Home
Mobile

ఐఫోన్ 17 సిరీస్‌ ఎప్పుడు విడుదల కానుంది..? అంచనా స్పెసిఫికేషన్‌లు, ఫీచర్‌ల వివరాలు

iPhone 17 Series : ఆపిల్‌ నుంచి ఈ సంవత్సరం ఐఫోన్ 17 సిరీస్‌ విడుదల కానుంది. ఈ సిరీస్‌లో భాగంగా ఐఫోన్‌ 17, ఐఫోన్‌ 17 ఎయిర్‌, ఐఫోన్‌ 17 ప్రో, ఐఫోన్ 17 ప్రో మ్యాక్స్‌ స్మార్ట్‌ఫోన్‌లు అందుబాటులోకి రానున్నాయి. ఐఫోన్‌ 17 సిరీస్‌లో ప్రత్యేకంగా ఎయిర్‌ మోడల్‌ను లాంచ్‌ చేస్తున్నారు. ఈ ఫోన్ సన్నని మరియు తక్కువ బరువును కలిగి ఉంటుందని ఇప్పటికే లీక్స్‌ వస్తున్నాయి. గత సిరీస్‌లో ప్లస్‌ వేరియంట్‌ను ఆపిల్‌ విడుదల చేసింది.

ఎప్పుడు విడుదల అయ్యే అవకాశం ఉంది? :
ఐఫోన్ 17 సిరీస్‌ ఈ సంవత్సరం సెప్టెంబర్‌ రెండో వారంలో విడుదలయ్యే అవకాశం ఉందని తెలుస్తోంది. ఇప్పటికే ఈ సిరీస్‌ గురించి అనేక వివరాలు లీక్‌ అయ్యాయి. ఈ లీక్స్ ఆధారంగా గత సిరీస్‌ కంటే ఐఫోన్ 17 మోడల్స్‌ ఆకట్టుకొనే డిజైన్‌ సహా అప్‌గ్రేడ్‌ ఫీచర్లను కలిగి ఉంటాయని తెలుస్తోంది.

Apple iPhone 17 serie

డిస్‌ప్లే అంచనా వివరాలు :
ముఖ్యంగా డిస్‌ప్లే పరంగా కీలక మార్పులను గుర్తించవచ్చని తెలుస్తోంది. ఐఫోన్ 17 హ్యాండ్‌సెట్‌ 6.3 అంగుళాలు, అదే ఐఫోన్‌ 17 ఎయిర్‌ మోడల్‌ 6.6 అంగుళాల డిస్‌ప్లేను కలిగి ఉంటుందని సమాచారం. మరియు ఐఫోన్‌ 17 ప్రో మోడల్‌ 6.3 అంగుళాల డిస్‌ప్లే మరియు ప్రో మ్యాక్స్‌ ఫోన్‌ 6.9 అంగుళాల డిస్‌ప్లేతో అందుబాటులోకి వచ్చే అవకాశం ఉంది.

దీంతోపాటు ఈ సిరీస్‌ హ్యాండ్‌సెట్స్‌ 120Hz ప్రో మోషన్‌, యాంటీ రిఫ్లెక్టివ్‌, స్క్రాచ్‌ రెసిస్టెంట్‌ డిస్‌ప్లేలుగా ఉంటాయని తెలుస్తోంది. దీంతోపాటు బ్యాటరీ పరంగానూ మెరుగైన స్పెసిఫికేషన్‌లను కలిగి ఉంటుందని తెలుస్తోంది. దీంతోపాటు ప్రత్యేకంగా వైఫై చిప్‌ను తీసుకొచ్చే అవకాశం ఉందని సమాచారం. ఐఫోన్‌ 17 సిరీస్‌ వైఫై 7 తో అందుబాటులోకి వస్తుందని తెలుస్తోంది.

చిప్‌సెట్‌ వివరాలు :
ప్రస్తుతం అందుబాటులో ఉన్న వివరాల ఆధారంగా ఐఫోన్ 17, ఐఫోన్‌ 17 ఎయిర్‌ మోడల్స్‌ A19 చిప్‌ తో పనిచేసే అవకాశం ఉంది. మరియు ఈ చిప్‌ గరిష్ఠంగా 8GB ర్యామ్‌ను సపోర్టు చేస్తుందని సమాచారం. అదే ఐఫోన్‌ 17 ప్రో మరియు ఐఫోన్‌ 17 ప్రో మ్యాక్స్ మోడల్స్‌ A19 ప్రో చిప్‌సెట్‌తో పనిచేసే అవకాశం ఉంది.

కెమెరా విభాగం పరంగా కీలక మార్పులు? :
అన్నింటి కంటే ముఖ్యంగా కెమెరా విభాగం పరంగా కీలక మార్పులు రానున్నాయని తెలుస్తోంది. ఐఫోన్‌ 16 సిరీస్‌ 12MP సెల్ఫీ కెమెరాతో అందుబాటులోకి వచ్చాయి. అయితే ఐఫోన్ 17 సిరీస్‌ ఫోన్‌లు మాత్రం 24MP సెల్ఫీ కెమెరాను కలిగి ఉంటాయని తెలుస్తోంది.

దీంతోపాటు వెనుక కెమెరాలను కూడా మెరుగైన స్పెసిఫికేషన్‌లను కలిగి ఉండనున్నాయని సమాచారం. ఐఫోన్‌ 17 ప్రో మ్యాక్స్‌ హ్యాండ్‌సెట్‌ వెనుక వైపు ట్రిపుల్‌ కెమెరాలను కలిగి ఉంటుందని అంచనా వేస్తున్నారు. ఇందులో 48MP కెమెరాతోపాటు అల్ట్రావైడ్‌, టెలిఫోటో లెన్స్‌లను కలిగి ఉంటుందని సమాచారం. పైన తెలిపిన వివరాలపై ఆపిల్‌ ఎటువంటి అధికారిక ప్రకటన విడుదల చేయలేదు.

Best Mobiles in India

English summary
Apple iPhone 17 series may launch in september 2025 here are the expected features
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X