Home
Mobile

ఐఫోన్ 17 ఎయిర్‌ స్మార్ట్‌ఫోన్‌ బ్యాటరీ వివరాలు లీక్‌.. స్పెసిఫికేషన్లు, ఫీచర్‌ల అంచనా వివరాలు..!

iPhone 17 Air : ఆపిల్‌ నుంచి ఐఫోన్‌ 17 సిరీస్‌ ఈ సంవత్సరం సెప్టెంబర్‌ నెలలో లాంచ్‌ అయ్యే అవకాశం ఉంది. ఈ సిరీస్‌లో భాగంగా ఐఫోన్ 17 ఎయిర్ ఫోన్‌ విడుదల కానుంది. ఇప్పటికే ఈ మోడల్‌ గురించి అనేక వివరాలు లీక్‌ అయ్యాయి. ప్రస్తుతం అందుబాటులో ఉన్న వివరాలు ఆధారంగా ఐఫోన్ 17 ఎయిర్‌ హ్యాండ్‌సెట్‌ అల్ట్రా థిన్‌ డిజైన్‌ను కలిగి ఉంటుంది. మరియు చాలా తక్కువ బరువును కలిగి ఉంటుందని తెలుస్తోంది.

సన్నని ఐఫోన్‌ మోడల్‌ గా :
ఐఫోన్‌ 17 ఎయిర్‌ బ్యాటరీ సహా ఇతర వివరాలు లీక్‌ అయ్యాయి. కొరియన్‌ బ్లాగ్‌ Yeux1122 ఆధారంగా ఈ ఫోన్ 5.5mm థిక్‌నెస్‌తో 145 గ్రాముల బరువును కలిగి ఉంటుందని తెలుస్తోంది. అత్యంత సన్నని మరియు తక్కువ బరువు కలిగిన ఐఫోన్‌గా ఐఫోన్ 17 ఎయిర్ గుర్తింపు పొందనుందని తెలుస్తోంది.

Apple iPhone 17 air Smartphone

బ్యాటరీ వివరాలు :
తాజాగా ఐఫోన్ 17 ఎయిర్ మోడల్‌ బ్యాటరీ వివరాలు కూడా లీక్‌ అయ్యాయి. ఈ ఫోన్‌ కేవలం 2800mAh బ్యాటరీతో పనిచేస్తుందని తెలుస్తోంది. బ్యాటరీ సామర్థ్యం నిరాశపరిచే అవకాశం ఉంది. ఎందుకంటే ప్రస్తుతం భారీ బ్యాటరీతో ఫోన్‌లు అందుబాటులోకి వస్తున్నాయి. శాంసంగ్‌ నుంచి ఇటీవల లాంచ్‌ అయిన గెలాక్సీ S25 ఎడ్జ్‌ హ్యాండ్‌సెట్‌ కూడా స్లిమ్‌ డిజైన్‌తో విడుదల అయింది. అయితే 3900mAh బ్యాటరీని కలిగి ఉంది.

ప్రత్యేక బ్యాటరీ టెక్నాలజీతో ఐఫోన్‌ 17! :
అయితే ఆపిల్‌ ప్రత్యేకమైన బ్యాటరీ టెక్నాలజీని ఉపయోగిస్తుంది. ఫలితంగా సాధారణం కంటే సుమారు 15-20 శాతం మెరుగైన బ్యాటరీ లైఫ్‌ను అందిస్తుంది. ఐఫోన్ 17 ఎయిర్‌ కూడా ఇదే తరహాలో బ్యాటరీ లైఫ్‌ను అందించే అవకాశం ఉంది.

ఈ ఐఫోన్‌ ఎయిర్ మోడల్‌ 6.6 అంగుళాల డిస్‌ప్లేను కలిగి ఉంటుందని తెలుస్తోంది. దీంతోపాటు మరో వార్త వైరల్‌ అవుతోంది. దీని ఆధారంగా ఐఫోన్‌ 17 ఎయిర్‌ మోడల్‌ వెనుక వైపు అల్ట్రావైడ్‌ యాంగిల్‌ కెమెరాను కలిగి ఉండే అవకాశం లేదని తెలుస్తోంది. ఫలితంగా ఇతర అంతర్గత విభాగాలకు ఎక్కువ స్పేస్‌ ఉంటుందని భావిస్తున్నట్లు సమాచారం.

ఐఫోన్ 17 ఎయిర్‌ స్మార్ట్‌ఫోన్ కెమెరా విభాగం పరంగా వెనుక వైపు సింగిల్‌ కెమెరాను కలిగి ఉంటుందని తెలుస్తోంది. వెనుక వైపు కేవలం 48MP కెమెరాను మాత్రమే కలిగి ఉంటుందని సమాచారం. అయితే ముందువైపు 24MP సెల్ఫీ కెమెరాతో లాంచ్ కానుందని భావిస్తున్నారు. ఎయిర్‌ మోడల్‌ A19 చిప్‌ తో పనిచేసే అవకాశం ఉంది.

ప్రస్తుతం అందుబాటులో ఉన్న వివరాల ఆధారంగా ఐఫోన్‌ 17 సిరీస్‌ ఈ సంవత్సరం సెప్టెంబర్ నెలలో విడుదల అయ్యే అవకాశం ఉంది. ఈ సిరీస్‌లో భాగంగా ఐఫోన్ 17, ఐఫోన్‌ 17 ఎయిర్‌, ఐఫోన్‌ 17 ప్రో, ఐఫోన్‌ 17 ప్రో మ్యాక్స్‌ మోడల్స్‌ లాంచ్‌ కానున్నాయి.

అయితే గత మోడల్స్‌తో పోలిస్తే ఐఫోన్ 17 సిరీస్‌ లో చాలా అప్‌గ్రేడ్‌ను గుర్తించవచ్చు. అయితే ఆపిల్‌ ఫోన్‌ల ధరలు పెరిగే అవకాశం ఉందని ఇటీవల ఓ నివేదిక వెల్లడించింది. అయితే ఐఫోన్‌ 17 సిరీస్‌ పై ఈ ప్రభావం ఉంటుందా లేదా అనేది తెలియాల్సి ఉంది.

More from GizBot

Best Mobiles in India

English summary
Apple iPhone 17 air battery specifications leaked here are the expected details
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X