కొత్త ఐఫోన్ వచ్చేసింది.. Magsafe ఛార్జింగ్, A19 చిప్, సిరామిక్ షీల్డ్ 2 ప్రొటెక్షన్ సహా సూపర్ ఫీచర్లు..
Apple iPhone 17e Launch : ఆపిల్ ఐఫోన్ 17e భారత్ సహా ఇతర మార్కెట్లలో విడుదల అయింది. గత సంవత్సరం లాంచ్ అయిన ఐఫోన్ 16e మోడల్‌కు తర్వాత తరం వెర్షన్‌లా అందుబాటులోకి వచ్చింది. చిప్‌సెట్ సహా అనేక మార్పులను కొత్త ఐఫోన్‌లో గమనించవచ్చు. MagSafe ఛార్జింగ్ తోపాటు డిస్‌ప్లే ప్రొటెక్షన్‌ను మెరుగుపరిచినట్లు ఆపిల్ చెబుతోంది.
ఐఫోన్ 17e స్పెసిఫికేషన్‌లు, ఫీచర్లు :
ఐఫోన్ 17e మోడల్ 6.1 అంగుళాల సూపర్ రెటీనా XDR డిస్‌ప్లేతో విడుదల అయింది. 60Hz రీఫ్రెష్ రేట్, 800 నిట్స్ పీక్ బ్రైట్‌నెస్ ను కలిగి ఉంది. ఈ డిస్‌ప్లే సిరామిక్ షీల్డ్ 2 ప్రొటెక్షన్‌ను కలిగి ఉంది. ఐఫోన్ 16e మోడల్ కలిగిన గ్లాస్‌తో పోలిస్తే 3 రెట్లు పటిష్ఠంగా ఉంటుందని ఆపిల్ చెబుతోంది.

ఐఫోన్ 17e మోడల్ A19 చిప్‌తో పనిచేస్తుంది. 8GB ర్యామ్‌తో 256GB, 512GB స్టోరేజీల్లో లభిస్తుంది. C1x సెల్యూలర్ మోడెమ్ కూడా ఉంది. ఈ ఐఫోన్ కూడా యాక్షన్ బటన్‌ను కలిగి ఉంది. దీంతోపాటు అనేక ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఫీచర్లు ఉన్నాయి.
ఈ ఫోన్ iOS 26 పైన పనిచేస్తుంది. శాటిలైట్ కనెక్టివిటీ ఫీచర్‌ను కూడా కలిగి ఉంది. ఫలితంగా నెట్‌వర్క్ లేని మారుమూల ప్రాంతాల నుంచి అత్యవసర సమయాల్లో మెసేజ్‌లు పెంపేందుకు అవకాశం ఉంటుంది. ఈ ఐఫోన్ వైట్, సాఫ్ట్ పింక్, బ్లాక్ కలర్ వేరియంట్స్‌లో లభిస్తుంది.

48MP OIS కెమెరా :
కెమెరా విభాగం పరంగా వెనుక వైపు ఆప్టికల్ ఇమేజ్ స్టెబిలైజేషన్ (OIS) సపోర్టుతో 48MP కెమెరా ఉంది. ఆప్టికల్ క్వాలిటీ 2x జూమ్ ను సపోర్టు చేస్తుందని ఆపిల్ చెబుతోంది. తక్కువ వెలుగులోనూ ఆకట్టుకొనే ఫోటోలను క్యాప్చర్ చేయవచ్చు. 4K వీడియోలను రికార్డు చేయవచ్చు. సెల్ఫీ, వీడియో కాల్స్ కోసం 12MP కెమెరాను అమర్చారు.
ఛార్జింగ్ లో మార్పులు :
ఐఫోన్ 16e మోడల్‌లో లేని మరో ఫీచర్ ఐఫోన్ 17e లో ఉంది. 17e ఫోన్ Magsafe వైర్‌లెస్ ఛార్జింగ్ సపోర్టును కలిగి ఉంది. 20W వైర్ ఛార్జింగ్, 15W వైర్‌లెస్ ఛార్జింగ్‌ను సపోర్టు చేస్తుంది. గత మోడల్‌తో పోలిస్తే బ్యాటరీ సామర్థ్యాన్ని కూడా మెరుగుపరిచినట్లు ఆపిల్ చెబుతోంది. ఒక్కసారి పూర్తిగా ఛార్జింగ్ చేసి 26 గంటల ప్లేబ్యాక్ టైమ్‌ను పొందవచ్చని తెలిపింది.
భద్రత కోసం ఫేస్ ఐడీని కలిగి ఉంది. కనెక్టివిటీ పరంగా 5G, 4G LTE, బ్లూటూత్ 5.3, వైఫై 6, NFC, NavIc, GPS ఫీచర్లు ఉన్నాయి. యాక్సెలిరోమీటర్, గైరోస్కోప్, ప్రాక్సిమిటీ, బారోమీటర్ సెన్సర్‌లున్నాయి. IP68 రేటింగ్‌తో డస్ట్, వాటర్ రెసిస్టెంట్‌గా ఉంది.
ఐఫోన్ 17e ధర, సేల్ వివరాలు :
ఐఫోన్ 17e స్మార్ట్‌ఫోన్ 256GB స్టోరేజీ వేరియంట్ ధర రూ.64,900 గా ఉంది. 512GB స్టోరేజీ వేరియంట్ ధర రూ.84900 గా ఉంది. మార్చి 4 వ తేదీ నుంచి ముందస్తు బుకింగ్ ప్రారంభం కానుంది. మార్చి 11 నుంచి సేల్ ప్రారంభం కానుంది. ఆపిల్ వెబ్‌సైట్‌తోపాటు ఇతర భాగస్వామ్య రిటైల్ స్టోర్‌లను నుంచి కొనుగోలు చేయవచ్చు.
ఫోటోలు : ఆపిల్ వెబ్‌సైట్


Click it and Unblock the Notifications








