ఐఫోన్ లవర్స్ కి గుడ్ న్యూస్,ఒకేసారి 3 మోడల్స్ ఐఫోన్లను లాంచ్ చేయనున్న ఆపిల్
టెక్నాలజీ దిగ్గజం ఆపిల్ ఇతర స్మార్ట్ ఫోన్ దిగ్గజాలకు భారీ షాక్ ఇచ్చేందుకు రెడీ అయినట్లు తెలుస్తోంది. ఇందులో భాగంగా ఈ ఏడాది మూడు మోడల్స్ ఐఫోన్లను లాంచ్ చేసేందుకు ప్లాన్ చేస్తుంది.
టెక్నాలజీ దిగ్గజం ఆపిల్ ఇతర స్మార్ట్ ఫోన్ దిగ్గజాలకు భారీ షాక్ ఇచ్చేందుకు రెడీ అయినట్లు తెలుస్తోంది. ఇందులో భాగంగా ఈ ఏడాది మూడు మోడల్స్ ఐఫోన్లను లాంచ్ చేసేందుకు ప్లాన్ చేస్తుంది.iPhone 9,iPhone 11, iPhone 11 Plus పేర్లతో లాంచ్ చేయబోతున్నట్టు పుకార్లు వినిపిస్తున్నాయి. ఎంట్రీ లెవల్ డివైజ్‌ను 6.1 అంగుళాల స్క్రీన్‌లో తీసుకొస్తుండగా. ఇతర వేరియంట్లను 5.8 , 6.46 అంగుళాలలో లాంచ్ చేయబోతుంది. జర్మన్ టెలికాం ఆపరేటర్లు చెప్పిన సమాచారం ప్రకారం ఆపిల్ ఈ మూడు ఐఫోన్లను సెప్టెంబర్ 12న కాలిఫోర్నియాలోని లాంచ్ చేస్తునట్టు తెలిసింది. ఈ ఫోన్ల యొక్క ప్రీ-ఆర్డర్లు సెప్టెంబర్ 14నే ప్రారంభం కాబోతున్నాయట. కొత్తగా లాంచ్ అవబోతున్న ఈ ఆపిల్ ఐఫోన్లు సెప్టెంబర్ 21 నుంచి అందుబాటులోకి వస్తాయని తాజా రిపోర్ట్.

iPhone 9,iPhone 11,iPhone 11 Plus....
ఆపిల్ అప్‌కమింగ్ స్మార్ట్‌ఫోన్ల గురించి ఇంటర్నెట్‌లో పలు ఆసక్తికర వివరాలు చక్కర్లు కొడుతున్నాయి. ప్రీమియం వెర్షన్ ఐఫోన్ల పేరు iPhone 9,iPhone 11, iPhone 11 Plus గా రిపోర్టులు తెలుపుతున్నాయి .

ధర....
5.8 అంగుళాల ఓలెడ్ స్క్రీన్ మోడల్ ధర సుమారు రూ. 62,000 వరకు ఉండొచ్చు అదే విధంగా 6.46 అంగుళాల ఓలెడ్ స్క్రీన్ వేరియంట్ ధర సుమారు రూ.70,000 వరకు ఉంటుందని తెలుస్తోంది. బడ్జెట్ వేరియంట్ ధర రూ. 45,000 నుంచి రూ.55,000 మధ్యలో ఉంటుందట. 3జీబీ ర్యామ్‌లో, 64జీబీ, 256జీబీ స్టోరేజ్ వేరియంట్‌లో ఇది లభ్యమవుతుందని రూమర్లు వినిస్పిస్తున్నాయి.

స్టైలస్ ఫీచర్....
స్టైలస్ ఫీచర్ అంటే ఆపిల్ పెన్సిల్ సపోర్టుతో ఈ స్మార్ట్‌ఫోన్లు మార్కెట్‌లోకి రాబోతున్నాయట . స్మార్ట్‌ఫోన్ దిగ్గజ కంపెనీ శాంసంగ్ ఇటీవల లాంచ్ చేసిన గెలాక్సీ నోట్ 9కు పోటీగా కూపర్టినో కంపెనీ వీటిని టీఅనుకొని రాబోతుంది.

A12 Bionic chipset తో పని చేస్తాయి....
iPhone 9,iPhone 11,iPhone 11 Plus మూడు కూడా ఆపిల్ కంపెనీ యొక్క A12 Bionic chipsetతో పనిచేస్తాయని, ప్రముఖ Face ID ఫీచర్‌ను ఇవి కలిగి ఉంటాయని సమాచారం.

ప్రీ-ఆర్డర్లు సెప్టెంబర్ 14 నుంచి ప్రారంభం.....
వీటి ప్రీ-ఆర్డర్లు కూడా వెంటనే సెప్టెంబర్ 14నే ప్రారంభం కాబోతున్నాయట. కొత్తగా లాంచ్ అవబోతున్న ఈ డివైజ్‌లు సెప్టెంబర్ 21 నుంచి అందుబాటులోకి వస్తాయని రిపోర్టులు వెల్లడించాయి.


Click it and Unblock the Notifications








