ఆపిల్ ఐఫోన్ 16 సిరీస్ సేల్ ప్రారంభం.. ఆపిల్ స్టోర్‌ల వద్ద భారీగా క్యూ.. సేల్ పూర్తి వివరాలు..!
ఆపిల్ ఇటీవల నిర్వహించిన its Glowtime ఈవెంట్‌లో ఐఫోన్ 16 సిరీస్ స్మార్ట్‌ఫోన్లు (Apple iPhone 16 Series) లాంచ్ అయ్యాయి. ఈ సిరీస్ యాపిల్ ఇంటెలిజెన్స్ ఫీచర్‌లతో అందుబాటులోకి వచ్చింది. ఈ సిరీస్‌లో భాగంగా ఐఫోన్ 16, ఐఫోన్ 16 ప్లస్, ఐఫోన్ 16 ప్రో, ఐఫోన్ 16 ప్రో మ్యాక్స్ స్మార్ట్‌ఫోన్‌ల ముందస్తు ఆర్డర్‌లు ఇటీవలే ప్రారంభం అయ్యాయి. ఇవాళ్టి నుంచి భారత్‌లో సేల్ ప్రారంభం అయింది. దీంతో ఐఫోన్‌లను కొనుగోలు చేసేందుకు ఆపిల్ స్టోర్‌ల ఎదుట భారీగా క్యూ కట్టారు. ముంబయి, దిల్లీలోని ఆపిల్ స్టోర్‌ల బయట భారీ సంఖ్యలో క్యూ కట్టారు. ఇందుకు సంబంధించిన వీడియోను సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.
ఆపిల్ ఐఫోన్ 16 సిరీస్‌ను ఆపిల్ స్టోర్, ఆపిల్ ఇండియా వెబ్‌సైట్, అమెజాన్, ఫ్లిప్‌కార్ట్ ద్వారా కొనుగోలు చేయవచ్చు. సమీపంలోని స్టోర్‌లలోనూ కొనుగోలు చేయవచ్చు. ఈ ఐఫోన్ 16 సిరీస్ యాక్షన్ బటన్, అడ్వాన్స్‌డ్ కెమెరా కంట్రోల్ బటన్‌లను కలిగి ఉంది. శక్తివంతమైన A18 చిప్‌సెట్‌తో పనిచేస్తుంది. మరియు ఆపిల్ ఇంటెలిజెన్స్ ఫీచర్‌లను కలిగి ఉంటుంది.

ఐఫోన్ 16 మోడల్ ధర
128GB ధర రూ.79,900
256GB స్టోరేజీ ధర రూ.89,900
512GB స్టోరేజీ ధర రూ.1,09,900
ఐఫోన్ 16 ప్లస్ స్మార్ట్‌ఫోన్ ధర
128GB స్టోరేజీ ధర రూ.89,900
256GB స్టోరేజీ ధర రూ.99,900
512GB స్టోరేజీ ధర రూ.1,19,900

ఐఫోన్ 16 ప్రో ధర
128GB స్టోరేజీ ధర రూ.1,19,900
256GB స్టోరేజీ ధర రూ.1,29,900
512GB స్టోరేజీ ధర రూ.1,49,900
1TB స్టోరేజీ ధర రూ.1,69,900
ఐఫోన్ 16 ప్రో మ్యాక్స్ ధర
256GB స్టోరేజీ ధర రూ.1,44,900
512GB స్టోరేజీ ధర రూ.1,64,900
1TB స్టోరేజీ ధర రూ.1,84,900
ఐఫోన్ 16, ప్లస్ మోడళ్లు బ్లాక్, పింక్, టీల్, అల్ట్రామెరిన్, వైట్ రంగుల్లో లభిస్తాయి. అదే ప్రో మోడళ్లు బ్లాక్ టైటానియం, డిజర్ట్ టైటానియం, నేచురల్ టైటానియం, వైట్ టైటానియం రంగుల్లో లభిస్తాయి. ఆపిల్ స్టోర్‌లతోపాటు అమెజాన్, ఫ్లిప్‌కార్ట్ సహా ఇతర ఆఫ్‌లైన్ స్టోర్‌లోనూ కొనుగోలు చేయవచ్చు.
ఆపిల్ స్టోర్‌లో ఐఫోన్ 16 సిరీస్‌ను అమెరికన్ ఎక్స్‌ప్రెస్, యాక్సెస్ బ్యాంక్, ఐసీఐసీఐ బ్యాంకు కార్డులతో కొనుగోలు చేస్తే రూ.5000 తగ్గింపును పొందవచ్చు. దీంతోపాటు 3 నుంచి 6 నెలలపాటు నోకాస్ట్ EMI సదుపాయాన్ని పొందవచ్చు. పాత ఐఫోన్‌లను ఎక్స్చేంజీ చేయడం ద్వారా రూ.67,500 వరకు తగ్గింపు ప్రయోజనాలను పొందవచ్చు.
ఐఫోన్ 16 మోడల్.. 6.1 అంగుళాల డిస్‌ప్లేను కలిగి ఉంటుంది. అదే ప్లస్ మోడల్ 6.7 అంగుళాల డిస్‌ప్లేను కలిగి ఉంటుంది. ఈ రెండు మోడళ్లు iOS 18 ను కలిగి ఉంటాయి. మరియు ఆపిల్ A18 పైన పనిచేస్తాయి. 48MP ప్రైమరీ కెమెరా, 2x జూమింగ్‌తో 12MP అల్ట్రావైడ్ కెమెరా మరియు సెల్ఫీ, వీడియో కాల్స్ కోసం 12MP సెల్ఫీ కెమెరాను కలిగి ఉంటాయి.

ఐఫోన్ 16 ప్రో మోడళ్లు 6.3 అంగుళాల డిస్‌ప్లేను కలిగి ఉంది. అదే ప్రో మ్యాక్స్ మోడల్ 6.9 అంగుళాల డిస్‌ప్లేను కలిగి ఉంటుంది. ఈ మోడళ్లు iOS 18 సహా ఆపిల్ A18 ప్రో చిప్‌సెట్ తో పనిచేస్తుంది. ఈ ప్రో మోడళ్లు.. 48MP ప్రధాన కెమెరా, 48MP అల్ట్రావైడ్ కెమెరా, 5x ఆప్టికల్ జూమ్‌తో 12MP టెలిఫోటో కెమెరాతో అందుబాటులో ఉంది. మరియు 12MP సెల్ఫీ కెమెరాను కలిగి ఉంది.


Click it and Unblock the Notifications








