12GB ర్యామ్, అధునాతన కూలింగ్ సిస్టమ్‌తో ఐఫోన్.. స్పెసిఫికేషన్‌లు, ఫీచర్‌లు వివరాలు..!!
ప్రముఖ టెక్ దిగ్గజం ఆపిల్ తన ఐఫోన్ 16 సిరీస్ ను సెప్టెంబర్ 9 న విడుదల చేయనుంది. ఇప్పటికే ఈ సిరీస్ స్పెసిఫికేషన్‌లు, ఫీచర్ ల వివరాలు లీక్ అయ్యాయి. అయితే ఐఫోన్ 17 సిరీస్ (Apple iPhone 17 Series) గురించి కొన్ని వివరాలు చక్కర్లు కొడుతున్నాయి. ఈ ఐఫోన్ 17 సిరీస్ 2025 సెప్టెంబర్‌లో లాంచ్ అయ్యే అవకాశం ఉంది. ఐఫోన్ 16 సిరీస్ కంటే భారీ అప్‌గ్రేడ్ లతో రానుందని తెలుస్తోంది. మెమొరీ అప్‌గ్రేడ్ లను కూడా కలిగి ఉంటుందని తెలుస్తోంది.
ప్రముఖ అనలిస్ట్ Ming chi kuo ఇటీవల ఐఫోన్ 17 ప్రో మ్యాక్స్ స్పెసిఫికేషన్ ల గురించి వివరాలు వెల్లడించారు. ఐఫోన్ 17 ప్రో పోలిస్తే అధిక ర్యామ్ మరియు మెరుగైన కూలింగ్ సిస్టమ్‌ను కలిగి ఉంటుందని తెలుస్తోంది. తన X అకౌంట్ ద్వారా ఈ హ్యాండ్‌సెట్ వివరాలను వెల్లడించారు.

మింగ్ చి కూ ఆధారంగా ఐఫోన్ 17 ప్రో మ్యాక్స్ స్మార్ట్ ఫోన్ 12GB ర్యామ్ లో విడుదలయ్యే అవకాశం ఉందని తెలిపారు. ప్రస్తుతం అందుబాటులో ఉన్న ఐఫోన్ 15 ప్రో మోడల్ 8GB ర్యామ్ ను కలిగి ఉంది. త్వరలో విడుదల కానున్న ఐఫోన్ 16 సిరీస్ స్మార్ట్ ఫోన్ కూడా 8GB ర్యామ్‌తో లాంచ్ కానుందని తెలుస్తోంది.
అయితే ఐఫోన్ 17 ప్రో మ్యాక్స్ స్మార్ట్‌ఫోన్ లో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఫీచర్ ప్రధానంగా ఆకట్టుకుంటుందని భావిస్తున్నట్లు తెలిపారు. అయితే ఐఫోన్ 17, 17 ప్రో, ఐఫోన్ SE 4 మరియు ఐఫోన్ 17 సన్నని ఫోన్ (Slim) మోడళ్లు 8GB ర్యామ్ తో విడుదలయ్యే అవకాశం ఉందని తెలిపారు.
ఐఫోన్ 17 ప్రో మ్యాక్స్ మోడల్ వేపర్ ఛాంబర్ టెక్నాలజీతో అప్ గ్రేడ్ చేయబడిన కూలింగ్ సిస్టమ్ తో లాంచ్ అయ్యే అవకాశం ఉందని చెప్పారు. అదే మిగిలిన మోడళ్లు గ్రాఫైట్ షీట్‌లను కలిగి ఉంటుంది. థర్మల్ మేనేజ్‌మెంట్ కోసం వీటిని ఉపయోగిస్తుంది. ఈ సిరీస్ విడుదల అయ్యేందుకు సుమారుగా సంవత్సరం సమయం ఉంది. మరిన్ని అప్‌గ్రేడ్ లను కలిగి ఉండే అవకాశం ఉంది.
ఐఫోన్ 16 సిరీస్ స్మార్ట్‌ఫోన్ ల లాంచ్ ఈవెంట్ సెప్టెంబర్ 9వ తేదీన నిర్వహించనున్నారు. ఆపిల్ పార్క్‌లోని స్టీవ్ జాబ్స్ థియేటర్‌లో ఈ ఈవెంట్ జరగనుంది. ఈ ఈవెంట్‌లో ఐఫోన్ 16 సిరీస్ మరియు సిరీస్ 10ని ఆవిష్కరించే అవకాశం ఉంది. ఇప్పటికే స్పెసిఫికేషన్లు, ఫీచర్‌ల వివరాలు లీక్ అయ్యాయి.
గిజ్‌బాట్ తెలుగు వెబ్‌సైట్ గ్యాడ్జెట్లు సహా ఇతర టెక్ న్యూస్‌కు సంబంధించిన ఆసక్తికరమైన తాజా వార్తలను అందిస్తుంది. వివిధ సోషల్ మీడియాల ద్వారా సరికొత్త వార్తలను ఎప్పటికప్పుడు యూజర్లకు చేరవేస్తుంది. తాజా వార్తల కోసం సోషల్ మీడియా ఖాతాలతో కనెక్ట్ అవ్వండి. మీకు ఏదైనా వార్త నచ్చితే లైక్ చేయండి. కామెంట్ చేయడం మర్చిపోవద్దు. అలానే మీతోటి స్నేహితులతో ఈ వార్తను పంచుకోగలరు.


Click it and Unblock the Notifications







