్తున్నారు.
ఈ ఆపిల్ ఈవెంట్‌లో (Apple iPhone 16 Launch Event) ఐఫోన్ 16 సిరీస్‌తోపాటు ఆపిల్ వాచ్ 10 సిరీస్, వాచ్ SE, వాచ్ అల్ట్రా, ఆపిల్ ఎయిర్‌పాడ్స్ 4 కూడా విడుదల కానుందని తెలుస్తోంది. అయితే ఈ ధరలు సహా ఇతర వివరాలపై ఆపిల్ సంస్థ ఎటువంటి వివరాలను వెల్లడించలేదు. సెప్టెంబర్ 9వ తేదీన పూర్తి వివరాలు వెల్లడి కానున్నాయి.
ఐఫోన్ 16 సిరీస్‌లో ప్రో, ప్రో మ్యాక్స్ మోడళ్లు గత సిరీస్‌తో పోలిస్తే అనేక అప్‌గ్రేడ్‌లను పొందే అవకాశం ఉంది. డిజైన్, చిప్‌సెట్, బ్యాటరీ, డిస్‌ప్లే సహా కెమెరా విభాగాల్లో మార్పులు వచ్చే అవకాశం ఉంది. ఈ ప్రో మోడళ్లు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఆధారిత సామర్థ్యాలను కలిగి ఉంటాయని తెలుస్తోంది.
ఐఫోన్ 16 సిరీస్ విడుదల సహా ఇతర కీలక ప్రకటనల కోసం Its Glowtime పేరుతో ఆపిల్ ఈవెంట్‌ను నిర్వహిస్తుంది. ఈ ఈవెంట్ సెప్టెంబర్ 9వ తేదీన ఆపిల్ పార్క్‌లోని స్టీవ్ జాబ్స్ థియేటర్‌లో నిర్వహించనున్నారు. భారత కాలమానం ప్రకారం 10.30PM IST ఆపిల్ ఈవెంట్ ప్రారంభం కానుంది. ఆపిల్ అధికారిక వైబ్‌సైట్, యూట్యూబ్ ఛానల్ ద్వారా ఈవెంట్ లైవ్ చూడవచ్చు.


Click it and Unblock the Notifications








